షిరిడీ లో పాండురంగడు! …..సాయి@366 ఏప్రిల్ 26….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice Support By: Mrs. Jeevani


కొన్ని విషయాలు సాయి చెపితేగాని తెలియవు. అందులో మరికొన్ని మరీ విచిత్రంగా ఉంటాయి.

”ఇవాళ ఇక్కడికి నా దర్బారు జనులు అనేకులు వస్తున్నారు” అన్నారు సాయి.

అక్కడున్న వారు ఎవరు వస్తారో ఊహించుకో లేకపోయారు. వచ్చినది బొంబాయిలో ప్రసిద్ధ వకీలు బలరాం దురంధర్‌, ఆయన సోదరులు.

అప్పుడు సాయిబాబా ఆ వచ్చిన వారిని చూపి, నేను పలికినది వీరిని గూర్చే అన్నారు. అలా తమ రాకను ముందుగా తెలియపరచటం ఆశ్చర్యమైంది బలరాం దురంధరునకు.

అది ఏప్రిల్‌ 26 ఇంకను ఆశ్చర్యకరమైనది, ఆనందకరమైనది అయిన మరొక సంగతి ఏమిటంటే అరవై తరాల అనుబంధం మాకు ఉన్నది అని సాయి పలకటం.

ఆరు సంవత్సరముల నుండి బలరాంకు ఉబ్బస వ్యాధి ఉన్నది.

సాయి అతనికి తన చిలుం గొట్టాన్నిచ్చి పీల్చమన్నారు. అప్పటి నుండి ఆ వ్యాధి జాడయే లేదు.

ఆ ఉబ్బసపు వ్యాధి నివారణ సాయి పలుకులలోనే ఉన్నది. ఆతని ఉబ్బసపు వ్యాధి క్షణాలలో నివారణైంది సాయి కృపతో.

మరో మరపురాని మధురానుభూతిని కూడా సాయి వారికి ప్రసాదించాడు. ఆ రోజు గురువారం. పైగా చావడి ఊరేగింపు రోజు.

దురంధర్‌ బృందానికి ఆ రోజు చిరస్మరణీయంగా మిగిలిపోయింది. సాయి బాబాకు కర్పూర నీరాజనాన్ని ఇచ్చినప్పుడు ఆ దివ్య తేజస్సు అనుపమానంగా దర్శనమిచ్చింది.

పండరిలోని రంగని వలె, సాయి ముఖం తేజోవంతంగా దర్శనమిచ్చింది.

ఆ దివ్య తేజస్సును చూడలేక కళ్ళు మెరసిపోయాయి దురంధరుకు.ఆ క్షణంలో అది పండరీపురమా? సాయి సన్నిధా? అని తేల్చుకోలేకపోయాడు క్షణకాలం.

ఆ దివ్య సన్నిధిలో పరమానందం, ఆ చావడి ఉత్సవానికే పరిమితం కాలేదు. తెల్లవారింది.

చావడిలో కాకడ ఆరతి మొదలైంది.

పాండురంగని బాణీలో కీర్తనలు మొదలయ్యాయి. పాండురంగని తేజస్సు సాయి వదనంలో కనిపిస్తున్నది. పాండురంగనిలా మృదు మధుర మందహాసా లొలికిస్తున్న సాయిని చూచాడు. ఆ క్షణం చాలు.

దివ్యానుభూతిని జీవితకాలంమంతా గుండెలో పదిలపరచుకోవటానికి!

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles