Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support by: Mrs. Jeevani
దామోదర్ ఘనశ్యాం బాబ్రే అంటే చాలా మందికి తెలియకపోచ్చు గాని అన్నా చించినీకర్ అంటే సాయి భక్తులందరికి సుపరిచితమే.
షిరిడీలో సంతాన లక్ష్మి, సాయి రూపంలో కొలువై ఉన్నది. ఎందరో సంతాన వంతులు అయ్యారు.
ఒకసారి సాయిబాబాతో శ్యామా ”దేవా నీవు ఎందరెందరో కోరికలను తీరుస్తావు కానీ ఈ అన్నా చించినీకర్, లక్ష్మి బాయి మిమ్మల్ని సేవిస్తున్నా ఒక్క బిడ్డను కూడ ప్రసాదింపవేమి?” అని ప్రశ్నించాడు.
అప్పుడు సాయి ”ఎవరైనా మనస్ఫూర్తిగా, ఏదైనా కోరితే నేను ప్రసాదించక పోవటం ఎప్పుడైనా జరిగిందా? ఈ దంపతులు నన్నేమి కోరలేదు. కావాలంటే వారినే అడుగు.
వారికి నిజంగా బిడ్డ కావాలా? ఇస్తాను. కానీ, ఎలాగైనా ఇతని వంశం ఒక్క తరం మాత్రమే కొనసాగుతుంది. కనుక ఇతని పేరును చిరస్మరణీయం చేయాలనుకుంటున్నాను” అన్నారు.
సాయి ఆ దంపతుల పేరు చిరస్మరణీయం చేశాడు. ఎలా?
ఒక కేసులో అన్నా ఎంతో ధనాన్ని తెచ్చుకో గలిగాడు న్యాయబద్ధంగా. సాయికి ఆ డబ్బును సమర్పించగా, సాయి స్వీకరింపక, తాను ఫకీరుననియు, ఆ ధనముతో తనకు పని లేదనియు చెప్పాడు.
చివరకు కాకా సాహెబ్ దీక్షిత్ ఆ ధనమును చావడి మరమ్మతులకై వినియోగింపుమని సలహా ఇవ్వగా అతను ఆ సలహాను పాటించాడు.
ఒక శిలా ఫలకముపై ”శ్రీ సాయినాథ్ బాబాంచి లక్ష్మి బాయి, దామోదర్ బాబ్రే చించణీకర్ చావడి, శ.క. 1859” చెక్కబడి చావడి ప్రవేశద్వారముపై ప్రతిష్టించబడి ఉన్నది.
ఇంకను అన్నా తన ఆస్తిని సాయిబాబా సంస్థానానికి విల్లు ద్వారా సంక్రమించునట్లు చేశాడు. ఈ ధనమే సాయి మహారాజ్‌సమాధి అనంతరం నైవేద్యమునకు, దీపారాధనలకు ఉపయోగ పడింది. అన్నా దంపతులు చిరస్మరణీయులే కదా!
అన్నా డిప్యూటి కలెక్టరు హోదాలో పదవీ విరమణ చేసిన హేమాడ్‌పంత్ ధన సేకరణ చేయలేదనియు, పెన్షన్ సరిపోదనియు గుర్తించాడు.
అన్నా సాయితో ”దయచేసి వాని యందు (హేమాడ్‌పంత్) దాక్షిణ్యము చూపుము. వానికి వచ్చు పింఛను సరిపోదు. వాని కుటుంబము పెరుగుచున్నది. వాని ఆతురతను తీసివేయుము. వానికి ఆనందము కలుగునట్లు చేయుము” అని ప్రార్ధించాడు. తనకోసం కాక ఇతరులకోసం చేసిన ప్రార్ధన అది.
అన్నా ఏప్రిల్ 15, 1920లో సాయిలో ఐక్యం అయ్యాడు.
అన్నాలా ధన సాయం చేయలేక పోయినా, కనీసం మాట సాయం చేయవచ్చు.
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- చావడి ఉత్సవం ….సాయి@366 డిసెంబర్ 10….Audio
- శ్రీ సాయి రక్ష సర్వజగద్రక్ష…..సాయి@366 ఏప్రిల్ 14….Audio
- షిరిడీ లో పాండురంగడు! …..సాయి@366 ఏప్రిల్ 26….Audio
- ప్రేమ పత్రములు….సాయి@366 సెప్టెంబర్ 15…Audio
- కదిలింది పల్లకి ….. సాయి@366 మార్చి 2…Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments