Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయిబాబా తన భక్తులచే భావార్థదీపిక అంటే జ్ఞానేశ్వరిని పఠింపచేశాడు.
మహరాష్ట్రులకు జ్ఞానేశ్వరి ఎంత విలువైనదో తెలుగు జాతికి విద్యాప్రకాశానందగిరి వారి గీతామకరందము అంత విలువైనది.
ఎవరు ఏ రంగమున అధికముగా శ్రమించగలరో అట్టివారికి మకరవాహిని గంగ విచిత్రరీతిలో ప్రోత్సహించును.
గంగ వీణను ప్రసాదించింది. విద్యాప్రకాశనందగిరిని గంగ కరుణించింది. విద్యాప్రకాశానంద బాల్య నామం ఆనందమోహన్.
అయన తండ్రి పేరు రామస్వామి. ఒకసారి విద్యాప్రకాశానందగిరి ఇంకా సన్యాసాశ్రమం స్వీకరించక పూర్వం అయన తండ్రితో ఋషీకేశం చేరారు.
ఋషీకేశంలో వారు గంగా నదిలో పడవపై పయనిస్తుంటే ఒక గడ్డిమోపు కొట్టుకొస్తుంది. దాన్ని జాగ్రత్తగా చేత్తో పట్టుకుని పడవలోనికి తీసుకున్నాడు కాబోయే విద్యాప్రకాశానందగిరి.
ఆశ్చర్యం, అందులో సంస్కృతం భగవద్గీత, దానిపై పరిమళ పుష్పలు కనిపించాయి. అది మహా ప్రసాదంగా, కానుకగా భావించి కళ్ళుకద్దుకున్నారు.
ఈ సంఘటన తన కర్తవ్య దీక్షగా ఆ గంగామాత తెలిపిందని భావించాడు. ఇక అయన భగవద్గీతపై గల గ్రంథాలను సంపూర్ణంగా అధ్యయనం చేసినాడు.
సద్గురు మళయాళస్వామి వారిచే తూనుగుంట్ల ఆనంద మోహన్ సన్యాసదీక్ష గైకొని విద్యాప్రకాశానందగిరి అయ్యారు.
ఒకసారి మళయాళస్వామి వారు విజయవాడకు వెళ్ళి రామస్వామి గారింటికి భిక్షకు వెళ్ళారు.
ఆ సమయంలో ఆనందమోహన్ ఇంట్లో లేడు. మళయాళస్వామి వారు రామస్వామిగారికున్న ఐదుగురి బిడ్డలలో ఒకరిని ఆశ్రమానికి అందింపమని కోరారు.
ఆనందమోహన్ గారి తండ్రి రామస్వామిగారు తటపటాయించకుండా, ఆనందమోహన్ ను ఇస్తామన్నారు. బంగారానికి తావి అబ్బినట్లు అయ్యింది ఆనందమోహన్ కు.
గురువు మళయాళస్వామియే ఆయనకు తండ్రి. తండ్రితనయుల బంధాన్ని అయన ఆధ్యాత్మిక పథంలోనూ చూపారు.
తండ్రి వ్యాసాశ్రమము స్థాపిస్తే, కుమారుడు శుకాశ్రమాన్ని నిర్మించారు. వ్యాసుడు, శుకుడు తండ్రీ కుమారులే గదా!
రచనా వ్యాసంగమే కాదు. ఆయా అనేక జ్ఞాన యజ్ఞాలను వివిధ ప్రదేశాలలో నిర్వహించారు.
తన బాల్యం నుండే అనర్గళంగా తన వాక్పటిమతో సంస్కృత, ఆంగ్ల, తెలుగు భాషల్లో ఉపన్యసించారు.
ఒకసారి బ్రహ్మశ్రీ కాశీకృష్ణాచార్యులవారు “ఈ బాల బ్రహ్మచారి భవిషత్తులో గొప్ప యతీశ్వరుడు కాగలదు. ఇతని కీర్తి నలుదిశలా వ్యాపిస్తుంది. అని దీవించారు.
కృష్ణపరంగా అయన గీతమకరందాన్ని, రామపరంగా యోగవాసిష్ఠ రత్నాకరాన్ని, మనకు అందించిన ఆ మహానుభావుని వర్థంతి నేడే అనగా 10 ఏప్రియల్ ( 1998).
అయన ఒక సందేశాన్ని పాటించెదము గాక – “నిర్బయుడవై ఉండుము.భగవంతుడు మీ చెంతనున్నాడు”.
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- గురువుల కన్న అమ్మ…. మహనీయులు – 2020… ఏప్రిల్ 9
- నిదురపోరా, శ్రీధరా! …. మహనీయులు – 2020… ఏప్రిల్ 26
- ఎవరిపై విశ్వాసం? …. మహనీయులు – 2020… ఏప్రిల్ 7
- పరీక్షలు …. మహనీయులు – 2020… ఏప్రిల్ 23
- ఇక్కడా, అక్కడా! …. మహనీయులు – 2020… ఏప్రిల్ 24
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments