కృష్ణప్రియ భర్తను తన భక్తునిగా బాబా వారు మార్చుకొనిన వైనం



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


ఇన్ని రోజులు సాయినాథులు కృష్ణప్రియ పడే కష్టాలే చూశారు. ఇంక తన బిడ్డను అన్ని వైపుల నుంచి రక్షించాలి అని నిర్ణయించుకొని తన పదునైన వ్యూహాన్ని ప్రయోగించారు. అదే సమర్థ సద్గురువు చేసే పని.

మొదట వ్యూహం, కృష్ణప్రియ భర్తను తన భక్తునిగా చేసుకోవడం, ఎలానో వినండి. అతనికి office లో మంచి పేరు, ప్రతిష్టలు వున్నాయి. నిజాయితీ పరుడని పేరు.

ఒక రోజు రావు గారు ఆఫీసుకు వెళ్ళారు. ఇంటి నుంచి office కు వెళ్ళి చూద్దురు కదా! తాళం చెవుల గుత్తి ఎక్కడో పోయింది. ఆయన table draw లో రోజు పెడతారు. మొత్తం office తాళం చెవులు ఆ గుత్తిలోనే వున్నాయి. అంతే, ఆచేతనుడై చూస్తూవున్నాడు.

తాళం చెవులు ఎక్కడ పోయినాయో తెలీయదు, ఇంట్లో మర్చి పోయినాను అనుకోని ఇంటికి వచ్చి వెతికారు. ఇంట్లో లేవు. మళ్ళీ office వెళ్ళారు. అవి office ఖజానా తాళం చెవులు, పొతే అతి చెడ్డపేరు వస్తుంది. అతను ఆలా దుఃఖంతో కూర్చుండి పోయినారు.

ఇంతలో అతని స్నేహితుడు ఒకరు వచ్చి ఒక సాయిబాబా photo ఇచ్చి, “ఈయన శిరిడీ సాయిబాబా వారు, చాలా మహిమగల పరబ్రహ్మ, పరమాత్మ, జగత్ గురువు ఈయన్ని విశ్వసించు, నీ తాళం చెవులు దొరుకుతాయి, ఈ కష్టం నుంచి ఆయనే నిన్ను గట్టున పడేస్తారు అని చెప్పారు.”

ఆపదలో వున్నా రావు గారు,సరే అనుకోని ఆ ఫోటో తీసుకొని ఆయనకు నమస్కరించి, నిజంగా మీరు అంత మహిమాన్వితులు అయితే నన్ను ఈ ఆపదనుండి గట్టెక్కించండి, నేను నా జీవితాంతము మిమ్మల్ని నమ్ముతాను అని ఒక మొక్కు పెట్టుకున్నాను. అంతే, తరువాత రోజు ఆ ఖజానా తాళం చెవులు ఆయన టేబుల్ పైన దర్శనం ఇచ్చాయి.

ఆ రోజు నుంచి ఆయన సాయిబాబా భక్తుడయ్యాడు. ఇక్కడ పాఠకులు గమనించాలి, రావుగారికి తన భార్యపైన అస్సలు మక్కువ లేదు. ఆమె కోరిక తీర్చె ఒక సాధనం మాత్రమె. కాని ఆమెకు జన్మ, జన్మల గురుదేవులు సాయినాధులే అని ఆయనకు తెలియదు.

తన భార్య, బిడ్డలకు తల్లి, ఈ సాయినాథుని మాటకు కట్టుబడివుందని తెలియదు. కానీ అదే సాయినాథుడు, తన బిడ్డ కష్టాలు గట్టెక్కాలని ఆమె భర్తను ముందు తన భక్తునిగా చేసుకోవడానికి ఆడిన నాటకం ఇది.ఎంత చతురుడో మన సమర్థ సద్గురువు చూడండి.

అందుకే కృష్ణప్రియకు చెప్పాడు, నా గురించి నువ్వు ఎవ్వరికి ఏమీ చెప్పకు అన్నారు. ఆమె ఎవ్వరికి ఏమీ చెప్పలేదు. చివరికి భర్తకు కూడా, ఎంత ఆజ్ఞాకారి శిష్యురాలో చూడండి. అందుకే సాయినాధులు ఆమెను “నా బిడ్డా” అని పిలిచేవారు.

ఇక్కడ కృష్ణప్రియకు సంసారమందు కోరికలేదు, భౌతిక దర్మం కోసం నెరవేరుస్తుంది. ఆరోగ్యం సరిగా ఉండదు. నన్ను ఈ సంసారం నుండి విముక్తురాలిని చెయ్యమని, నిత్యం తన గురుదేవులను ప్రార్ధిస్తూవుంది.

ఎవ్వరికి ఏమీ చెప్పా లేక భరించలేక తనలో తానే వ్యధ చెందుతూ వుంది.

రావు గారు తన భార్య అనారోగ్యవంతురాలని బిడ్డలను, భార్యను రామచంద్రాపురంలో వదిలేసి నాగపూర్ వచ్చారు. మధ్య, మధ్యలో చూసే దానికి వెళ్ళేవారు.

ఒక రోజు ఆరోగ్యం చాలా క్షీణించి పోయింది. భర్తకు, తన బిడ్డలను బాగా చూసుకోమని , నేను ఇంక బ్రతక జాలను అని అప్పగింతలు పెట్టింది. అప్పుడు రావు గారు శ్రీ సాయిబాబా photo ఆమె తలగడ కింద పెట్టి, ఈయన చాలా మహిమ గలవారు, నిన్ను తప్పక రక్షించగలరు, అని చెప్పాడు. అది విని ఆయన అమాయ కత్వానికి నవ్వుకుంది.

సర్వం సాయినాథార్పణమస్తు.

ఈ బాబా వారి లీలను వ్రాసిన వారు : మాధవి, భువనేశ్వర్

                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                        …..సశేషం…..

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

31 comments on “కృష్ణప్రియ భర్తను తన భక్తునిగా బాబా వారు మార్చుకొనిన వైనం

Gourahari

Baba chala baaga aayananu marcharu

Ratna

Super aunty.

Rahul

Wow.super plan.aunty.

Arunavalli

Chala baagundi.madam.sairam.

Sambid

Jai sai ram.

Sur

Acha planing.mam.baba.baba.baba

Gautam

Sairam..Sairam..Sairam..Sairam..Sairam..Sairam.sairam..Sairam..Sairam…9 times..

Mamata

Baagundhi.mam..Sairam.

dillip

wondrafull.saileela

Sai

Baagundhi.mom..Nuvvu cheppavu.naaku e story..Sairam.

Yaswanth

Manam vellaamu.maa.nuvvu raa.ekkadiki.sairam.

Sampa

Wondrafull sai baba.leela.aunty.

Krishnaveni

Baagarastunnavu..Madhavi..Baba bless u .

Raghunandan

Madhavi..Entha story neeku.elaa telusu?

Radha

Baagundhi.Madhavi..Vishnu.anni cheppadu.neetho vachadu kadha..

Pramadha

Bhale vundhi.nuvvu roju pampu.Madhavi.nenu chaduvuthanu.

Vijayakka

Roju sai charitra chaduvuthunnamu..Nee valana.Madhavi..Gud work

Hari

Venkateswara swamy gudi lo archakudini.nenu.roju saibaba gurinchi chaduvutunnanu.aunty.sairam.

మాధవి

మట్టిలో మాణిక్యం.మతజీ.. ఆమె కథను నేను రాయగలుగుతున్నాను.అంటే..అది నిజం కాదు. వాళ్ళ చెల్లి చూసి..రాసిన కథ.ఇది…నేను మీకు అందిస్తున్నాను.కొద్ది కొద్దిగా..కర్త.కర్మ.క్రియ..బాబా నే…అందరూ చదివి అర్థం చేసుకుంటే.నాకు అంతే చాలు..thank u.. మూర్తి గారు.

E Arunavalli

Jai sairam

Revanth

Om sai ram!

Kaajal

Om sai ram..Mam..Super story..

Somya

Wow..Mam..Just i came..Sairam.

Subbalakshmi

Om sai ram.jai sai ram..Wondrafull.

Srikanth

Chalaa baagundhi.waiting for tomorrow.

Srimathi

Bhale vundhi.akka.super explanation.

Radhika J

Om Sairam

b vishnu Sai

Adbhutam ga undi
Om sai ram

T.V.Gayathri

అద్బుతంగా ఉంది . సర్వం సాయినాధార్పణమస్తు.

Vidya

Adbhutam pinnama

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles