” బాబా ఈ పిల్ల చాలా బలహీనంగా ఉంది కానుపు ఎలా చేస్తావో నీ ఇష్టం, ఇంక దీని భాద్యత నీదే”–AudioSai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai BabaThis Audio prepared by Mr Sreenivas Murthy


మా రెండవ అమ్మాయి దీపిక పెళ్ళి కూడా అనుకోకుండా కుదిరిపోయింది. పెళ్ళి బాబా దయతో బాగా జరిగింది.

పెళ్ళి అయిన రెండవ నెలలోనే పిల్ల నెల తప్పింది. అమ్మాయి చాలా బలహీనంగా ఉంటుంది , దానికి తోడు దానికి బాగా వాంతులు అవుతుండేవి.

డాక్టర్ ని సంప్రదిస్తే కొన్ని రోజులకి అవే తగ్గిపోతాయని చెప్పింది. 5 నెలలయినా కూడా ఏమాత్రం వాంతులు తగ్గలేదు సరికదా ఏమి తినకుండా తయారయింది.

నాకు చాలా భయం పట్టుకుంది, ఇది ఇప్పుడే ఇలా ఉంటే ప్రసవ సమయానికి ఎలా తట్టుకుంటుందని.

అప్పట్లో  శిరిడికి దగ్గరలో ఉన్న సాకోరిలో ఒక ములగ చెట్టు ఉండేది. దాని మాను మొదట్లో వినాయకుడు, ఆంజనేయస్వామి కలసినట్లుగా ఉన్నారు.

ఆ చెట్టుకి 9 కొబ్బరికాయలు మాలగా కట్టి వేస్తే మనం అనుకున్న పనులవుతాయని విని నేను మొక్కుకున్నాను,

అక్కడే కాకుండా, ద్వారకామాయిలో కూడా 9 కొబ్బరికాయలు మాలగా వేయిస్తానని అనుకున్నాను.

శిరిడికి పిల్లని తీసుకొని వెళ్ళాము అనుకున్నట్లుగానే సాకోరీ లో 9 కొబ్బరికాయల మాల గుచ్చి వేయించాను.

తిరిగి శిరిడికి వచ్చి ద్వారకామాయిలో కూడా మాల వేయించినాక, అప్పటిదాకా ఏదీ సరిగా ఇముడ్చుకోలేకపోతున్న పిల్ల, అక్కడ ద్వారకామాయి లో పెట్టిన ప్రసాదం కూడా తినింది.

బాబాకు నేను దండం పెట్టుకున్నాను ఏమనంటే ‘ బాబా ఈ పిల్ల చాలా బలహీనంగా ఉంది కానుపు ఎలా చేస్తావో నీ ఇష్టం ఇంక దీని భాద్యత నీ మీదే పెడుతున్నా ‘ అని అనుకున్నాను.

తిరిగి అదేరోజు హైదరాబాద్ వచ్చేసాము. వచ్చేటప్పుడు గమనించింది ఏమిటంటే. శిరిడిలో ఉండగా పాపకి ఒక్క వాంతి కూడా అవలేదు.

నెలలు నిండాక ఆసుపత్రిలో చేర్పించాము. చాలా కష్టపడుతోంది, అసలు దానికి ఏమాత్రం ఓపిక లేదు.

నేను బాబా బాబా అని బాబాని తలచుకుంటూనే ఉన్నాను. ఇంతలో ఒక పెద్ద డాక్టర్ వచ్చి మా అమ్మాయితో ” అమ్మా! కొంచెం సేపు మాకు సహకరించావంటే నీకు పండంటి పాప పుడుతుంది. ఏమంటావు? ” అంది.

మా అమ్మాయి నీరసంగా ” సరే డాక్టర్ ” అంది కాసేపట్లోనే సుఖ ప్రసవం అయ్యింది, పుట్టిన పాప చాలా ఆరోగ్యంగా ఉంది, తల్లీ పిల్ల కులాసాగా ఉన్నారు.

The above telugu TEXT typed by : Mr. Sai Krishna (Active Devotee of Baba)

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles