Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
సాయిబాబా ఇతరులతో సంభాషిస్తూ ఫిబ్రవరి 20 (1912)న ”భగవంతుడే అందరి కంటే గొప్ప వాడు” అన్నారు పదే పదే.
సాయిబాబాయే మరొకసారి ”ఎవరైతే గురువు యొక్క మహిమను, గొప్పతనమును గ్రహించెదరో, ఎవరైతే గురువుని హరిహర బ్రహ్మల (త్రిమూర్తుల) అవతారమని గ్రహించెదరో వారే ధన్యులు” అంటారు.
గురువు ఎప్పుడూ తాను భగవంతుని కంటే అధికుడనని చెప్పడు.
సాయి అనేక దివ్య లీలలను ప్రదర్శించినా అవన్నీ తన గురు ప్రసాదమని, భగవంతుని కృపే అన్నారు గాని తన గొప్ప తనమని ఏనాడూ చెప్పలేదు.
అన్ని మతాలలోను అంతే; ఒక ఉదాహరణ:
ఫరీదుద్దీన్ గంజ్ శక్కర్ గురువు కుతుబుద్దీన్ భక్తియార్ కాకి.
గురూజీ ఒకసారి ఫరీద్ గృహానికి విచ్చేశాడు.
ఆ గురువుకి నిద్ర లేవగానే వేడి నీటితో కాలకృత్యాలు తీర్చుకోవటం అలవాటు. ఫరీద్ ఆ ఏర్పాట్లు చేసాడు.
ఆ రోజు రాత్రి వాన కురుస్తోంది. కటిక చీకటి కమ్మేసింది. ఎక్కడ దీపమే లేదు, ఫరీద్ గృహంలో నిప్పులేదు.
తెల్లవారగానే గురువుకి వేడి నీరు ఎలా సరఫరా చేసేది? వాన తగ్గగానే నిప్పు కోసం వేట మొదలెట్టాడు.
దూరంగా మిణుకు, మిణుకు మంటు ఒక దీపం కనిపించింది.
ఆ ఇంటికి వెళ్ళి తలుపు తట్టగానే ఒకామె తలుపు తీసి ”ఇది వేశ్యా గృహం. ఎందుకు వచ్చారు?” అన్నది.
అతడు కారణం చెప్పాడు. ”అయితే అందుకు ఖరీదు చెల్లించాలి” అంది ఆమె.
”నా దగ్గర డబ్బులు లేవు” అన్నాడు అతను. ”నీకు నిప్పు కావాలంటే నీ రెండు కళ్ళల్లోని ఒక కంటి గుడ్డు కావాలి” అంది.
అతను వెంటనే కత్తితో తన కంటి గుడ్డును తీసి ఇచ్చి ఆమె ఇచ్చిన నిప్పుతో ఇంటికి వెళ్ళాడు.
తెల్లవారుతోంది గురువు గారికి వేడి నీటిని సిద్ధం చేసాడు. ” కంటికి ఆ కట్టేమిటి?” అని ప్రశించాడు గురువు గారు.
”ఏదో మంటగా ఉండి, నీరు కారుతోంది. అందుకే కట్టు కట్టాను” అని సమాధానమిచ్చాడు శిష్యుడు.”అంతా బాగానే ఉన్నది. ఏది కట్టు విప్పు” అది గురువు ఆదేశం.
శిష్యుడు కట్టు విప్పాడు. పోయిన కన్ను స్థానంలో కన్ను వచ్చింది. ఆశ్చర్యపోయాడు శిష్యుడు. ఇది భక్తియార్ గురు లీల.
”ఇప్పుడు వచ్చిన కన్ను కొంచెం చిన్నగా ఉంటుంది. ఎందుకంటే దైవంతో సమానంగా అంత కన్ను ఇవ్వకూడదు గదా!” అన్నాడు.
అది దైవానికి గురువు ఇచ్చే గౌరవం.
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr:Sreenivas Murthy
Latest Miracles:
- గురు శిష్యులు వేరు కాదు! .. …. మహనీయులు – 2020… డిసెంబరు 6
- కఠిన సాధన…. మహనీయులు – 2020… మే 7
- ధిక్కారము సైతునా?…. మహనీయులు – 2020… మార్చి 16
- ఏక్ ఓంకార్ …. మహనీయులు – 2020… అక్టోబరు 20
- బాబా, వారి మనసులోని ఆలోచనను గ్రహించారు–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments