Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
సాయి సచ్చరిత్రలో హేమాడ్ పంత్ కొందరి మహనీయుల చిత్రపటాలకు శనిపట్టింది, కాలచక్రం వీరిని కూడా వదలి పెట్టలేదు అని వ్రాశాడు.
సాయిబాబా మహాసమాధి చెదనంతవరకు, అంకిత భక్తుల ఛాయలకు కూడా గ్రహాలు వచ్చేవి కాదు, ఆ భక్తుల కీర్తికి గ్రహణం పట్టలేదు.
కానీ, సాయిబాబా మహాసమాధి చెందిన అనంతరం కొంత కాలం మాత్రమే, ముక్తారంకు గ్రహణం పట్టినట్లుంది.
నాగేష్ ఆత్మారాం సావంత్ అనే సాయి భక్తుడు ముక్తారం గూర్చి ఇలా వ్రాశాడు –
“కీ. శే. ముక్తారం శ్రీ సాయిబాబా కాలంలో షిరిడీలో ఉన్నాడు. శ్రీ సాయినాధుడు శరీరాన్ని విడిచాక, రెండు రోజులు ఈ గృహస్తుడు అక్కడి ప్రజలతో సాయిబాబా ద్వారకామాయిలో తమ స్థలంలో నన్నే కూర్చోమని ఆజ్ఞాపించారు.
నేనే వారి వారసుణ్ణి అని ఆయన ఎవరి మాటా వినక సాయిబాబా కూర్చొనే చోటుకి వెళ్లి కూర్చున్నాడు. కాసేపటికి అతనికి క్రింద నుండి సూదులు గుచ్చుకుని రక్తం కారసాగింది.
చివరకు 7 ,8 రోజులలోనే భయంకరమైన స్థితిలో అతను శ్రీవారిని (సాయిని) క్షమాభిక్షను వేడుకుని ప్రాణం విడిచాడు” అని.
ముక్తారం సాయినాధుని అంకిత భక్తుడు. ఆయన సర్వసంగ పరిత్యాగివలె షిరిడీలో సాయి సన్నిధిలో ఉండేవాడు.
మధ్యాహ్నం ఆయన ఒక రేకుల షెడ్డు అయిన తన నివాసంలో ధుని ప్రజ్వరింపచేసేవాడు.
సాయి ఆయనను హర్దాకు పంపి అక్కడ సాయిబాబా చిత్రపటాన్ని ఆవిష్కరించే సమయంలో, ముక్తారం ఎంతో ఎత్తు ఎక్కి జండా కట్టబోతుంటే, క్రిందపడి అసువులుబాసే సమయంలో సాయి షిరిడీలో ఉండే ముక్తారంను ఆదుకున్నారు. ఇది సాయికి ముక్తారం పైగల ప్రేమ.
పిచ్చి కుక్కను కూడా కొట్టనివ్వని సాయి వలె, ముక్తారంకు జీవ కారుణ్యం మెండుగా ఉండేది సాయి దానిని సమర్ధించారు కూడా.
సాయి వారసుడు కావాలని ఆయన ప్రయత్నం చేశాడని పూనా నుండి సాయి ప్రభ ప్రచురించింది.
అది అంతా కల్పితమని, ఆయన అట్టి ప్రయత్నం చేయలేదని, ఆయనకు మూలశంక వ్యాధి ఉండేదని,
ఆ కారణం వలన మరణించాడని ఒక సాయి భక్తుడు సమాచారమును వెంటనే ఆ పత్రికకు పంపగా, దానిని ప్రచురించి, గతంలో వ్రాసిన పొరపాటును సరిదిద్దుకున్నది.
సాయి స్థానాన్ని షిరిడీలోనే ఎవరైనా ఆక్రమిపచూస్తే షిరిడీవాసులు ఊరుకుంటారా?
అట్టి అపరాధము చేసిన వాని సమాధిని షిరిడీ సాయి ప్రాంగణములో కట్టనిస్తారా? అదీగాక ఆయన మరణించింది జనవరి 1919 లో.
ముక్తారం భక్తికి పట్టిన గ్రహణం తొలగిపోయింది.
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- నిరీక్షణ…..సాయి@366 అక్టోబర్ 21….Audio
- రాత్రి నిద్రించని సాయి…..సాయి@366 డిసెంబర్ 21….Audio
- సాయి రసాన్ని చూపించిన రసాయన శాస్త్రజ్ఞుడు…..సాయి@366 జనవరి 9….Audio
- ఉపాసనీ మహారాజ్ విగ్రహం …..సాయి@366 జనవరి 13….Audio
- నీవే నా తోడు నీడ …..సాయి@366 జనవరి 16….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments