కోడలి కాపురం…. మహనీయులు – 2020…ఫిబ్రవరి 11



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయిబాబా ఆకారం మహ్మదీయునిలాగా ఉన్న, ఎందరో హిందువులు అంకిత భక్తులయ్యారు.

మహా సమాధి మహమ్మదీయ సాంప్రదాయం ప్రకారమా లేదా హిందూ పద్దతా అనే చర్చ జరిగింది.

కాశ్మీరులో రూపాభవాని అనే మహాత్మురాలు ఉండేది. ఆమె హిందూ మతానికి చెందినది. మహిమలు చూపింది. మార్మిక కవిత్వం వ్రాసింది.

కాశ్మీరులో లాల్ దీది తరువాత ఈమెనే చెబుతారు. ఈమె 1721లో మాఘ కృష్ణ సప్తమినాడు (సామాన్యంగా మాఘ మాసం ఫిబ్రవరిలో వస్తుంది) దేహాన్ని విసర్జించింది.

జన్మతః హిందువు కాబట్టి, ఆమెను హైందవ సాంప్రదాయం ప్రకారం, ముస్లింలు ఆమెను రూపా ఆరీఫా (Rupa Aarifa) అని ఆరాధిస్తారు కాబట్టి ముస్లిం ఆచారాల ప్రకారం అంత్యక్రియలు చేయాలని పట్టుబట్టారు.

ఆమె పండిత వంశంలో శారికాదేవి కృపవల్ల జన్మించింది. తండ్రే ఆమెకు గురువు. ఈమెకు సంసారం ఎన్నో విషయాలను నేర్పింది.

తండ్రి వద్ద యోగము, శాస్త్రములు నేర్చుకుంది. మరొక పండితుని కోడలైంది. కానీ, కష్టాలన్నీ అత్తవారింట్లోనే మొదలయ్యాయి.

హర పర్వతంపై నెలకొన్న శారికాదేవిని కొలుచుటకు అర్ధరాత్రి ఆమె వెళ్ళేది. అత్తగారికి, కుమారునికి ఆమెపై అనుమానం రేకెత్తింది.

ఒకసారి ఆమె అత్తవారింట విందు జరుగుతుంది. ఒక చిన్న పాత్రలో రూపాభవాని తండ్రి పరమాన్నాన్ని పంపాడు.

 “ఇది ఎంతమందికి సరిపోతుంది?” అంటూ రుసరుసలాడింది అత్త. “ఎందరికైనా సరిపోతుంది, లోపల ఉన్నదాన్ని చూడకుండా వడ్డించండి” అన్నది రూపాభవాని.

ఆమె చెప్పినట్లు ఎందరెందరికో సరిపోయింది ఆ చిన్న పాత్రలోని పరమాన్నం. అందరికి వడ్డన జరిగింది. ఆహుతులు వెళ్ళిపోయారు.

అప్పుడు ఆమె అత్తగారు ఆ పాత్రలో ఏముందో అని చూసింది. రెండు మూడు మెతుకులున్నాయి అంతే!

మరునాడు ఉదయం రూపాభవాని ఆ పాత్రను తీసుకుని వితస్తనదిలో ఉంచి “మా నాన్న దిద్దిమార్ ఘాట్ లో పూజలు చేస్తున్నాడు అక్కడకు పో” అని నదిలో వదిలింది ఆ పాత్రను.

దీనిని తిలకిస్తున్న అత్తగారికి సంతోషం, ఆశ్చర్యం బదులుగా ద్వేషం ఏర్పడింది కోడలిపై.

మరోసారి ఆమె అత్తవారింట్లో యజ్ఞం జరుగుతొంది. ఆ ఇంటి కుల పురోహితున్ని వచ్చిన బ్రాహ్మణులు అవమానించారు.

ఆ పురోహితుడు అవమానం భరించలేక భోజనం చేయకుండా వెళ్ళిపొదలచుకున్నాడు.

రూపాభవాని అతడిని నదిలో స్తానం చేసి రమ్మంది. ఆమె శక్తులపై నమ్మకం ఉన్న అతడు నదిలో స్నానం చేసివచ్చాడు.

ఇక భోజన సమయంలో అనర్గళంగా సంస్కృతంలో శ్లోకాలు చెప్పసాగాడు. బ్రాహ్మణులు తలలు దించుకున్నారు అయన పాండిత్యానికి.

అయితే రూపాభవాని అత్త, ఆమెను ఇంటినుండి వెడలగొట్టింది. తండ్రి పంచన చేరి రూపాభవాని మహాయోగిని అయింది.

ఫిబ్రవరిలో వచ్చే మాఘ కృష్ణ సప్తమినాడు ఆమె మహా సమాధి చెందింది.

ఆ మహాయోగిని స్మరణ మనలను ఆధ్యాత్మిక పధంలో నడుపు గాక!

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles