Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
సాయిబాబా లక్ష్మీబాయి కౌజల్గీ పూర్వ చరిత్రను దాదాపు పూర్తిగా చెప్పారు జనవరి 25, 1912న కపర్డే అనే భక్తునితో.
ఇక్కడ సాయి కపర్డేతోనే ఎందుకు చెప్పటం అనిపిస్తుంది. సాయి ఎవరికీ ఆ విషయాలు చెప్పినా, సాయి నోటి నుండి వెలుపడిన మాటలన్నీ సత్యాలుగా మరో ఆలోచన లేకుండా అంగీకరిస్తారు.
ఇక్కడ కపర్డేకు ఎందుకు చెప్పాడంటే, కౌజల్గీ జీవితం కపర్దేకు తెలుసు. కపర్డే సాయి పలికినవన్ని నిజాలేనని గ్రహించాడు.
సాయి అతనిని షిరిడీలో ఉంచటంలో ఎదో విశేషం ఉన్నదని అతడు గ్రహించాలి అనే ఉద్దేశ్యంతో సాయి అలా పలికాడు.
మేఘశ్యాముడు షిరిడీలోని దేవతలందరిని పూజించి, చివరకు ద్వారకామాయికి వచ్చి సాయిబాబాకు పూజ చేసేవాడు.
ఒకనాడు ఖండోబాకు పూజ చేయకుండా ద్వారకామాయికి వచ్చాడు. ఖండోబా ఆలయం తలుపులు మూసి ఉండటంతో అలా చేసినట్లు చెప్పాడు.
సాయిబాబా “ఇప్పుడు వెళ్ళి పూజ చేసిరా” అని మేఘునికి చెప్పగా సాయి ఆదేశానుసారం వేళ్ళగా ఆశ్చర్యంగా ఖండోబా మందిర తలుపులు తెరచి ఉన్నాయి. పూజ చేశాడు.
తిరిగి ద్వారకామాయికి వచ్చి బాబాకు పూజ చేశాడు. సాయి ప్రతి మాట అక్షర సత్యమయి తీరుతుంది.
అందుకని సొంత ఆలోచనలు మాని, సాయి ఆదేశాలను పాటిస్తే మంచిది. సాయి పల్కిన మాటలు గతానికి, వర్తమానానికైనా?
యం. డబ్ల్యు. ప్రధాన్ భార్య ఛోటూబాయి. వారి కుటుంబమంతా సాయి భక్తులే.
ఒక రోజు రాత్రి 11 గంటల సమయంలో అందరు గాఢనిద్రలో ఉండగా సాయి ఛోటూబాయికి స్వప్నంలో కనిపించి “ఏమిటి? నిద్రపోతున్నావా? లే, పిల్లవానికి మూర్ఛ రాబోతొంది” అన్నారు.
ఆమె నిద్ర లేచింది. పిల్లవానిని చూచింది. హాయిగా నిద్రపోతున్నాడు. జ్వరం లేదు. అనారోగ్య లక్షణాలు కూడ అతనిలో కనిపించ లేదు.
సాయి మాట సత్యమని ఆమెకు తెలుసు. వెంటనే ముందు జాగ్రత్త చర్యగా వేడి నీరు, నిప్పు, తైలం మొదలైన వాటినన్నింటిని సిద్ధం చేసుకుంది.
రాత్రి రెండు గంటలైంది. పిల్లవాడు లేచి వంకరలు తిరిగిపోతున్నాడు. అప్పుడు అతనికి కావల్సిన చికిత్స చేసింది ఆమె. పిల్లవాని మూర్ఛ తగ్గినది.
సాయి ఏమి ఎప్పుడు పలికినా సత్యమే అయి తీరుతుంది. కలలో కూడా అసత్యం కాదు.
సాయిని నమ్మే భక్తి ఏర్పడు గాక!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- షిరిడీలో నివాసం …..సాయి@366 జనవరి 23….Audio
- క్రీస్తు శకం – సాయి యుగం …..సాయి@366 డిసెంబర్ 25….Audio
- సాయి రసాన్ని చూపించిన రసాయన శాస్త్రజ్ఞుడు…..సాయి@366 జనవరి 9….Audio
- గ్రహణం వీడింది.! …..సాయి@366 జనవరి 21….Audio
- తొడిమను వీడిన దోసపండు …..సాయి@366 డిసెంబర్ 15….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
One comment on “సాయి మాట సత్యమే …..సాయి@366 జనవరి 25….Audio”
మాధవి
January 26, 2021 at 10:52 amమంచి స్టోరీ..ఆమె వాయిస్ చాలా బాగుంది..బాబా bless u.. mam..