శ్రీరామ రక్ష…. మహనీయులు – 2020… అక్టోబరు 26



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


శ్రీరామ శరణ్ బాల్య నామం కుందుర్తి వెంకట నరసయ్య. ఈయనకు బాల్యం నుండి శ్రీకృష్ణునిపై మక్కువ ఎక్కువ.

ఆంధ్ర వాల్మీకి వావిలికొలను సుబ్బారావుగారికి కృష్ణ మంత్ర ఉపదేశం ఇవ్వండని ఉత్తరం వ్రాశారు.

కొంత కాలం తరువాత సుబ్బారావు గారు వచ్చి ఈయనకు రామ తారక మంత్రోపదేశం చేసి వెళ్లారు.

ఇక రామ శరణ్ గారు రామునకు సర్వశ్య శరణాగతులయ్యారు. రామ నామ లేఖనం, రామ నామ కీర్తనం, రామ నామ ప్రవచనం, రామ నామ భోజనం, రామ నామ వస్త్ర ధారణ అనే ఈ పంచరాములే వారి జీవనము.

వారి మనస్సు రామ నామ మయమై, దేహము కూడా పవిత్రమై రామనామాన్ని ధ్వనింప చేయునట్లుండేది.

బుద్దాంలో ఒకసారి కలరా వ్యాపించింది. హనుమంతుని పటం పట్టుకుని, రామ నామం చేస్తూ, గ్రామమంతా తిరిగారు ఆయన. కలరా వ్యాధి ఊరి నుండి పారిపోయింది.

బుద్దాంలో ఆంజనేయస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆ విగ్రహాన్ని తీసివేయమని కొందరు వ్యక్తులు అడిగారు. పవన విగ్రహాన్ని ప్రతిష్టించింది తీసివేయటానికి కాదు అన్నారు.

ఆ విగ్రహాన్ని తొలగించటానికి ఎంత ప్రయత్నించినా ఫలించలేదు. ఆ ఊరిలో ఇండ్లు తగలిబడిపోయేవి.

ఈ విషయాన్ని శ్రీ రాం శరన్ గారికి విన్నవించారు గ్రామస్తులు. పవన కుమారునిపై నీరు పోయండని సలహా ఇచ్చారు.

ఆ పని చేశారా ఊరివారు. ఇక ఇండ్లు కాలిపోయటం ఆగిపోయాయి.

ఆ ఊరిలో ఒకరి నగ దొంగలింప బడ్డది. ఈ విషయాన్ని రాం శరణ్ గారికి చెప్పారు.

పవన కుమారునికి విన్నవించుకోండి అన్నారు. అలాగే విన్నపం చేశారు. మరునాడు ఉదయం వారి ఇంటి ముందు ఆ నగ దొరికింది.

నాగాయలంక లాంచీ రేవు గట్టున (కృష్ణా నది ఒడ్డున) ఒక రామాలయమును నిర్మింప దలచి, అన్ని ఏర్పాట్లను చేశారు.

ఆ ఆలయములో రామ విగ్రహ ప్రతిష్టకు 31 – 5 – 1964గా ఆయన నిర్ణయించి, అన్ని ఏర్పాట్లు చేశారు.

ఈలోగా కంచి పరమాచార్యులను దర్శించి వద్దామని వెళ్ళారు. పరమాచార్యుల వారు ఇంకా పేరు పెట్టని ఆ రామాలయమును గూర్చి శ్రీరాం పాద క్షేత్రంలో ప్రతిష్ట ఎప్పుడని అడిగారు.

31 మేన అన్నారు రాం శరణ్ గారు. “31న చేస్తారా?” అని అనుమానాస్పదంగా ప్రశ్నించారు పరమాచార్యులు.

వెంటనే స్వామి వారు అక్షతలు, కుంకుమ, కిస్ మిస్ పండ్లను ప్రసాదంగా ఇచ్చి యంత్రమునకు బదులుగా వీటిని విగ్రహాల క్రింద ఉంచమని ఆదేశించారు.

పరమాచార్యుల వారు చెప్పినట్లు విగ్రహ ప్రతిష్ట మే 31న జరుగలేదు. మే 11, 1964న జరిగింది.

అక్షతలు, కుంకుమ, కిస్ మిస్ పండ్లును యంత్రమునకు బదులుగా, విగ్రహాల పాదముల క్రింద ప్రతిష్టించారు.

రెండు నెలలు గడిచాయి. నాగార్జున సాగర్ డాం పగిలి, వరద నీరు ఆ గుడిలోని శ్రీరామ పాదముల నంటి తగ్గిపోయినది.

ఒక్క అంగుళం నీటి మట్టం పెరిగినా, 70 గ్రామాలు వరద నీటికి కొట్టుకుపోయేవి. ఇక ఆ క్షేత్రం శ్రీరామ పాద క్షేత్రమైంది.

శ్రీ రాం శరణ్ అక్టోబరు 26, 1994న రామునితో ఐక్యమయ్యారు.

శ్రీరామ రక్ష సర్వ జగత్ రక్ష.

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles