Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
అవతార్ మెహర్‌బాబాకు ఉన్న పంచ గురువులలో అద్వితీయుడు సాయిబాబా.
సాయిబాబాను ఈయన ఖుతుబ్-ఎ-ఇర్షాద్‌గా భావించేవారు.
తన పంచ గురువులలో ఆ సాయినాధునకు భావిలో ఏర్పడబోయే దివ్య మందిరానికి మెహర్ బాబా రావటం, ఆ సందర్భంలోని మేకలను తిలకించిన వేలాది భక్తులు ధన్యులు.
ఆ సుదినం ఫిబ్రవరి 21, 1954.
మెహర్ బాబా తన వారితో విజయవాడ నుండి గుంటూరు బయలు దేరి వచ్చారు.
గుంటూరులో మెహర్ బాబా తన భక్తుని గృహానికి వెళ్ళారు.
అనంతరం గుంటూరు అరండేల్ పేట 7వ లైనులోని సాయి సమాజ్‌కు వెళ్ళారు.
అక్కడ నేలమీదనే ఆసీనుడయ్యారు.
మెహర్ బాబాను స్వాగతించింది ఆహ్వాన మండలి. ”….. ఇక్కడ నిర్మించనున్న సాయి మందిరానికి తమ దివ్య దీవనలను ప్రసాదించ వలసినది” అని మెహర్‌బాబాను వేడుకున్నారు.
సాయి సమాజ్ భవనానికి పునాది వేయానికి ఒక రాయిని, అప్పుడు ప్రతిష్టించేందుకు సాయి బాబా చిత్రపటాన్ని మెహర్ బాబాకు అందించారు.
అక్కడ పందిట్లో సమావేశమైన ప్రజలకు దర్శన మిచ్చారు.
మెహర్ బాబా ”ఆ ముదుసలి (సాయిబాబా) ఒక ప్రత్యేకమైన మహనీయుడు నాటికి, నేటికి కూడా. ఏ కొద్ది మందో గ్రహించగలిగారు” అని పలికారు.
ఇంకా ”మన మందరం ఒక్కటే. ప్రతి ఒక్కరిలోపల అనంతుడైన దేవుడే ఉన్నాడు.
నేను మీ అందరిలో నొక్కడినని మీరు భావించాలని నేను ముందర నేలపై కూర్చున్నాను” అన్నారు మెహర్ బాబా.
మెహర్‌బాబా ఆ సాయి నాధునికి తగిన శిష్యుడే కదా! అందుకే అంతటి వినయంతో పలికారు, సర్వ సిద్ధులన్నీ తనలోనే ఉండగా.
ప్రసాదంగా మెహర్ బాబా అరటి పండ్లను పంచి పెట్టారు.
దాదాపు 5000 మంది ఆయన చేతుల మీదుగా ప్రసాదం తీసుకున్నారు.
మెహర్ బాబా అయనకు హారతులివ్వటం, సన్మాన పత్రాలు చదవటం అవసరం లేదన్నారు.
ఆ పుణ్య దినం 21 ఫిబ్రవరి ……గుంటూరు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖితమైన దినం.
ఈనాడు ఫిబ్రవరి 21. ఆ నాటి షిరిడీ సాయినాధుని మందిర నిర్మాణ కార్యక్రమారంభంలో మనం కూడ పాల్గొన్నామని, మెహర్ బాబాను దర్శించినామని భావిద్దాం. తరిద్దాం!
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr:Sreenivas Murthy
Latest Miracles:
- నిన్ను నిన్నుగా ప్రేమించుటకు ….. మహనీయులు – 2020…ఫిబ్రవరి 25
- పండగే పండగ ….. సాయి @366 ఫిబ్రవరి 8….Audio
- ఉపాసనీ మహారాజ్ విగ్రహం …..సాయి@366 జనవరి 13….Audio
- నాలుగు చేతులతో….సాయి@366 ఫిబ్రవరి 11…Audio
- కాకా పురాణిక్ ….. సాయి@366 ఫిబ్రవరి 26….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments