దాము అన్నా – తిని చావు …..సాయి@366 జనవరి 20….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice Support By: Mrs. Jeevani


కోరికలు కోరుకుంటానంటే కాదనడు సాయి. సాయిపై భక్తి భావంతో కోరికలు తీర్చుకొనవచ్చును.

భౌతిక కోర్కెల వలయంలో నా బిడ్డలు కూరుకు పోతున్నారే, అసలు తత్వాన్ని గ్రహింపలేకున్నారే అని సాయి ఆవేదన వ్యక్తం చేశారు చాలా సందర్భాలలో.

సాయిబాబా దాము  అన్నా ఎక్కడో ఉన్న కొన్ని మామిడి పండ్లను అతని కోసం దాచి ఉంచుతాడు. అతడు వాటిని “తిని చావాలి” అన్నారు సాయి. ‘తిని చావటం’ అనేకానేక అర్దాలను స్ఫురింప చేస్తుంది.

దాము అన్నాకు సంతానం లేదన్నారు జ్యోతిష్య శాస్త్రవేత్తలు. అయినా అతను సాయిని సంతానం కోసం అర్ధించాడు. సాయి కాదనలేదు.

కానీ, జీవితంలో సంతానము మొదలైనవి మాత్రమే ఆవశ్యకమైనవి కాదు. ఇంకా వేరే ఉన్నాయి.

మనస్సు ఎంతసేపు ఇహ సంబంధ విషయాలనే కోరుతుంది. సాయి ‘తిని చావు’ అన్నారు. అంటే ఈ ప్రపంచంలో చిక్కుకున్న తర్వాత సంపాదించుకోవటం, తినటం, చావటం. ఆ తరువాత జరిగేది మరల పుట్టటం.

పుట్టకుండా అంటే పునర్జన్మ ఎత్తకుండా ఆధ్యాత్మిక సాధనాలను ఏ మాత్రమూ చేయని వారిపై ఆవేదన ఉంటుంది ఆధ్యాత్మిక మార్గదర్శి అయిన సాయికి.

పిల్లలు పుట్టిన తరువాత కూడా ఆధ్యాత్మికం వైపు దృష్టి సారించలేదు దాము అన్నా.

తరువాత తానూ వ్యాపారం చేయాలా వద్దా అని సాయిని అడగమని శ్యామాకు ఉత్తరం రాశాడు. ఇదంతా సాయికి తెలుసు.

“శేటుకు పిచ్చెత్తినది. అతని గృహమందే లోటు లేదని వ్రాయుము” అన్నారు సాయి.

ఆ అమృతమూర్తి అయిన సాయిని కూడా తన భాగస్వామిగా చేసుకుందామను కుంటాడు దాము అన్నా. సాయి అంగీకరించ లేదు.

సంతానాన్ని ఇచ్చాడు సాయి. వ్యాపారానికి సలహా ఇచ్చాడు. బిడ్డల వివాహానికి కారకుడయ్యాడు.

ఇన్ని కోర్కెలను తీర్చిన సాయి మహాసమాధి చెందితే తన గతి ఏమిటోనన్న భయం పట్టుకుంది.

అతని అంతరంగం తెలుసుకున్న సాయి తన మహాసమాధి అనంతరం కూడా అతనికి అండగా ఉంటానని భరోసా ఇచ్చాడు.

సాయి మహా సమాధి చెందారు. ఈ సారి దాము అన్నా ద్వారకామాయిలోని సజీవ సాయి చిత్రపటాన్ని ప్రార్ధించాడు

తన ప్రధమ కుమారునికి సంతానం కలగాలని. ఆ కోర్కె నెరవేరిన తరువాత తనకు రెండవ మనుమని ప్రసాదించమని వేడుకున్నాడు. ఆ కోర్కెను కూడా తీర్చాడు సాయి.

ఈనాడు 20  జనవరి. సరిగ్గా ఇదే రోజున 1941 సంIIలో దాము అన్నా సాయిలో ఐక్యం అయ్యాడు.

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles