Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
మా పాపకి EAMCETలో మంచి రాంక్ వచ్చి దాని ఇష్టమైన బ్రాంచ్ లో సీట్ వచ్చింది, దాని స్నేహితులు చేరిన కాలేజీ లో చేరాలని దాని కోరిక.బాబా దయవల్ల అది కూడా నెరవేరింది.
మా అమ్మాయికి ‘బాబా’ అంటే చాలా ఇష్టం. మేము ఎప్పుడైనా షిరిడి వెళితే తనే తన చేత్తో స్వీట్ తయారుచేసి అక్కడ నైవేద్యం పెట్టించి అందరికి ఎంతో ఇష్టంగా ప్రేమతో పంచిపెడుతుంది.
ఆలా చేయడం దానికి చాలా చాలా ఇష్టం. కాలేజీ హాస్టల్ లో మా అమ్మాయిని చేర్పించాము.
చేర్పించిన రెండో రోజుకే మా అమ్మాయి స్నేహితురాలు దగ్గరనుండి ఫోన్ వచ్చింది.
‘ఆంటీ మీ రోజా కడుపు నొప్పితో బాధపడుతుంది, ఎం బాగోలేదు వెంటనే రండి అని చెప్పింది.
నేను వెంటనే బయలుదేరి మా స్నేహితురాలితో ఇంతకుముందు బాబా పూజకు ప్రేరేపించిన ఆవిడ (ఆ సమయం లో ఆవిడ అక్కడే ఉంది) ఆవిడ కూడా వస్తానంటే కలసి కాలేజీ కి వెళ్ళాము.
మా అమ్మాయి నొప్పి అని మెలికలు తిరుగుతోంది.
ఎప్పుడు మమ్మల్ని వదిలి ఉండలేదు కాబట్టి ఇంటికి వచ్చేయడం కోసమో మమ్మల్ని ఇంకో సారి చూడటం కోసమో ఇలా చేస్తోందని నాకు అనిపించింది.
నేను పెద్దగా పట్టించుకోకుండా ఏదో నాకు తెలిసిన చిట్కా వైద్యాలు చేశాను.
అయినా తగ్గలేదు. టాబ్లెట్స్ తెచ్చి వేసాము. అయినా తగ్గలేదు. అదే తగ్గుతుందని, రెస్ట్ తీసుకొమ్మని ఇంటికి పోదామని మా స్నేహితురాలితో అన్నాను.
అప్పుడు మా స్నేహితురాలు ఆవేశంగా పిల్లకి ఇలాగా ఉంటె వదిలి ఎలా వదిలి వెళ్ళిపోతావు, అని గట్టిగా తిట్టింది.
సరే అని అమ్మాయిని ఇంటికి తీసుకువచ్చి దగ్గర లో ఉన్న డాక్టర్ కి చూపించాము. మందులు రాసి ఇచ్చాడు, వాడాము, మర్నాడు సాయంత్రం అయినా ఏ ఫలితం లేదు .
అమ్మాయి నిలబడ లేక పోతుంది. కూర్చో లేక పోతుంది. తినలేక పోతుంది, త్రాగలేక పోతోంది. ఎం చేయాలో తోచని స్థితి.
బాబాయే పంపించినట్టుగా మా స్నేహితురాలు మళ్ళీ చూడటానికి వచ్చి ఇంకా తగ్గలేదని తెలుసుకొని ఇంకా ఆలస్యం చేస్తే ప్రమాదమని వేరే పెద్ద డాక్టర్ దగ్గరకి తీసుకెళ్దాం అని కంగారు పెట్టింది.
వెంటనే ఒక ఆటోని పిలిచి ఒక ప్రముఖ హాస్పిటల్ కి తీసుకెళ్ళాం. మంచి పేరున్న డాక్టర్ గారు చూసారు.
ఆయన రిపోర్ట్ చూసి గర్భసంచికి ఉండే వాల్వులో రక్తం గడ్డ కట్టిందని ఒక వొవరి కూడా ఇన్ఫెక్షన్ అయిందని వెంటనే అమ్మాయికి ఆపరేషన్ చేయాలని అన్నారు.
అది విన్నాక నేను నిలువునా కుప్ప కూలి పోయాను. నా పాదాల క్రింద భూమి కంపించి పోతుంది. నా తల తిరిగి పోతుంది.
ఇంత చిన్న వయసులో మా అమ్మాయికి ఏమిటీ శిక్ష. ఎలాగో ఇంటికి వచ్చి పడ్డాము.
మా కింద పోర్షన్ లో ఉండే మణి గారు వచ్చి పాపకి ఎలా ఉంది అని అడిగారు. నేను ఉన్మాదిగా మరి ఊగిపోతూ జరిగిందంతా చెప్పి తాళం అయినా తీయకుండా మా గుమ్మానికి ఉన్న ‘బాబా’ ఫోటో చింపి పడేసి ఈయనకి అనవసరంగా పూజలు చేశాను, నమ్మాను,
మా రోజా కూడా ఈయనకి బాగా పూజ చేస్తుంది, ఈయన అంటే ఇష్టం కూడా. కోవాలు పెడుతుంది. ఇన్ని చేస్తే దానికేం ఇచ్చాడు.
ఇంత బాధ పెడతాడా ఈయన అంటూ తల కొట్టుకుంటూ పిచ్చి దానిలా ఏడ్చాను.
కాసేపటికి నన్ను నేను తమాయించుకుని పిల్లను తీసుకుని నేను, మా వారు, మా అబ్బాయి, మణి గారు, నారాయణరావు గారు, మా స్నేహితురాలు అందరం కలిసి వెళ్లి మా అమ్మాయిని హాస్పిటల్ లో చేర్పించాము.
రాత్రి పన్నెండు గంటలకు మా రోజా ని ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకువెళ్ళారు.
రెండు గంటలు సమయం అయిపోతుంది. కానీ ఆపరేషన్ థియేటర్ నుండి ఎవరూ బయటకు రారు. ఎవరూ లోపలికి పోరు.
లోపల పిల్లని ఎం చేస్తున్నారో అన్న భయం. ఎన్నో చూస్తున్నాము, ఎన్నో వింటున్నాం, క్షణ క్షణానికి భయం బాధ పెరిగిపోతుంది.
తెల్లవారు ఝామున అయిదు గంటలు అవుతుండగా డాక్టర్స్ బయటకు వచ్చారు.
చాలా ప్రమాదం తప్పిందమ్మా! అమ్మాయికి వొవరీ తో పాటు గర్భసంచి కూడా ఇన్ఫెక్షన్ అయితే ప్రాణానికే చాలా సమస్య అయ్యేది.
మీరు చాలా అదృష్టవంతులు. సరి అయినా సమయంలో తీసుకు వచ్చారు. లేకపోతె మీ అమ్మాయి మీకు దక్కేది కాదు. అని అన్నారు.
‘బాబా’ దయవల్ల ఈ ప్రమాదం నుండి బయట పడ్డాము. సకాలంలో హాస్పిటల్ లో చేర్పించి మా అమ్మాయిని మృత్యువు నుండి తప్పించిన ‘సాయినాధుడికి’ శతకోటి వందనాలు అర్పించక తప్పదు.
తనని నమ్మిన వారి వెంటే ఉండి కంటికి రెప్పయినా ఇంకా ఆలస్యం చేస్తుందేమో కానీ ‘బాబా’ తన వాళ్ళని కాపాడటంలో ఏ మాత్రం కూడా ఆలస్యం చేయడు అని, బాబా మా యందు ఉన్నాడు అని నాకు బాగా అర్ధం అయింది.
సర్వం శ్రీ సాయినాధ చరణారవిందార్పణ మస్తు
శుభం భవతు
The above miracle has been typed by: Shiva Kumar Bandaru
Latest Miracles:
- భవిష్యత్తు ని చూపించి నన్ను చావు నుండి తప్పించిన బాబా వారు ……..!
- తన భక్తురాలి తోబుట్టువును ప్రాణాపాయం నుండి తప్పించిన బాబా వారు
- సాయినాథులవారు గజదొంగల నుండి మమ్మల్ని రక్షించారు,నా ఆరోగ్యం బాగు చేసారు మరియు ప్రాణం తీసే జబ్బు నుండి మా పాపను కాపాడారు.
- బాబా నామస్మరణ , తప్పించిన ప్రసవ వేదన ……
- బాబా రక్షక వలయం లో ఉండటం వలన మృత్యువు కోరల వరకూ వెళ్ళిపోయినా నేను బతికి బయటపడటం జరిగింది.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments