Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
స్వామి ప్రణావానంద అంటే చాలామందికి తెలియకపోవచ్చును. ఈయన పూర్వాశ్రమ నామం సర్వేపల్లి నర్సింహం అని తెలిస్తే, కొందరైనా సర్వేపల్లి రాధాకృష్ణన్ కు సంబంధించిన వాడని గుర్తుపడతారు.
సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి చిన్న వయసులో అంతగా చదువు వచ్చేది కాదు,
అయన తండ్రి గారు విసుక్కునే వారు. దీనిని గ్రహించిన నరసింహం గారు, అతనికి (రాధాకృష్ణన్ చే) రామతారక మంత్రము ఉపదేశించి, విద్య యందు శ్రద్ధ కలిగించి ప్రకాశింప చేసిరి.
అయితే రాధాకృష్ణన్ తన వాడని ఆ మంత్రోపదేశం చేయలేదు.
నరసింహం గారు వేలూరు జైలులో నున్న ఖైదీలకు ఓదార్పుగా నీతిని తెలిపి, రామతారక మంత్రమును చెప్పించే వారు.
వీరి వల్ల ఎందరో ఖైదీలు మనసులు మార్చుకొని మంచి మార్గంలో జీవితం కొనసాగించారు.
ఆంగ్ల దొరలు తమ మోటారు బండ్లలో నర్సింహంగారిని ఇంటిలో దించుటయు, తీసుకొని వచ్చుటయు చేసెడివాడు.
వారిని (నర్సింహం గారిని) ఇంటిలో దింపి, ఏ గవర్నరుకో సెల్యూట్ చేసినట్టు మర్యాద చేసి తిరిగి వెళ్లిపోయేవారు.
బ్రిటిష్ హయాంలో ఇట్లు జరగటం ఊహకందని విషయమే.
అయితే ఇంతకీ నర్సింహంగారు చేసే ఉద్యోగం ఏమిటి? కేవలము తెలుగు నేర్పే మున్షీ ఉద్యోగమే!
ఈయన ఒక చిన్న ఇంటిలో ఉండేవారు. పది మంది విద్యార్థులు తక్కువ లేకుండా వీరింటిలో ఉండేవారు.
కొందరక్కడే ఉండి భుజించి విద్య నేర్చుకునేవారు. వీరికి (నర్సింహం గారికి) సరస్వతీ కటాక్షమే గాని లక్ష్మీ కటాక్షము లేదు, పోతన, త్యాగయ్యల వలె.
ఈయన కావ్యకంఠ గణపతి మునుల శిష్యుడు. ఇంకా చెప్పాలంటే రమణుల భక్తుడు.
రమణ మహర్షి రచనలలో కొన్నిటిని ప్రప్రథమంగా ఆంధ్రీకరించిన మహానుభావు డీయన.
ఒక వేసవి యందు ప్రణవానందులు (నర్సింహం గారు) తిరువణ్ణామలై స్టేషన్ నుండి, రమణుల ‘ఉపదేశము’ల గ్రంథములను మోసుకుని రమణాశ్రమమునకు తీసుకు వచ్చారు.
ఒంటెద్దు బండిలో వచ్చినా ఒక రూపాయి ఖర్చు అగును కదా అని, నడచి వచ్చారాయన.
రమణాశ్రమ గేటు వద్దకు వచ్చి, ఇక నడవలేక, గేటు వద్ద నున్న చెట్టు క్రింద కూర్చున్నారు.
ఈ సంగతి తెలిసిన రమణులు వీరు కూర్చున్న స్థలమునకు కమండలం నిండా నీటితో వచ్చి, వారి (నర్సింహం గారి) పాదముల మీద గుమ్మరించారు.
“ఎందుకు ఇట్లు ఎండలో శ్రమపడి శ్రమపడి వచ్చినారు? ఇట్లు కష్టపడమని మీతో ఎప్పుడైనను నేను చెప్పి ఉన్నానా? ఎందుకు ఈ వేదన?” అని రమణులు పలికారు. అది రమణుల ప్రేమ వర్షమే. అది చాలును.
నర్సింహంగారి జయంతి. వర్థంతి దినాలు తెలియరాలేదు.
నర్సింహం గారిని, రమణులను స్మరించి, రామ తారక మంత్రమును పఠించెదము గాక!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Sreenivas Murthy
Latest Miracles:
- నానారాజ్య సందర్శనం …. మహనీయులు – 2020 – జనవరి 28
- రాం…రాం…రాం…. …. మహనీయులు – 2020…ఫిబ్రవరి 24
- త్రివిధ పద్ధతులు …. మహనీయులు – 2020… జూన్ 2
- బ్రహ్మర్షి దైవరాత…. మహనీయులు – 2020… ఆగస్టు 13
- గోవింద రాం రాం గోపాల హరి హరి … మహనీయులు – 2020 – జనవరి 13
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments