బిక్కు మార్వాడి



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు

శివుడికి అంకితం చేయబడిన ఒక ఎద్దు(అభోతు) షిర్డి గ్రామంలో ఉండేది. ఈ ఎద్దు గ్రామ ఉద్యానవనాలు, వ్యవసాయ క్షేత్రాలకి నాశనాన్ని కలిగించేది. దానికి ఎక్కడ నచ్చితే అక్కడ పైర్లలో జొరబడి పాడుచేస్తూ ఉండేది. గ్రామస్తులు అంతా కలిసి దానిని యెవాలా లోని పశువుల బందీల దొడ్డికి పంపాలని నిర్ణయించుకున్నారు. నిధులను సేకరించి, ఎద్దును తీసుకుని వెళ్లి బందీల దొడ్డిలో అప్పగించే పనిని బిక్కు మార్వాడికి అప్పగించారు.

బిక్కు ఆ ఎద్దుతో బయలుదేరాడు, కానీ అతను దానిని బందీల దొడ్డికి తీసుకొని వెళ్ళకుండా 14 రూపాయలకి ఒక కసాయికి అమ్మివేసాడు. యెవాలా నుండి తిరిగి వచ్చిన తరువాత గ్రామస్తులతో బందీల దొడ్డిలో ఎద్దుని విడిచిపెట్టానని అతను చెప్పాడు. ఆ రాత్రి బాబా బాయాజీ కోతేకి కలలో కనిపించి “నన్ను కసాయి చేతికి అప్పగించి మీరు ఇక్కడ సుఖంగా నిద్రిస్తున్నారా?” అని అన్నారు.

మరుసటి రోజు బాయాజీ తనకు వచ్చిన కల గురించి గ్రామస్తులకు సమాచారం అందించి, అతను యెవాలాకు వెళ్ళి ఎద్దును కాపాడాలని నిర్ణయించుకున్నాడు. అతను నేరుగా బందీల దొడ్డికి వెళ్ళాడు, కాని అక్కడ ఎద్దు కనిపించలేదు. కావున అతను కసాయి వాళ్ళు ఉండే చోటకి వెళ్లి, అక్కడ శ్రద్ధ అన్వేషణ చేసి, ఎద్దుతోపాటు కసాయివాడిని పట్టుకున్నాడు.

అతను కసాయి వానికి మొత్తం కధను చెప్పి ఎద్దును తిరిగి ఇవ్వమని అభ్యర్ధించాడు. కసాయివాడు ‘నేను  దానిని రూ. 14 / -కు బిక్కు మార్వాడి వద్ద నుండి తీసుకున్నానని అందుచేత తిరిగి ఇవ్వలేనని’ నిరాకరించాడు. బయాజీ ఆ డబ్బును అతనికి ఇచ్చి ఎద్దును సురక్షితంగా విడిపించాడు. అతను షిరిడీకి తిరిగి వచ్చి బిక్కు చేసిన దానిని గురించి గ్రామస్తులకు చెప్పాడు. బిక్కుని చేసిన నియమ ఉల్లంఘనపై వారు చాలా నిరాశకు గురై, అతనిని విచారించి రెండు నెలలు జైలు శిక్ష బిక్కుకి విధించారు.

source: Ambrosia in Shirdi – Part-I (Baba’s Leelas before 1918)

సర్వం సాయినాథర్పాణమస్తు

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles