Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయిబాబాకు హిందువులు, మహమ్మదీయులు భక్తులుగా ఉండేవారు.
కాశీలో స్థిరపడిన రామానందును వివిధ మతాలవారు, సంప్రదాయాలవారు గౌరవించేవారు.
ఆనాడు రామానందులే మహ్మదీయుల బారినుండి సనాతన ధర్మాన్ని కాపాడారు.
హిందువులమీద అనేక ఆంక్షలను విధించాడు మహమ్మద్ బీన్ తుగ్లక్. శంఖాన్ని హిందువులు పూరించరాదని, గుడులు, గోపురాలు కట్టించరాదని, అనేక ఆంక్షలున్నాయి.
రామానందుల వారికి విన్నవించుకున్నారు హిందువులు.
ముస్లింలను నమాజుకు రండని పిలచేవారి గొంతుకలు మూగబోయేవి ఆ సమయంలో.
ఆ సమయం అనంతరం వారి గొంతుకలు పలికేవి ఇది హైందవులలోని మహనీయుని పనై ఉంటుందని ముస్లిం పెద్దలు గ్రహించి, కబీరును వెంటతీసుకుని రామానందులను దర్శించి విషయం చెప్పారు.
వెంటనే శంఖాన్ని పూరించారు. మహమ్మదీయులందరూ ద్యానంవంటి స్థితికి వెళ్ళారు. తమ ప్రవక్త దర్శనం కలిగింది వారికి.
యాధస్థితికి వచ్చిన వారికి రామానందులు, దైవం ఒక్కరే అని తెలిపారు. మహమ్మద్ బీన్ తుగ్లక్ తాను విధించిన 12 ఆంక్షలను ఉపసంహరించుకున్నాడు.
కాశీలోనే మౌలానా రషీదుద్దీన్ అనే ఒక పకీరుండేవాడు. ఈయన రామానందుల సమకాలికుడు.
రషీదుద్దీన్ తాను రచించిన ముస్లిం మహనీయుల జీవిత చరిత్రలో రామానందులను గూర్చి కూడా వ్రాశాడు.
పంచ గంగా ఘాట్ లో నివసించే స్వామి రామానందజీ మహనీయుడని, కబీరు, పీపా, రవిదాసు, సేనా, ధన్నా మొదలైన ప్రముఖులెందరో ఆయనకు శిష్యులుగా ఉండేవారని రామతారక విభాగాన్ని నెలకొల్పడని పేర్కొన్నాడు.
రామానందుడు తన గురువైన రాఘవానందుని ఆదేశంతో రామావత్ లేదా రామత్ అనే సంప్రదాయాన్ని నెలకొల్పారు.
శ్రీ సంప్రదాయంలో విష్ణు, లక్ష్మీ దేవులను ప్రార్దించినట్లు వీరు రామ, సీతలను ప్రార్థిస్తారు. ఇంకను లక్ష్మణ, హనుమలను కూడా కొలుస్తారు. తన అనుచరులను ఆవఘాతలనే వాడాయన.
ముస్లింల ధాటికి తట్టుకోలేక మహారాజైన గజ్ సింగ్ అయోధ్యను విడిచి వెళ్ళిపోయాడు, ప్రజలందరూ పడే కష్టాలను, భయాన్ని చూచిన ఆ మహారాజ్ సోదరుడు కాశీకి వెళ్ళి రామానందులను ప్రార్ధించాడు.
రామానందులు అయోధ్యకు వెళ్ళారు. ఏ విధమైన భీతి లేకుండా ప్రజలుండసాగారు. అక్కడ శాంతి నెలకొన్నది. రామానందుల వారు తిరిగి కాశీకి వెళ్ళిపోయారు.
రామానందులు అన్ని మతములు ఒకటేనని, సర్వ జీవ సమానత్వాన్ని బోధించారు. భగవంతునికి సేవచేయటం పరమానందానికి దారి తీస్తుందని తెలిపేవారు.
రామానందులు లేక రామానందాచార్యులు శ్రీకృష్ణుని పాంచజన్య ధ్వని వలె భారతీయతను ఏకంచేసి, సంరక్షించిన మహనీయుడు.
ఈయన మాఘ బహుళ సప్తమినాడు జన్మించి సుమారు 148 సంవత్సరములు జీవించిన సద్గురువు.
రామానందుల జ్ఞాపకార్థం ఫిబ్రవరి 4, 2002లో తపాలా బిళ్ళ విడుదలైంది.
శ్రీరామ…శ్రీరామ…శ్రీరామ…
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- తానొకడైనా తనకొక రూపై… …. మహనీయులు – 2020…ఫిబ్రవరి 10
- సరిలేరు మీ కెవ్వరు…. …. మహనీయులు – 2020… ఆగస్టు 23
- కోడలి కాపురం…. మహనీయులు – 2020…ఫిబ్రవరి 11
- ఇంపు – కంపు.. …. మహనీయులు – 2020… డిసెంబరు 12
- మిర్ జమాన్ – కందహార్ మహ్మదీయుడు
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments