బాబా నామస్మరణ , తప్పించిన ప్రసవ వేదన ……



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


ఆంధ్ర మహిళా సభలో చూపించుకుంటున్నాను. కాన్పుకి కూడా అక్కడికే వెళ్దాం అనుకుని కొంచెం కొంచెం నొప్పులు వస్తుంటే హాస్పిటల్ కి తీసుకెళ్లారు,

కానీ ఆ రోజు మరి ఇంక నొప్పులు రాలేదు, శుభ్రంగా నిద్రపోయాను. మర్నాడు నొప్పులు వస్తుంటే నేను అమ్మా అబ్బా అనకుండా బాబా బాబా అని అంటున్నానట.

అక్కడ ఒక నర్సు ఉంది నాకు బాగా తెల్సున్నావిడ ”కాన్పు వచ్చేస్తుంది, తొందరగా అయిపోతుంది” అని చెప్పింది.

”ఒక్కసారి ఓర్చుకోమ్మా” అని నర్సు అంటే, సరేనని ”బాబా” ని తలచుకున్నాను. ప్రసవం అయిపోయింది.

ఆ మర్నాడు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేస్తామన్నారు, అన్ని ఏర్పాట్లు చేసారు.

ఆ రోజు కొంతమందికి చేసారు, నాకు ఇంజక్షన్ అంటేనే భయం, ఇంక ఆపరేషన్ అంటే చెప్పాలా, ఆపరేషన్ చేయించుకున్న వాళ్లంతా నెప్పులతో ఏడుస్తున్నారు.

నాకు భయం వేసి ఆపరేషన్ వద్దన్నాను కానీ తప్పదుగా, ఏం చేసేది లేదు కాబట్టి ఊరుకున్నాను.

నన్ను థియేటర్ లోకి తీసుకెళ్లారు, నాకు భయం రెట్టింపు అయింది, నేను ఆపరేషన్ థియేటర్ లో ఉన్నంత సేపూ బాబా బాబా అంటూనే ఉన్నానట.

ఆ నామం నాకు తెలియకుండానే నా నోటమ్మట వస్తోంది. కడుపు పట్టినట్టుంది కానీ నొప్పి లేదు.

బాబాని తలచుకున్నాను కాబట్టి ఏ నొప్పి, సలుపు లేకుండా ఆపరేషన్ అయిపోయింది.

మా మూడో అబ్బాయికి 2 సంవత్సరాల వయసున్నప్పుడు ఇంట్లో ఆడుకుంటున్నాడు. అది నెల మొదటి వారం కావటాన కిరాణా కొట్టు నుండి సామాన్లు తెచ్చి అవన్నీ డబ్బాల్లోకి సర్దుకుంటున్నాను.

ఆడుకుంటున్న పిల్లాడిని ఓ కంట చూస్తూనే ఉన్నాను. ఉన్నట్టుండి మా వాడి చెయ్యి, కాలు, నోరు మెలి తిరిగిపోయాయి.

చాలా ఖంగారుగా మా వారిని పిలిచాను, ఆయన అప్పుడే స్నానం చేద్దామని బాత్ రూమ్ లోకి వెళ్లారు, నా అరుపుకి ఒక్క ఉదుటున పరిగెత్తుకొచ్చారు.

నా అరుపులకి పక్క వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు ఫిట్స్ ఏమో అనుకుని చేతిలో తాళం చేతులు పెట్టారు. మా వారు ఊదీ డబ్బా తీసుకొచ్చి బాబాని తలచుకుని, కొంచెం ”ఊదీ” ని తీసి వాడి నోట్లో వేశారు.

అంతే పెద్ద వాంతి అయిపోయింది, చూద్దుము కదా వాంతి నిండా కర్పూరం బిళ్ళలున్నాయి.

అప్పుడే సామాన్లు తెచ్చారు కదూ నెలకి సరిపడా కర్పూరం కూడా ఒక డబ్బా తెప్పించాను, వాడు ఆడుకుంటూ ఆ కర్పూరం డబ్బా తీసుకుపోయినట్లు ఉన్నాడు, నేను అది గమనించలేదు, బాబా అలా వాడి ప్రాణాలు కాపాడారు.

ఆ తర్వాత హాస్పిటల్ కి తీసుకెళ్ళి పొట్ట శుభ్రం చేయించాము.

The above miracle has been typed by: Mrs. Raja Rajeswari Sainathuni

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

2 comments on “బాబా నామస్మరణ , తప్పించిన ప్రసవ వేదన ……

Sai Baba

>>>>>నేను అమ్మా అబ్బా అనకుండా బాబా బాబా అని అంటున్నానట.
బాబా వారి పలుకు:
నా నామాన్ని ఎప్పుడైతే మీరు మస్ఫూర్తిగా జపిస్తారో, సత్వరమే వారిని ఆపదనుండి రక్షింతును.

>>>> వాళ్ళు ఫిట్స్ ఏమో అనుకుని చేతిలో తాళం చేతులు పెట్టారు. మా వారు ఊదీ డబ్బా తీసుకొచ్చి బాబాని తలచుకుని, కొంచెం ”ఊదీ” ని తీసి వాడి నోట్లో వేశారు.

—–ఎప్పుడైతే మనము బాబా ని శరణాజొచ్చుతామో, అప్పుడు మనలని మాయ ఏమి చేయ చాలదు అనడానికి ఈ లీల నిదర్శనము.

Sai Baba

>>>>>> Called Baba….Baba …Baba instead of Amma … Amma, Even I am suffering from severe pains,
Baba quote:
Whenever chant my name whole heartedly then I will save them from danger.
>>>> >>may be attacked Epilepsy…they kept keys and all in his hands.
—-Through this wonderful experience, strongly we can believe the Baba assurance that
whenever we completely refugee to Sai, Maya never slash us.

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles