Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయిబాబా తన వద్దకు రాబోయే వ్యక్తులను గూర్చి ముందుగానే, తన వద్ద ఉన్న వారికి చెప్పేవాడు. గౌతమ బుద్ధుడు కూడా అంతే. అయన తన వద్దకు రాబోతున్న సారిపుత్ర, మగ్గల్లాను గూర్చి చెప్పారు.
ఆ ఇద్దరు బుద్ధుని ముఖ్య అనుచరులయ్యారు, సారిపుత్ర అతి త్వరలో శిష్యునిగాను, సంఘాధిపతి అయ్యాడు. సారిపుత్రుడు దీక్షను, శిక్షణను ఇచ్చేవాడు.
సారిపుత్రుడు మాలిన మనస్కులను నిర్మల మనస్కులుగా చేసేవాడు. కోపమంటే తెలియదు ఆయనకు.
కోపం తెప్పిద్దామని పధకం వేసుకొని కొందరు. ఆయనకు తెలియకుండా వెంట పోయి, దుడ్డు కర్రతో ఒకడు దెబ్బ వేశాడు.
“ఏమిటిది?” అని సారిపుత్రుడు అన్నాడే గాని, తనకు ఎవరు, ఎందుకు కొట్టారో కూడా తెలుసుకోలేదు, అంటే వెనకకు తిరగలేదు.
సారిపుత్రుడు ఒకనాటి రాత్రి ఇతరులకు బోధనలు చేసి, అయన నిద్రించటానికి చోటు లేకుండా చేశారు.
సారిపుత్రుడు నిద్రిస్తున్న వారిని లేపలేదు. ఎదురుగా ఉన్న చెట్టు క్రింద, చలిలో ఆ రాత్రి గడిపాడు. అది అయన ఓర్పు.
ఆ ఓర్పు, నేర్పు ఈనాడు నేర్చుకున్నది కాదు. గత జన్మల పరంపరలో, ఒక జన్మలో అయన జ్ఞానార్ది. సన్యాసి అయ్యాడు.
పరోపకారమే ఆయన ఊపిరిగా బ్రతికేవాడు. ఒకనాడు ఒక వ్యక్తి ఏడుస్తుంటే కారణం అడిగాడు.
ఆ వ్యక్తి తన తల్లికి కంటి జబ్బు వచ్చిందని, ఎన్ని ఔషదాలు వాడినా తగ్గలేదని, ఒక సన్యాసి కనుగ్రుడ్డుతో ఔషధం చేస్తే తగ్గుతుందని తెలిసి, కంటి గ్రుడ్డును ఎవరు దానం చేస్తారా అని అడుగుతూ, తిరుగుతున్నానని, ఎవ్వరూ ఇవ్వటం లేదని చెప్పాడు,
“నేను ఇస్తాను” అని సారిపుత్రుడు తన ఎడమ కంటి కనుగ్రుడ్డును పెరికి ఆ వ్యక్తి చేతిలో పెట్టాడు.
“నాకు కావలసింది ఎడమ కను గ్రుడ్డు కాదు, కుడి కను గ్రుడ్డు” అని ఆ వ్యక్తి ఆ ఎడమ గ్రుడ్డును నేలపై విసిరి కొట్టాడు.
“నేను ముందే ఏ కనుగ్రుడ్డు అని అడిగి ఇవ్వవలసింది. ఇప్పుడేం మించి పోలేదు” అంటు తన కుడి గ్రుడ్డు పెరికి అతని చేతిలో పెట్టాడు సారిపుత్రుడు.
“ఈ కంటి గ్రుడ్డు వాసన వేస్తోంది. కషాయానికి పనికిరాదు” అని దానిని కూడా నేలపై విసిరాడా ఆ వ్యక్తి.
“అయ్యో! నా వలన ఉపయోగం జరగలేదే?” అని విచారించాడు సారిపుత్రుడు.
అప్పుడు ఆ వ్యక్తి తాను దేవతనని సారిపుత్రుని పరీక్షించటానికి వచ్చానని, దృష్టిని ప్రసాదించి, దీవించి వెళ్లిపోయాడు.
బుద్ధుని కంటే ముందుగానే దేహాన్ని వదిలాడు సారిపుత్రుడు.
సారిపుత్రుడు దేహాన్ని తన గ్రామంలో వదిలేందుకు వెళ్లే సమయంలో గౌతమ బుద్ధుడు “పమప్రభ (Pama prabha) బుద్ధునిగా నీవు అవతరించి లోక కల్యాణానికి తోడ్పడతావు” అని సారిపుత్రుని దీవించాడు.
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Sreenivas Murthy
Latest Miracles:
- కలుషితం కాదు …. మహనీయులు – 2020… సెప్టెంబరు 23
- ఏది శాశ్వతం? …. మహనీయులు – 2020… నవంబర్ 29
- క్రియా యోగి…. మహనీయులు – 2020… నవంబర్ 30
- గురువును మించిన శిష్యుడు …. మహనీయులు – 2020… నవంబర్ 1
- స్వర్ణ పత్రంలో స్వామి భోజనం…. మహనీయులు – 2020… నవంబర్ 16
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments