Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support by: Mrs. Jeevani
సాయిబాబా గాని ఇతర మహనీయులు గాని, సందర్భాలను బట్టి వారు ఆ రూపాలను దాలుస్తారు. తాజుద్దీన్ బాబా, సాయిబాబా సమకాలికుడు.
రాంసింగ్ తాజుద్దీన్ బాబా భక్తుడు. రాంసింగ్‌పై కొందరు హత్యానేరం మోపగా అతనికి సెషన్స్ కోర్టు ఉరి శిక్ష విధించింది.
వాస్తవానికి రాంసింగ్ నిరపరాధి. పై కోర్టుకు అపీల్ చేసుకోవచ్చును. ఏమీ చేయలేని స్థితిలో ఉండి, తాజుద్దీన్ బాబాను శరణు వేడాడు.
అప్పుడు తాజుద్దీన్ బాబా ”మేము నిన్ను వదలివేశాము’‘ అన్నారు. రాంసింగ్ బీదరికంవల్ల ఏ న్యాయవాదిని పెట్టుకోలేదు.
కేసు విచారణ మొదలైంది. రాంసింగ్ కోర్టు బోనులో నిలబడి తాజుద్దీన్ బాబాను ప్రార్ధిస్తున్నాడు.
ఇంతలో ఒక పొడుగాటి వ్యక్తి కోర్టులోనికి వచ్చి రాంసింగ్ తరుఫున వాదిస్తానన్నాడు.
జడ్జి అంగీకరించగా, కొందరు వ్యక్తులను ఆ వ్యక్తి ప్రశ్నించి, జడ్జిగారికి తన వాదన వినిపించి కూర్చున్నాడు.
జడ్జిగారు రాంసింగ్ నిర్దోషి అని తీర్పు ఇచ్చాడు. కోర్టు నుండి బయటకు వచ్చిన తరువాత ఆ వ్యక్తిని కలుసుకోలేకపోయాడు రాంసింగ్.
తాజుద్దీన్ బాబా వద్దకు కృతజ్ఞతలు చెప్పానికి వెళ్ళగా తాజుద్దీన్ బాబా ”వకీలు గొప్ప ఇంగ్లీషు వాడు కదా!” అని నవ్వారు.
తాజుద్దీన్ బాబాయే న్యాయవాది రూపంలో వచ్చారని తెలుసుకొని ఆయన పాదాలపై పడ్డాడు రాంసింగ్.
రేపల్లెలో న్యాయవాదిగా ఉన్నారు వేమూరి వేంకటేశ్వర్లు గారు. ఒకసారి ఆయన స్వంత పని మీద స్వగ్రామానికి వెళ్ళారు.
అదే రోజున ఆయన వాదించే ఒక కేసు విచారణకు వచ్చేటట్టున్నది. పార్టీ ఆ విషయం చెప్పటానికి వేంకటేశ్వర్లు గారింటికి వెళ్ళాడు.
ఇంట్లో లేరని తెలిసి కోర్టుకు వెళ్ళాడు. కోర్టులో కేసు మొదలైంది. ఆసక్తికరంగా కేసు సాగుతోంది. లాయరు వాదించసాగాడు.
అతని వాగ్దాటికి అందరూ ముగ్దులై వినసాగారు. న్యాయాధికారి వేంకటేశ్వర్లు గారి వాక్చాతుర్యానికి అబ్బురపడ్డాడు. చివరకు కేసు పూర్తయింది. వేంకటేశ్వర్లు గారి కక్షిదారు కేసులో గెలుపొందాడు.
ఆ రాత్రి ఆ వ్యక్తి వేంకటేశ్వర్లు గారింటికి వెళ్ళి ”బాగా వాదించి గెలిపించారు” అని అనగానే వేంకటేశ్వర్లు గారు ”నేను కేసు వాదించట మేమి నేను ఊరు వెళ్ళి ఇప్పుడే వచ్చాను” అన్నారు.
అయితే కేసు వాదించినది ఎవరు? ఇంకెవరు? సాయి బాబాయే.
వేంకటేశ్వర్లుగారు 26 జూలై, 1905లో జన్మించారు. తెలుగులో ప్రత్తి నారాయణరావు గారి తరువాత సాయి సచ్చరితను వ్రాసినది వీరే!
వేమూరి వారు (అ)ద్వితీయులు!
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- రెండు అడుగులు …. మహనీయులు – 2020… సెప్టెంబరు 3
- కన్నీరు కార్చిన విగ్రహాలు…..సాయి@366 ఆగస్టు 17….Audio
- తాజుద్దీన్ బాబా…..సాయి@366 జనవరి 27….Audio
- జలగండం…..సాయి@366 సెప్టెంబర్ 6….Audio
- కొరడా దెబ్బలే సరి! …..సాయి@366 మే 16….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments