Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
నేను పెళ్లికాక ముందు హైదరాబాద్, గౌలిపురాలో ఒక రూమ్ లో ఉండేవాడిని. అక్కడ నేనున్న రూమ్ కి దగ్గరలో ఒక యువ జంట ఉండేవారు. అతని పేరు కుమారస్వామి, ఆ అమ్మాయి పేరు రేణుక, వాళ్ళకి ఒక అమ్మాయి, ఆ పాపని ” పప్పీ ” అని ముద్దుగా పిలుచుకునేవారు. ఆ పిల్ల నన్ను ‘ మావయ్యా! ‘ అని పిలిచేది.
తరచూ నా దగ్గరకి వస్తుండేది. చిన్న పిల్ల కావటం వల్ల నేను చాక్లేట్లు , బిస్కెట్స్ ఇవ్వటం, నేను బయట నుండి తినేవి ఏమైనా తెచ్చుకుంటే, పిలిచి దానికి ఇవ్వడం చేస్తుండేవాడిని.
వాళ్ళ అమ్మ రేణుక కూడా నన్ను తన సొంత అన్నయ్య లాగా చూసుకునేది. నా బట్టలు ఉతికి పెట్టడం, ఇస్త్రీ చేసి పెట్టడం, వాళ్ళింట్లోంచి వండిన కూరలు అవి నాకు తెచ్చివ్వడం చేస్తుండేది.
ఇంచుమించుగా నేను వాళ్ళ ఇంట్లోని మనిషిని అయిపోయాను. కుమారస్వామి ఆటో డ్రైవర్. ఆ తర్వాత వాళ్ళు నా పెళ్ళికి కూడా వచ్చారు. మా ఆవిడకి కూడా వాళ్ళు బాగా తెలుసు.
ఇంతకీ నేను శిరిడి నుంచి బయలుదేరటం ఆలస్యం అయిపోయినా, నన్ను వ్యాన్ ఎక్కించి తీసుకువచ్చి, వెళ్ళిపోతున్న ట్రైన్ ఎక్కించి మరీ బాబా నన్ను హైదరాబాద్ ఎందుకు తీసుకువచ్చాడంటే, ఆ తల్లి రేణుక చనిపోయింది.
నా కోసం మా ఇంటికి కబురు పంపారు, నేను శిరిడి వెళ్లినట్లు మా ఆవిడ చెప్పిందంట, నేను ఇంటికి వచ్చే సమయానికి ఆ అమ్మాయిని స్మశానానికి తీసుకొని వెళ్లిపోయారు.
నేను ఇంట్లో అడుగు పెట్టగానే వెంటనే మా ఆవిడ ఆ విషయం చెప్పి, వెంటనే వెళ్ళండి, ఆఖరి చూపు అయినా దక్కుతుందేమో అని అంది. నేను పిల్లని, సామానులని గుమ్మంలోనే వదిలిపెట్టి గబా గబా స్మశానానికి వెళ్ళాను.
నేను చివరిసారిగా ఆ అమ్మాయి మొహాన్ని చూడగలిగాను. నన్ను సొంత అన్న లాగా చూసుకున్న ఆ అమ్మాయిని నేను ఆఖరి చూపైనా చూసేటట్లు బాబా చేశాడన్న కృతజ్ఞతగా, బాబా మీద అభిమానం పెరిగింది.
అప్పటి దాకా గురువారం భక్తులుగా వున్న మేము, గురు భక్తులుగా మారిపోయాము. ఒకే ప్రయాణంలో రెండు అనుభవాలను ఇచ్చాడు బాబా.
1986 సంవత్సరంలో మా తమ్ముడికి పెళ్లి మా ఊరిలోనే జరిగింది. ఆ తర్వాత మా మరదలు వాళ్ళింట్లో వ్రతం చేసుకున్నారు. ఆ వ్రతం కోసం తెనాలి దగ్గర చెరుకుపల్లి అనే ఊరు వెళ్ళాము.
మా చుట్టాలు అందరూ వున్నారు, మాతో పాటు పప్పీ , వాళ్ళ నాన్న ఇద్దరూ వచ్చారు. వర్షాకాలం కావటాన మబ్బుగా వుంది. వ్రతం అయిన దగ్గర నుండి వాన పడుతుంది.
వున్నట్టుండి పప్పీ వాళ్ళ నాన్న ముక్కులోనుంచి రక్తం కారటం మొదలైంది. ఏం చేసినా ఆగటం లేదు. తెనాలి తీసుకువెళ్ళాం. చాలా రక్తం పోతుంది.
హాస్పిటల్ లో చేర్పించిన తర్వాత డాక్టర్ గారు ఏదో ఇంజక్షన్ చేసారు. అయినా కూడా గుణం కనిపించలేదు సరికదా ముక్కులోంచి రక్తం పోవటంతో పాటు, మలద్వారం నుంచి కూడా రక్తం పోవటం మొదలయ్యింది.
మేమంతా చాలా కంగారు పడ్డాము. తెనాలి నుంచి గుంటూరు తీసుకువెళ్లి అక్కడి ఆసుపత్రి లో చేర్చాము.
అక్కడ జి.వి. కృష్ణారావు గారు డాక్టరుగా వున్నారు. నేను నా జేబులో బాబా ఫోటో ఒకటి ఎప్పుడూ ఉంచుకుంటాను. అది తీసి బయటపెట్టి, ” బాబా అతను చాలా మంచివాడు, పాపకి తల్లి లేదు, తండ్రి కూడా లేకుండా చేస్తావా?
అతను మా ఇంటి పెళ్ళికి చుట్టం చూపుగా వచ్చాడు. అతన్ని మామూలుగా చేసి పంపించు బాబా ” అని దణ్ణం పెట్టుకుని ఒక మామిడి పండును బాబాకి నైవేద్యం పెట్టాను.
నాలుగు రోజులు గడిచేటప్పటికి అతనికి కొంచెం కొంచెంగా బాగవడం మొదలు పెట్టింది. నాలుగు రోజులు ఆసుపత్రిలో వుండి వచ్చాను. బాబా ఈ విధంగా నా మొర ఆలకించారు..
The above Telugu text has been typed by : Mr. Sai Krishna
Latest Miracles:
- కృష్ణప్రియ భర్తను తన భక్తునిగా బాబా వారు మార్చుకొనిన వైనం
- బాబా వారు చేసిన లీలల ద్వారా బాబా మీద నమ్మకం లేని భక్తుని కుటుంబ సభ్యులందరినీ తన భక్తులుగా మార్చుకున్న సాయి మహారాజ్….
- నవ గురువారం వ్రతం చేసుకోవాలి అని సంకల్పించిన భక్తురాలి కోర్కెను తీర్చిన బాబా వారు
- నోరు తెరచి అడగకుండానే మనసులోని కోరికను తీర్చిన బాబా వారు
- నా మనసులోని కోరికను గురువు గారి ద్వారా బాబా తీర్చిన వైనం
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments