Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
మా ఇంటి విషయానికి వస్తే నాకిద్దరబ్బాయిలు, ఒక అమ్మాయి. అమ్మాయి ” లా” చదివే, రోజుల్లోనే తనతో పాటు లా చదువుతున్న అబ్బాయిని ప్రేమించింది. ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడ్డారు.
ఆ అబ్బాయిది ఉత్తరప్రదేశ్. కొన్నాళ్ల తర్వాత అతన్ని మా ఇంటికి, పరిచయం చేసింది.
మేము సహజంగానే అమ్మాయి మీద కోప్పడ్డాము. మమ్మల్ని కన్విన్స్ చేసింది. మేము అతి కష్టం మీద, వారి ప్రేమని ఆమోదించాము.
ఆ అబ్బాయి తరచూ ఇంటికి వస్తూ, మా పిల్లలతో గడుపుతుండేవాడు. వీలు దొరికినపుడు ఆ అబ్బాయి, మా అమ్మాయి బైక్ మీద షికార్లు తిరుగుతుండేవారు.
” బాబూ! మీ ఇంట్లో వాళ్ళు మీ వివాహానికి ఒప్పుకుంటారా?” అని అడిగితే, ” ఆ ఒప్పుకుంటారండీ ” అనే వాడు.
ఆ పిల్లవాడికి తండ్రి లేడు, తల్లి మాత్రం ఉంది. అన్నదమ్ముల్లేరు, చెల్లెల్లు ఉన్నారు. తల్లిని వీళ్ళ పెళ్ళికి ఒప్పించాలి.
ఏవో సెలవులు వస్తే , ఆ అబ్బాయి ఊరు వెడతానంటే అతనికి ” మీ అమ్మగారితో మాట్లాడి పెళ్ళికి వప్పించు ” అని చెప్పాము.
అతను సరే నంటూ ఊరు వెళ్ళాడు. ఆ ఊరు వెళ్ళాక వాళ్ళ అమ్మకీ విషయం చెప్పాడట. వాళ్ళు వాళ్ళ మేన మామల అండలో ఉన్నారట.
అదీ కాకుండా వాళ్ళ ఇళ్లల్లో వేరే స్టేట్ అమ్మాయిని ఇప్పటిదాకా ఎవరు వివాహం చేసుకోలేదట.
” ఈ పెళ్లి కనుక చేసుకుంటే, మనకి మేనమామల అండ ఉండదు, అందుకు నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దు, కాదు కూడదు అంటూ ఆ అమ్మాయినే నువ్వు పెళ్లి చేసుకుంటానంటే నేను ఆత్మహత్య చేసుకుంటాను. ఆ తర్వాత నీ ఇష్టం.
కావాలంటే ఇక్కడ అమ్మాయినే కట్నం లేకుండా చేసుకో, వేరే స్టేట్ అమ్మాయినైతే నేను ససేమిరా ఒప్పుకోను ” అందావిడ.
” నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. కానీ వేరే అమ్మాయిని చేసుకోను, నువ్వు ఆ అమ్మాయిని చేసుకోవడానికి వప్పుకోకపోతే నేను జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉండిపోతానని వాళ్ళమ్మకి చెప్పి వచ్చాడట ”.
ఆ అబ్బాయి ఇక్కడికి వచ్చాక విషయమంతా మాకు చెప్పాడు. ఆ అబ్బాయి వాళ్ళమ్మ కు ఇష్టం లేకుండా మా అమ్మాయిని పెళ్లి చేసుకోదని మాకర్థమైంది.
వాళ్ళమ్మ వప్పుకోదు. మాకింక మా పిల్లకి వేరే సంభందాలు చూడాలి అనుకున్నాము. దానికి మా అమ్మాయి వప్పుకోలేదు.
వీళ్ళ పెళ్ళికి, పిల్లవాడి తల్లి వప్పుకోదు, ఆవిడ ప్రమేయం లేకుండా ఈ అబ్బాయి పెళ్లి చేసుకోడు. పిల్లకి వేరే సంబంధాలు చూసాము.
కానీ ఏ ఒక్క సంభంధం కలిసి రాలేదు. వీళ్ళేమో కలిసి తిరగటం మూలంగా, ఈ పిల్ల ఎవరినో ప్రేమించింది. వాడితో సినిమాలకి, షికారులకి తిరిగింది.
ఎక్కడో బెడిసి కొట్టింది అందుకని మరో సంభందం చూస్తున్నారు అంటూ చెప్పుకున్నారు అందుకోసం సంభందాలు కూడా రాలేదు బయట మొహం చూపించుకోలేక పోతున్నాము. అలా మూడేళ్లు గడిచిపోయింది.
ఇదంతా కాదు పెళ్లి చేసుకో బాబూ మీ అమ్మగారు తర్వాత వప్పుకుంటారులే అని అబ్బాయితో అంటే ”లేదాంటీ అమ్మని వప్పించే పెళ్లి చేసుకుంటా ” అని అంటాడతను.
ఈ పరిస్థితుల్లో నాకింకా దిక్కు తోచక , ”బాబా నువ్వే దిక్కు నువ్వేం చేస్తావో నీ ఇష్టం. ఇంక పిల్ల పెళ్లి భారం నీదే బాబా ” అని కళ్ళనీళ్లతో దండం పెట్టాను.
2001 సంవత్సరంలో మొదలైన ప్రహసనం 2004 సంవత్సరం దాకా కొనసాగింది.
నేను బాబాతో చెప్పుకున్నాక ఒక రోజు ఆ అబ్బాయి సెలవులకి, ఇంటికి వెళ్లి అక్కడ నుంచి మాకు ఫోన్ చేసాడు.
” ఆంటీ ! మా అమ్మ పెళ్ళికి వప్పుకుంది.ముహూర్తం పెట్టించి మాకు ఫోన్ చెయ్యండి.” అన్నాడు.
అతడలా అన్నదే తడవుగా పెళ్ళికి ముహూర్తం పెట్టించాము. శుభలేఖలు కొట్టించాము. మిగతా ఏర్పాట్లన్నీ త్వర త్వరగా జరిగిపోయాయి.
పెళ్లి అనుకున్నదానికంటే వైభవంగా జరిగింది. పెళ్లి అయిన మరునాడే బాబా నా కలలో కనపడి, ” సాధించవు! పెళ్లి చేయించమన్నావు, పెళ్లి అయిందా! మూడు సంవత్సరాలు పట్టింది, నీ వియ్యపురాలిని పెళ్ళికి వప్పించడానికి, పెళ్లి చేయించినందుకు నాకేమిస్తావు ”? అని అడిగాడు.
నేను ” నీకేమివ్వగలను బాబా?” అంటే, ‘‘ఏమివ్వద్దు కానీ మీ అమ్మాయి ఫోటో ఒకటి నా దగ్గర పెట్టు ” అని అన్నాడు.
తెల్లారాక కల జ్ఞాపకం చేసుకొని ” బాబా ! నువ్వే మా అమ్మాయి అత్త గారిని పెళ్ళికి వప్పించావు. నువ్వే వాళ్ళ పెళ్లి జరగటానికి కష్ట పడ్డావా? బాబా ”!
ఒక ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టావా? పైగా మా అమ్మాయి బాధ్యత పూర్తిగా నువ్వు వహిస్తానని చెప్పటానికి, దాని ఫోటో ఒకటి నీ దగ్గర పెట్టమంటున్నావా? బాబా అనుకుని అమ్మాయి ఫోటో ఒకటి బాబా పాదాల ముందు వుంచాను.
అమ్మాయి, అల్లుడు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. అత్తగారు కూడా అమ్మాయిని తన కూతురుతో సమానంగా చూసుకుంటోంది.
వాళ్ళకిప్పుడు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. బెంగుళూరు లో నివాసముంటున్నారు.
The above miracle has been typed by: Mrs. Rajarajeswari Sainathuni
Latest Miracles:
- నా పెళ్లిని , చెల్లి పెళ్లిని చక్కబెట్టిన బాబా ….!
- సాయి దగ్గర ఉండి మరీ నా పెళ్లి చేసారు.—audio
- 2 ,40,000/- రూపాయలు ఎలా వస్తాయి అనుకోని చింతిస్తూ వుంటే బాబా వారు 2 రోజుల్లో అందించారు.
- బాబా ఆశీర్వాదంతో జరిగిన మా అమ్మాయి పెళ్లి …..!
- “బాబా నాకు తెలియకుండానే నేను నీ అండన చేరాను. నీ ఒడి లోనే ఉంటున్నాను. నన్నెదుకయ్యా బాధ పెడతావు.”
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments