Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice support by: Mrs. Jeevani
రూపభవాని కాశ్మీరీ యోగినులలో ఒకరు. ఆమెకు ఆమె తండ్రే గురువు. ఆమెకు వివాహం అయింది. అత్తవారింటికి వెళ్ళింది.
ఆమె అత్త, మామలు ఒక మహాయజ్ఞాన్ని నిర్వహించదలచారు. అందుకు గాను వారి కుల గురువును నిర్వాహకునిగా నియమించారు.
యజ్ఞం సమాప్తి కావస్తోంది. అక్కడకు చేరిన బ్రాహ్మణులు ఆ కుల గురువును పరి పరి విధాల న్యూనతపరుస్తున్నారు.
ఆ కుల గురువు ఈ అవమానాన్ని భరించలేకపోతున్నాడు. దీనినంతా రూపభవాని గమనిస్తోంది.
ఇక అందరూ భోజనాలు చేయాలి. ఆ సమయంలో కుల గురువు ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోదాము అనుకున్నాడు.
కుల గురువు నిరాహారిగా ఉండటం, ఇంకా నిరాహారిగా వెళ్ళిపోవటము విపత్కరమే. ఆ విషయాన్ని రూపభవాని గ్రహించింది.
ఆమె కుల గురువుతో ”అయ్యా! తమరు బాగా అలసి ఉన్నారు. నా మాట మన్నించి వితస్త నదిలో స్నానం చేసిరండి. అనంతరం భోజనం చేద్దురుగాని” అని విన్నవించుకుంది.
ఆ కుల గురువుకు రూపభవాని తెలుసు. చిన్నతనం నుండి ఆధ్యాత్మిక పథంలో ఉంది. ఆమె ఎందుకు అలా చెప్పిందో అని ఆలోచించకుండా వితస్త నదిలో స్నానం చేసి వచ్చాడు.
నూతన ఉత్తేజంతో తిరిగి వచ్చాడు. భోజనం చేశాడు. దుర్గాభవాని మీద ఆశువుగా కవిత్వం చెప్పనారంభించాడు. ఆయనను గేలి చేసిన వారి నోళ్ళు మూతపడ్డాయి.
ఇది రూపభవాని చూపిన మొదటి మహత్తు. అంతటి మహత్తుగల ఆమె అతిథి నిరాహారిగా పోకూడదన్నది.
ఇక సాయి విషయం.
ఆ రోజు దీపావళి.
ప్రతి దినం సాయికి బడేబాబా అతిథిగా ఉండేవాడు. ఆ నాడు అతను అలిగాడు. సాయి బాబా పిలిచాడు అతిథిని రమ్మని.
సాయి పిలుపుకు బడే బాబా స్పందించలేదు. సాయి అతడిని పోతేపొమ్మనలేదు. అతిథి తింటే గాని (వస్తే గాని) సాయి తినడని అందరూ గ్రహించారు.
చివరకు బ్రతిమాలగా బడేబాబా శాంతించి భోజనానికి వచ్చాడు. ఆనాడు దీపావళి కనుక అతిథితో సాయి దీపావళి వంటలు భుజించాడు.
అతిథి ఏ కారణాలవల్ల గాని భోజనం చేయకుంటే యజమాని లేదా గృహస్తుకు కీడు జరుగుతుంది. అతిథిని నిరాహారిగా ఉంచకూడదు.
”అన్నం పెట్టకుండా అతిథులను తిప్పి పంపిస్తే దుర్గతిని ఆహ్వానించు కున్నట్టే” అంటుంది సాయి సచ్చరిత.
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- సాయిబాబా ఈద్ ముబారక్…..సాయి@366 నవంబర్ 3…Audio
- మోక్ష గురువు …..సాయి@366 జూన్ 9…Audio
- సజీవ గురువు! …..సాయి@366 ఏప్రిల్ 13…Audio
- భగవంతుడే గొప్ప ! ….. సాయి@366 ఫిబ్రవరి 20….Audio
- మోక్షం ఎందుకు?…..సాయి@366 నవంబర్ 27….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments