Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అది మాల్ ఖేడా గ్రామం. బీమా నదికి ఉపనదైన కగిన ఈ గ్రామం పక్కనుండే ప్రవహిస్తుంది. అక్కడ మధ్వ సాంప్రదాయానికి చెందిన ఐదవ ఆచార్యుడు (పీఠాధిపతి) అక్షోభ్యాచార్యులున్నారు.
అదే సమయంలో డోంఢూ నరసింహ దేశ్ పాండే తన గుర్రం మీద స్వారీ చేసుకుంటు వస్తున్నాడు. అశ్వ విద్యలో నిపుణుడు.
డోంఢూరాయునకు(నరసింహునకు) దాహం వేసి గుర్రం మీద స్వారీ చేస్తూనే ఆ నదిలోని నీటిని చేతులతో కాకుండా, నోటితోనే త్రాగటాన్ని అక్షోభ్యాచార్యులు చూచారు.
“పూర్వ జన్మలో నీవు పశువువా?” అని ఆచార్యులు డోంఢూరాయుని ప్రశ్నించారు.
డోంఢూరాయుడు ఆ ప్రశ్న విని నివ్వెరపోయాడు. గత జన్మలన్నీ జ్ఞాపకం వచ్చాయి అతనికి.
ద్వాపర యుగంలో తాను అర్జునుడు. ఒకసారి భీమసేనునితో అర్జునుడు మహాభారత యుద్ధంలో విజయం తనవలననే కలిగిందని చెప్పాడు.
భీమసేనుడు అర్జునునితో తప్పుగా పలికావని, అలా పలకటం నేరమని, శిక్షగా పశు జన్మ ఎత్తవలసి వస్తుందని అన్నారు.
గర్వంతో తాను పలికిన పులుకులంకు క్షమాపణ కోరాడు భీమసేనుని అర్జునుడు. యుగం మారింది. కలి యుగం వచ్చింది.
భీమసేనుడు మధ్వాచార్యలుగా జన్మించారు. అర్జునుడు మధ్వాచార్యులు వ్రాసిన గ్రంథములను, ఆయనతో తీసుకొనిపోయే బండికి ఎద్దుగా జన్మించాడు.
ఆ ఎద్దు మధ్వాచార్యుల గ్రంథములను మోయుటయేగాక, మధ్వాచార్యులు ఇతర శిష్యులతోపాటు ఎప్పుడూ మధ్వాచార్యుల బోధలను వినేది. అలా అది ఆయనకు 18 సంవత్సరాలు సేవించింది.
ఒకసారి మధ్వాచార్యులవారు తన శిష్యులతో తన రచనలకు ఎవరు వ్యాఖ్యానాలను వ్రాస్తారని ప్రశ్నించారు, ఎవరికి వారు ఎవరెవరి పేర్లనో చెప్పారు. తన ఎద్దును చూపి “ఇది వ్రాస్తుంది” అన్నారు మధ్వాచార్యులవారు.
ఆ ఎద్దును పాము కాటువేస్తుందని, మరణిస్తుందని శిష్యులు శపించారు. పాము కాటు వేసింది. అది మరణించబోతుంది.
మధ్వాచార్యులవారు ద్వాదశరశ శ్లోకరాజాని పఠించారు. ఆ ఎద్దు కూడా పఠించటం చూసి అందరూ విస్తుబోయారు. తమ తప్పును తెలుసుకుని, క్షమింపమని వేడుకున్నారు.
ఇక మధ్వాచార్యులు అంతర్దానమయ్యారు ఎద్దు దేహాన్ని విడిచింది.
మధ్వాచార్యులవలె సాయి రచనలను చేయకున్నా, కృష్ణ జగదీశ్వ భీష్మ, వంటివారిని గుర్తించి ఆశీర్వదించారు.
ఇక డోంఢూ అక్షోభ్యాచార్యులను అర్ధించాడు. తనను శిష్యునిగా స్వీకరింపుమని. తండ్రిని అంగీకారం అడిగాడు. తండ్రి సమ్మతించలేదు.
ఆ రోజు డోంఢూరాయని శోభనపు రోజు. శోభనం శయ్యపై డోంఢూరాయుడు కానరాలేదు. సర్వము కానవచ్చింది.
అతనిచే సంసారం చేయించలేనని గ్రహించి తండ్రి, ఇతరులు, అక్షోభ్యారాయల వద్దకు పంపారు.
అయన జయ తీర్దులవారై మధ్వాచార్యుల రచనలపై టీకను వ్రాసారు.
జయతీర్థుల వారు ఆషాఢ బహుళ పంచమి నాడు (1387)లో మాల్ ఖేడ్ లో దేహాన్ని విడిచారు. అయన సమాధి అక్కడే ఉంది.
“ఓం శ్రీ జయతీర్దరువే నమః“
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- రారా కృష్ణయ్య… .మహనీయులు – 2020… అక్టోబరు 9
- రామ లీల … మహనీయులు – 2020… జూలై 25
- భక్తి ప్రదర్శన ….సాయి@366 డిసెంబర్ 8….Audio
- బిక్కు మార్వాడి
- రామ స్మరణం …. మహనీయులు – 2020… అక్టోబరు 22
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments