Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయిబాబా రామ భక్తులకు రామునిగా దర్శనమిచ్చారు. ఉదాహరణకు డాక్టర్ పండిట్.
బూర్ల రంగన్న శ్రీరాముని భక్తుడు. సర్వమూ ఆయనే చేయిస్తున్నాడనే వారు.
“అంతా రామ మాయం, ఈ జగమంతా రామ మయం” అనే కంచెర్ల గోపన్న మాటలు అయన నోటి నుండి దొర్లేవి. సాయి నోటి నుండి “అల్లా మాలిక్” అనే మాటలు వచ్చినట్లు.
అయన ఏలూరు, పోలవరం, చీరాల, బాపట్ల, గుంటూర్లలో చాలా కాలం నీళ్ల కావిళ్లు మోసి, దాని వలన వచ్చిన ధనంతో సంసారాన్ని గడిపే వారు. నిజాయితీగా బిందె నిండా నీళ్లు పోసేవారు.
ఈయనను దర్శించేందుకు ఎందరెందరో వచ్చే వారు, ఆయన ఎక్కడుంటే అక్కడకు.
ఒకరు ఆయనను దర్శించి తిరిగి వెళ్తూ ప్రసాదం ఇవ్వండని కోరినారు. బాబుగారు దోసిలిని పట్టి కళ్లు మూసుకున్నారు. వారి దోసిలిలో అందరు చూస్తుండగా, మామిడి పండు పడ్డది. అది ప్రసాదంగా ఇచ్చారు.
ప్రతి దినం నీళ్ల కావిళ్లను మోయటం కనిపించని కష్టమే. అయన ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ, నీళ్లతో నిండిన పెద్ద ఇనుప బొక్కె (బకెట్ ను) చూపి, అక్కడున్న వారిని ఎత్తమన్నారు.
ఎందరో అక్కడ ఉన్నా, ఎవరూ ఒక అడుగు మించి ఎత్తలేకపోయారు. రెండు చేతులను ఉపయోగించి కూడా. బాబాగారు అప్పుడు చిటికెన వ్రేలు దూర్చి లేపి, దాన్ని భుజం పైకి ఎత్తుకున్నారు.
“అది మీకెలా సాధ్యమైంది?” అంటే “రామా అంటే ఆంజనేయులు ఎత్తినాడు” అన్నారాయన.
ఒకసారి రంగన్నబాబు గార్ని 12 మంది ఒకే సమయానికి భోజనానికి ఆహ్వానించారు. అయన అందరితోను ‘సరే’ అన్నారు.
ఆ సమయం వచ్చింది. అందరిండ్లలోను ఒకేసారి భోజనం చేసిన సంగతి అందరుకూ తెలిసింది.
“ఇది ఎలా సంభవం?” అయన నవ్వుతూ తాము ఒకరింటికే భోజనానికి పోయామని, మిగత ఇండ్లకు శ్రీరాముడే తన రూపంలో వెళ్లి భోజనం చేశాడని నమ్రతతో చెప్పారు.
బీహారు నుండి ఒక ఫ్యాక్టరీ ఇంజనీరు వచ్చి తన కర్మాగారంలో యంత్రం పనిచేయటం లేదని, పరిష్కారం అడిగారు.
రామచంద్రుని అడిగి చెబుతానని ధ్యానంలోనికి పోయారు. ఇంజను ఇరుసు వద్ద ఉండే ముండ్ల చక్రంలో ఇనుప గోళీలు చిక్కుకుపోయాయని, గవర్నార్ అనే యంత్ర భాగం తీసి బాల్ బేరింగ్ సరిచేస్తే పనిచేస్తుందని సమాధానం చెప్పారాయన.
అయన అక్కడ నుండే బీహారులో ఉన్న వారి చేత యంత్రాన్ని గూర్చి చెప్పారు. సరి చేశారు. అది పనిచేయ నారంభించింది. అది రాముని సలహాయే అంటారు బాబు గారు.
ఒకసారి ఆయన శూన్యం నుండి ద్రాక్ష పండ్ల గుత్తిని రాముని ప్రార్ధించి తీసి, దానిని జిల్లెళ్ళమూడి అమ్మకు ప్రసాదంగా పంపారాయన.
రంగన్న బాబు నామ మేదైనా, దైవం ఒకటే అనేవారు.
రంగన్న బాబు గారు అక్టోబర్ 22. 1979లో రామ ప్రభు పాదాలలో కలసి పోయారు.
ఆయనకు సమాధి గాని, మందిరం గాని లేవు. నేడు బాబు గారి వర్థంతి, రంగన్న బాబు గారిని, రామచంద్రుని స్మరించెదము గాక!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Sreenivas Murthy
Latest Miracles:
- రామ దీపం …. మహనీయులు – 2020… అక్టోబరు 11
- శ్రీరామ రక్ష…. మహనీయులు – 2020… అక్టోబరు 26
- సంకట హరణం – సాయి నామ స్మరణం
- ఇసుక రేణువంత దయ…. మహనీయులు – 2020… అక్టోబరు 13
- రామ లీల … మహనీయులు – 2020… జూలై 26
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments