Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
నేను పని చేస్తున్న కాలేజీ పిల్లల ఎగ్జామ్స్ అయ్యాక నన్ను యాజమాన్యం వెళ్లమంటున్నారు. అందుకని నేను August 10th న వచ్చి join అవుతాను అని వారికి (శిరిడీ) లెటర్ రాసాను.
నేను చెప్పిన దానికి వారు కూడా వప్పుకున్నారు. నేను సొంతంగా పెట్టుకున్న ఇన్సిట్యూట్ ని వేరే వారికి అమ్మేసాను.
నేను ఇన్నాళ్ళు పనిచేసినందుకు శంకర మఠం దగ్గర ITI యాజమాన్యం కొంత డబ్బు ముట్ట జెప్పారు.
అప్పటికే మా అమ్మాయి పాలిటెక్నీక్ చదువుతుంది. హైదరాబాద్ లో వుండంగానే ఆ డబ్బు ఈ డబ్బు పోగేసి మా మెన్నల్లుడు కి ఇచ్చి అమ్మాయి వివాహం చేసేసాను. లక్షా డెబ్భై వేలు ఖర్చు చేసాను.
పెళ్లి అయ్యేటప్పటికి ఇంక నా దగ్గర డబ్బులేమీ మిగల లేదు. డబ్బుల్లేక పోతేనేం అమ్మాయికి పెళ్ళి చేశానన్న తృప్తి తో శిరిడీ మహాసంస్థానం లో అడుగుపెట్టాను.
అంతా కొత్త ప్రదేశం. కొత్త భాష అంతా కొత్త కొత్త గా వుంది. జానారణ్యం లొంచి మహా లోకం లోకి అడుగుపెట్టినట్లుగా వుంది.
ఇక్కడికి వచ్చాక కొన్నళయ్యాక సంస్థాన్ వాళ్ళు ఇక్కడ పనిచేసే వాళ్ళకి ఇళ్ళు స్థలాలు కేటాయిస్తున్నారని అన్నారు. నా దగ్గర డబ్బులు లేవు.
స్థలం ఖరీదు Rs. 14000. లోన్ అప్లై చేసుకొని స్థలం కొనుక్కోమని చెప్పారు. నాది డైరెక్ట్ అప్పాయింట్మెంట్ కాబట్టి లోన్ ఇస్తామన్నారు.
కొందర్ని కాంట్రాక్టు పద్దతి లో ఉద్యోగాలలోకి తీసుకుంటూ ఉంటారట. నాకలా కాకుండా డైరెక్టు గా ఉద్యోగం ఇచ్చారు. ఆలా స్థలం ఏర్పడింది.
మరో చోట ఇళ్ళు కట్టించి ఇస్తామన్నారు. స్థలం కోసం అని పోటీ పడుతుంటే డ్రా తీస్తామన్నారు. డ్రా ప్రకారం నా పేరు 3 లో వచ్చింది. ఇల్లు అమరింది.
ఆ తర్వాత ఒక దాని తర్వాత ఒకటిగా కొన్ని స్థలాలు కొన్నాను. అలా బాబా తన అక్కున చేర్చుకున్నాడు.
ఆ తర్వాత మా అబ్బాయి పెళ్ళి చేయాలనీ చాల సంబంధాలు చూసాను. బెంగుళూరు మహాపట్నం లో I BOLL కంపెనీ లో పని చేస్తున్నాడు.
ఎన్ని సంబంధాలు చూసినా కుదరటమే లేదు. అంత దాకా వస్తున్నాయి వెళ్ళి పోతున్నాయి. ఇంక నేను బాబాకి మొరపెట్టుకున్నాను.
“బాబా నాకు తెలియకుండానే నేను నీ అండన చేరాను. నీ ఒడి లోనే ఉంటున్నాను. నన్నెదుకయ్యా బాధ పెడతావు.” వాడికెందుకు పెళ్లి కుదరనీయవు.
ఏమి చేస్తావో నాకు తెలియదు నీ ధుని లో 5 వారాలు 5 కొబ్బరికాయలు వేస్తాను. నువ్వే సంబంధాలు చూడు. నువ్వే పెళ్ళి చేయ్ అన్నాను ద్వారకామాయి లో నిలబడి.
నాకే సమస్య వచ్చినా వెంటనే ద్వారకామాయి లో నిలబడి, బాబా కి మొక్కడం అలవాటు. 1 కొబ్బరికాయ వేసాను. ఒక సంబంధము వచ్చింది.
మా అబ్బాయ్ బెంగళూరు లో పని చేస్తున్నాడు ఆ అమ్మాయి వాళ్ళది కూడా బెంగుళూరే. కాబట్టి వాడు వెళ్లి అమ్మాయిని చూసాడు.
ఎందుకంటే అప్పటికే చాలా సంబంధాలు వచ్చాయి. ఏ ఒక్కటి కుదరకపోవటాన ఒక విధంగా అందరం విసిగిపోయాము.
అమ్మాయి మా వాడికి నచ్చింది. మా అమ్మానాన్న కూడా అమ్మాయిని చూడాలి అన్నాడుట. వాళ్ళు శిరిడీ లో వుంటారని మా వాడు చెప్పాడుట.
అవి శ్రీరామనవమి రోజులు. మాకు అమ్మాయిని చూపించటానికి వాళ్ళే వచ్చారు. లెండీ తోట లో పెళ్ళి చూపులయ్యాయి.
బెంగుళూరు లోనే పెళ్ళి చేసారు. చాలా వైభవంగా పెళ్ళి చేసారు. మా వియ్యాల వారికి మా కోడలు ఒక్కటే ఆడపిల్ల. మగపిల్లలు లేరు.
చాలా డబ్బు కలవారు. మా వాడికి ఒక కారు ఇచ్చారు. బ్రాస్లెట్ పెట్టారు. 25 వేలు సూట్ పెట్టారు.
పెళ్ళి కి ముందు మా కోడలు ఒక బ్యాంక్ లో మేనేజర్ గా పని చేస్తోంది. దాదాపు లక్షా పైనే జీతం వుంటుంది(లక్ష్మీ బ్యాంక్)..
బెంగళూరులో కాపురం పెట్టారు. మా అబ్బాయికి మేమంటే చాలా ప్రేమ. మమ్మల్ని శిరిడీ వదలి బెంగళూరు రమ్మంటాడు. మాకు శిరిడీ వదలి మరెక్కడికి పోబుద్ది కాదు.
మరో విషయం ఏంటంటే మా వియ్యాల వారు కూడా బాబా భక్తులు. వాళ్ళకి బాబా అంటే ఎనలేని భక్తి గౌరవం .
The above telugu TEXT typed by : Mr. Sreenivas Murthy
Latest Miracles:
- శిరిడి యాత్రకు బాబా ధన సహాయం
- ” బాబా ఈ పిల్ల చాలా బలహీనంగా ఉంది కానుపు ఎలా చేస్తావో నీ ఇష్టం, ఇంక దీని భాద్యత నీదే”–Audio
- గ్వాలియర్, గోవా రాజపరివారం వాళ్ళు ఇప్పటికి సాయి బాబా భక్తులే
- ‘‘మళ్ళీ పెళ్ళి చేసుకో సాఠే! నీకు తప్పకుండా మగపిల్లాడు పుడతాడు. నాదీ హామీ.’’
- బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు “నీవు ఎక్కడికైనా వెళ్ళు.నేను నీ వెంటే ఉంటాను”అని అన్నారు.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments