రాం…రాం…రాం…. …. మహనీయులు – 2020…ఫిబ్రవరి 24



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయిబాబా మూఢనమ్మకాలను ఖండించినట్లు రాంచరణ్ మహారాజ్ కూడా ఖండించారు.

సోధా అనే గ్రామంలో భక్తిరాం విజయవర్గీయ (Bhakthiram Vijayavargia) దేవహూతులకు ఫిబ్రవరి 24, (1720) న రాంకిషన్ జన్మించాడు.

చిన్నప్పటి నుండి ఆ పసివాడు దైవాన్ని గూర్చి తెలుసుకోవాలని ప్రయత్నించేవాడు. పురాణాలు, ఇతిహాసాలు చదివాడు. భగవద్గీతను నేర్చుకొన్నాడు.

కుర్రవాడు ఆధ్యాత్మిక మార్గంలో ఎక్కడ పడిపోతాడోనని ఉహించి గులాబ్ కన్వార్ అనే ఆమెతో వివాహం జరిపించారు.

వివాహానంతరం అతడు పట్వారీ అయ్యాడు. అతని తెలివితేటలను గూర్చి తెలుసుకున్న జయపూర్ రాజ్ తనవద్ద దివాన్ గా ఉంచుకున్నాడు.

రాం కిషన్ తండ్రి మరణించాడు. జీవితపు అశాశ్వతత్వం అతనికి తెలిసింది. నివురుగప్పిన ఆధ్యాత్మికత బయటకు వచ్చింది.

అయితే ఇప్పుడు సంసారి. తన సంసారం ఆధ్యాత్మిక మార్గంవైపు పొమ్మని సులభంగా అటుందా? ఇదే ఆలోచన అతనికి.

అయన తన భవిష్యత్తును గూర్చి భగవంతుని అడిగాడు. ఆ రాత్రే అతనికి స్వప్నం వచ్చింది. తాను నదిలో పయనిస్తున్నాడు. తానున్న పడవ మునిగింది.

తాను కూడా మునగబోతున్నాడు. ఇంతలో ఎవరో సత్పురుషుడు వచ్చి తనను మునగకుండా కాపాడాడు.

నది సంసారానికి సంకేతమని, నదిలో మునిగిపోవటం సంసారంలో కురుకుపోవటమేనని, ఒక మహనీయుడు తనను కాపాడటమంటే సంసారాన్నుండి విముక్తి కల్గించటమని,

తన కుటుంబం ఆయనకు ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళిపోవటానికి అనుమతించింది.

ఆయన బయలుదేరాడు. రాత్రి స్వప్నంలో కనిపించిన మహనీయుడు లేదా సత్పురుషుడు ఎవరు అనేది ప్రశ్న.

ఎంతో ప్రయత్మించగా ఆ సత్పురుషుడు షహాపూర్ లో ఉంటాడని తెలిసింది. వెంటనే దంత్రా వెళ్ళి తన గురువైన రాంను కలుసుకున్నాడు.

కృపారాంజీ ఆదేశంతో 9 సంవత్సరాలు సాధన చేశాడు. ఆత్మజ్ఞానం కలిగింది. రాంకిషన్ రాంచరణ్ మహారాజు అయ్యాడు.

ఆయన భక్తికే పెద్ద పీట వేశాడు. ‘రాం, రాం’ అంటే చాలు, ఇక్కడ ‘రాం’ అంటే దశరధ తనయునకు సంకేతం కాదు. నిర్గుణ స్వరూపానికి సంకేతం.

రాం స్నేహి సంప్రదాయం తుది రూపురేఖలను ఆయన శిష్యుడు రాంజానీజీ రూపొందించాడు.

ప్రతి జీవిపై కరుణతో ప్రవర్తించాలి. సహాయాన్ని ఎవరు కోరినా అందించాలి. అందరు సమానులే. రాజు, పేద అనే బేధ భావంకూడదు. వివిధ ప్రదేశాలలో రాముని వెదకుటమాని హృదయములో నున్న భగవంతుని, రాముని గుర్తించాలి.

రాంచరణ్ మహారాజ్ శిష్యులకు 36,250 వాక్కులు బోధించాడు. ఏ గురువు కూడా అన్ని వేల వాక్కులను తెలపలేదు.

రాంచరణ్ మహాసమాధి రామస్నేహ సంప్రదాయికులకు ముఖ్యమైన స్నేహపురాలో ఉంది.

నేడు ఫిబ్రవరి 24, రాంచరణ్ మహారాజ్ పుణ్యతిధి దినం. ఆయనను స్మరించెదముగాక. రాం, రాం, రాం…

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles