లేదు, భక్తికి పేదరికం! …..సాయి@366 ఏప్రిల్ 5….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice Support By: Mrs. Jeevani


అది షిరిడీ అనే కుగ్రామం. ఆ నాడు ఆ గ్రామమంతా భక్తులతో కిటకిట లాడుతోంది, ఎందుకంటే ఆ రోజు శ్రీరామనవమి – 1914 ఏప్రిల్‌ 5 తేదీ.

వందలాది భక్తులు సాయి చుట్టూ మూగి ఉన్నారు. సాయి దర్శనం కోసం ఒక ముదుసలి వచ్చింది.

ఆ ముదుసలి జనమును త్రోసుకు పోలేక బిగ్గరగా అరుస్తోంది. ఆ ఆక్రందనలు సాయి చెవికి సోకేనా?

సాయి సమకాలీనుడు తాజుద్దీన్‌ బాబా. ఆయన నాగపూర్‌లో ఉండేవాడు.

అల వైకుంఠపురంబులో, ఆ మూల సౌధంలో ఉన్నాడు. అదే రోజు తార అనే ఒక భక్తురాలు తాజుద్దీన్‌ బాబాకు భోజనం సమర్పించాలనే కోరికతో భోజనాన్ని సిద్ధం చేసింది.

ఇక ఆయనను గూర్చి విచారిస్తే, రాజ సౌధంలో ఉన్నాడని అక్కడి వారు చెప్పారు. ఆ పేదరాలు రాజ సౌధం దరి దాపులకు వెళ్ళవచ్చునేమో గాని లోపలకి ప్రవేశం లభించేనా? అని సందేహించింది.

కాని లోపలకి పోవటానికి ప్రయత్నం చేయలేదు. రాజ సౌధం ముఖ ద్వారం దగ్గరున్న నేరేడు చెట్టు కొమ్మకు తాను తయారు చేసిన నివేదనను తుండుగుడ్డలో కట్టి వ్రేలాడదీసింది. ఇక తాజుద్దీన్‌ బాబాకు మనసులోనే ప్రణతులర్పించి తిరుగు ముఖం పట్టింది.

ఇక తాజద్దీన్‌ బాబాకు రాజ సౌధంలో షడ్రసోపేత మైన భోజనం సిద్ధంగా ఉన్నది. కాని ఆయన రాజ సౌధం నుండి బయటకు వచ్చి, నేరేడు చెట్టు కొమ్మకు కట్టి ఉన్న తుండుగుడ్డలోని ఆహారాన్ని తీసుకుని తృప్తిగా భుజించాడు. అది చాలు ఆమెకు.

ఇక షిరిడీ లో సాయి ఏం చేసాడు? శ్యామాను పిలిచి, తన దర్శనం కోసం విలపిస్తున్న పేదరాలిని తన దగ్గరకు పిలిపించుకున్నారు.

ఆమె సంతోషానికి అవధులు లేవు. తన రెండు చేతులతో సాయిబాబా నడుమును చుట్టివేసింది.

సాయి ”అమ్మా! నీ కొరకు ఎంతో కాలము నుండి ఎదురు చూస్తున్నాను. నాకు తినటానికి ఏమి తెచ్చావు?” అని అడిగారు.

ఆ ముదుసలి ”ఇదిగో చల్ది రొట్టె ముక్క, ఉల్లి గడ్డ. నేనొక రొట్టె, రెండు ఉల్లి గడ్డలను తీసుకుని ప్రయాణం అయ్యాను. దారిలో ఆకలివేసి సగము రొట్టెను, ఉల్లిపాయను తిన్నాను. మిగిలినవి ఇవిగో” అని వాటిని సాయికి ఇచ్చింది.

సాయి తృప్తిగా వాటిని తిని ”అమ్మా! నీ రొట్టె ఎంత మధురముగా ఉన్నది” అన్నాడు! ఆ తల్లి ఆనందమునకు హద్దులేదు.

ప్రతి దినము సాయి మన మధుర నైవేద్యమునకు సంతసించు గాక!

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles