Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
గోపాల కృష్ణ గారి అనుభవములు నాల్గవ భాగం
మా మరదలు వాళ్ళు పెళ్ళి అయిపోయి హైదరాబాద్ లోనే ఉంటున్నారు. వాళ్ళు భార్యాభర్తలతో పాటు అత్తగారు కూడా ఉండేది.
ఆమెకి 5 సార్లు అబార్షన్స్ అయ్యాయి. ఆరవ సారి నెలలు నిండాయి. ఒక రోజు మా మరదలు సువర్చలకి ఫోన్ చేసి నాకు ఎలాగో ఉంది. ఒళ్ళంతా చెమటలు పోస్తున్నాయి. నాకేమి అర్ధం కావటం లేదు. నువ్వు ఒకసారి రా అని సువర్చలని పిలిచింది.
నేను ఆఫీస్ కి వెళ్ళిపోయాను. మా పాప చిన్నది, దాన్ని ఇంట్లో ఉంచి తాళం వేసి చెల్లెలి ఇంటికి వెళ్ళింది. భర్త, అత్తగారు ఉన్నారు.
అందరూ కలసి మా మరదలిని హాస్పిటల్ కి తీసుకెళ్ళారు. డాక్టర్ చూసి అసలు ఏం మనుషులు మీరు చదువుకున్నవారా, కాదా, లోపల బేబీ చనిపోయి వారం అయింది, ఒళ్ళంతా poison అయింది, పెద్ద ప్రాణానికే ప్రమాదం.
ఆపరేషన్ చెయ్యాలి అంటూ అందరిని దులిపేసి, మా మరదలిని ఆపరేషన్ థియేటర్ లోపలికి తీసుకెళ్లింది. చెల్లెలు కదా నా శ్రీమతి ఏమవుతుందో అని కంగారుగా ఉంది.
అరగంట తరువాత నర్స్ కొన్ని కాగితాలు తెచ్చి, సంతకం చెయ్యమంది. నేనెందుకు చెయ్యాలి, ఆమె భర్త వాళ్ళు అక్కడ ఉన్నారు వాళ్ళనడగండి అందిట.
నీకు తెలియదా వాళ్ళు ఎప్పుడో వెళ్లిపోయారు అందిట ఆ నర్స్. సువర్చలకి మతిపోయింది. అంటే ఇప్పుడు మా చెల్లెలికి ఏమైనా అయితే నేనే బాధ్యురాలిని అవుతాను అని భయం పట్టుకుందట.
చేసేది లేక తాను సంతకం పెట్టి “బాబా! ఏమిటి నాకి పరీక్ష, మంచికి పోతే చేడు ఎదురైనట్లు, పసి పిల్లని కూడా చూడకుండా నా కూతురిని ఇంట్లో తాళం పెట్టి, నేను తోడబుట్టినదంటూ అభిమానంతో వస్తే ఇదేదో నాకు చుట్టుకునేటట్టు ఉంది,
పరాయి వాళ్ళు కాబట్టి వాళ్ళు పారియాయారు, రేపటి రోజున నేను మా అమ్మకి ఏం సమాధానం చెప్పాలి,
దాని భర్త వాళ్ళు కూడా మీ సువర్చల మాక్కూడా తెలియకుండా తన చెల్లెలిని తీసుకెళ్లి ఏం చేసిందో అని అంటారు. ఇదంతా నాకు అవసరమా! బాబా అంటూ దండాలు పెడుతూనే ఉందట.
నాలుగు గంటలు అయినా ఎవరూ కనపడటం లేదుట. ఈ లోపల ఒక కాంపౌండర్ ఆపరేషన్ థియేటర్ నుండి బయటకు వచ్చాడుట. లోపల తన చెల్లెలి కండిషన్ ఎలా ఉందొ తనకి తెలియడం లేదు.
ఆ కాంపౌండర్ ని దగ్గరగా పిలిచి వాడికి ఒక 100 రూపాయలు చేతిలో ఉంచి, లోపల ఉన్న పేషెంట్ పరిస్థితి ఏంటో కొంచెం చూసి చెప్పు బాబు అని అందట.
వాడు సంతోషంగా ఆ డబ్బులు తీసుకుని లోపలికి వెళ్లి చూసి బయటకు వచ్చి ఆ అమ్మాయి పరిస్థితి ఇప్పుడు బాగానే ఉంది. చనిపోయిన శిశువుని ఆపరేషన్ చేసి తీసేసారు. ఇంకా కాసేపట్లో వార్డు కి తీసుకు వస్తామని చెప్పాడు.
మా సువర్చల బ్రతుకు జీవుడా అనుకోని తనని, తన చెల్లెలిని ఆపద నుండి బయట పడేసిన ఆ సాయినాధుడికి శతకోటి దండాలు పెట్టుకోవడం తప్ప ఇంకేం చేయగలము.
ఆ తర్వాత మా మరదలిని ఒక వారం రోజుల పాటు హాస్పిటల్ లో ఉంచి ఇంటికి తీసుకు వచ్చాము.
The above miracle has been typed by: Shiva Kumar Bandaru,
గోపాల కృష్ణ గారి అనుభవములు ఐదవ భాగం తరువాయి
Latest Miracles:
- భక్తురాలి ఆపరేషన్ జరుగుతున్నంత సేపు, భయం తెలియకుండా షిరిడి దర్శనం చేయించిన బాబా వారు
- బాబా నామస్మరణ , తప్పించిన ప్రసవ వేదన ……
- తలచిన వెంటనే స్వయం గా వచ్చి తన భక్తురాలి జ్వరాన్ని తొలగించిన బాబా గారు.
- తనను ఏంతో ఇష్టపడే అమ్మాయిని మృత్యువు నుండి తప్పించిన సాయినాథుడు.
- గ్యాస్ పేలుడు నుండి కాపాడిన బాబా వారు
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments