Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
హజ్రత్ క్వాజాబాకీబిల్లా దైవ భక్తి గల కుటుంబంలో పుట్టాడు. ఎనిమిదవ ఏటనే దివ్య ఖురాన్ కంఠస్తమైంది.
కుమారుని తీవ్రమైన ఆధ్యాత్మిక ఆవేదనను చూస్తున్న మాతృమూర్తి, తన కుమారుని ఆధ్యాత్మిక దప్పికను తీర్చమని ప్రార్ధించేది. తల్లి అంటే ఈమె.
ఒకనాడు అతనికి హజ్రత్ క్వాజాబహాఉద్దీన్ నక్సబంది దర్శనం అయింది. అతడు ఆనందంతో పులకరించిపోయాడు.
ఇండియాకు వెళ్లి ఆ సూఫీ శాఖను (నక్సబంద్) వ్యాప్తి చేయమని ఆయన ఆదేశించారు.
ఆయన జీవ కారుణ్యం సాటి లేనిది. ఒకనాడు ప్రార్థనలు చేసి, అలసిపోయి, ఇంటికి వచ్చాడు. పైగా చలిగాలి రివ్వున వీస్తోంది. ప్రక్కమీద పడుకుందామనుకున్నాడు.
తాను పరుండే ప్రక్క మీద ఒక పిల్లి ప్రశాంతంగా నిద్రిస్తోంది. అంతే! దానిని లేపి, వెళ్లగొట్టలేదు. నెల మీద కూర్చుండి, ఆ రాత్రంతా దైవ ప్రార్థనలో గడిపాడు, దయాసాగరుడు.
ఒకసారి ఒక వ్యక్తి ఆయనను “నేను మీలాగే ఉండేటట్లు తయారు చేయండి” అని వేడుకున్నాడు.
బిల్లా వద్దన్నాడు. కానీ ఆ వ్యక్తి మొండిపట్టు పట్టాడు. అప్పటికి బిల్లా నచ్చ చెప్ప చూచాడు. ఆ వ్యక్తి వినలేదు.
“సరే” అని ఆ వ్యక్తిని బిల్లా కౌగలించుకున్నాడు. వెంటనే అవతల వ్యక్తి రూపు రేఖలన్నీ బిల్లాలాగే తయారయ్యాయి. చూచే వారు ఆశ్చర్యపోయారు.
కొన్ని రోజుల అనంతరం ఆతడు ఆధ్యాత్మిక శక్తికి తట్టుకో లేకపోయాడు. సాయిబాబా జీవిత చరిత్రలో కూడా ఇటువంటి సంఘటన ఒకటి ఉంది.
ఒక శిష్యుడు ఆయనను “అశాశ్వతం, అశాశ్వతం అంటూ ఉంటారు. అర్ధం ఏమిటి?” అని అడిగాడు.
“నా అంతిమ సంస్కార సమయంలో ప్రార్థన చేసే వ్యక్తి చెబుతాడు” అన్నాడు బాకీ బిల్లా.
ఆయన దేహాన్ని వీడినది 29 – 11 -1603 గా భావిస్తారు. అంతిమ సంస్కారానికి ఏర్పాట్లు జరిగాయి.
ఇక ప్రార్థన ఎవరు చేయాలి? అనే ప్రశ్న వచ్చింది. గతంలో బాకీ బిల్లా ప్రతి దినం అయిదు నమాజులతో పాటు, అర్ధరాత్రి ప్రార్ధనను క్రమం తప్పక చేసినవాడే ప్రార్థన చేయాలి అనటం అందరకూ జ్ఞాపకం వచ్చింది. ఎవరూ ముందుకు రాలేదు.
“నేను చేస్తాను” అంటూ గుర్రంపై ముసుగు వేసుకున్న వ్యక్తి వచ్చి, అన్నీ చేశాడు.
అప్పుడే గతంలో బాకీ బిల్లాను ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం అని అడిగిన వ్యక్తి ఆ ముసుగు మనిషి దగ్గరకు వచ్చి అడిగాడు.
ఆ ముసుగు వేసుకున్న వ్యక్తి, బాకీ బిల్లా భౌతిక కాయాన్ని చూపిస్తూ “ఇది అశాశ్వతం” అన్నాడు.
వెంటనే ఆ ముసుగు వేసుకున్న వ్యక్తి. తన ముసుగు తొలగిస్తూ, తన ముఖాన్ని చూపాడు. అందరూ ఆశ్చర్యపోయారు.
ఆయనే బాకీ బిల్లా. వెంటనే ఆయన తన దేహాన్ని చూపిస్తూ “ఇది శాశ్వతం” అని చెప్పి అదృశ్యుడైనాడు!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Sreenivas Murthy
Latest Miracles:
- క్రియా యోగి…. మహనీయులు – 2020… నవంబర్ 30
- మరో బుద్ధుడు …. మహనీయులు – 2020… నవంబర్ 4
- పోగొట్టుకున్నది ఏది?…..సాయి@366 నవంబర్ 19….Audio
- గురువును మించిన శిష్యుడు …. మహనీయులు – 2020… నవంబర్ 1
- స్వర్ణ పత్రంలో స్వామి భోజనం…. మహనీయులు – 2020… నవంబర్ 16
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments