కాకా పురాణిక్ ….. సాయి@366 ఫిబ్రవరి 26….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice Support By: Mrs. Jeevani


సాయిబాబా షిరిడీ గ్రామాన్ని విడిచి (దగ్గరనున్న ఒకటి, రెండు గ్రామాలకుతప్ప) ఎక్కడకూ పోయినట్లు దాఖలాలులేవు.

కానీ, ఇతర ప్రదేశాలలో జరిగే సంగతులు ఆయనకు తెలుసును.

ఇతర సద్గురువులను గూర్చి కూడా తెలుసు. తెలియచేయటమే కాదు, భౌతిక రూపాలు మాత్రమే వేరు అని సాయి తెలియచేస్తారు.

ధోపేశ్వర్‌లో కాకా పురాణిక్‌ అనే మహనీయుడు ఉండేవాడు. డాక్టర్ పండిత్‌ ఆయన భక్తుడు.

పండిత్‌ ఒకసారి షిరిడీకి వచ్చి సాయిబాబాకు త్రిపుండ్ర రేఖలు దిద్ది, కంఠానికి చందనం పూసాడు. సాయికి అంతకు ముందు ఎవ్వరూ అలా చేయలేదు.

అలా చేయనివ్వటానికి కారణాన్ని దాదా కేల్కర్‌ అడగగా ”నేను (పండిత్‌) బ్రాహ్మణుడను, బాబా ముసల్మాన్‌ కదా ఎలా పూజించటం అని సంకోచించకుండా, తన గురువైన కాకా (పురాణిక్‌)గా భావించి పూజించాడు” అని సాయి చెప్పాడు.

హరి వినాయక్‌ సాఠే పూనాలో ఉన్నత ప్రభుత్వోద్యోగిగా ఉన్నాడు.

ఆ సమయంలో కాకా పురాణిక్‌ పూనాకు వచ్చి, దేవ్‌ అనే భక్తుని ఇంట్లో ఉన్నాడు.

సాఠే, కాకా పురాణిక్‌ను తన గృహానికి వేంచేయమని కోరాడు.

తీరుబడి లేనందువల్ల రాలేనని సున్నితంగా చెప్పారు కాకా పురాణిక్‌. సాఠే ఆఫీసుకు వెళ్ళాడు.

వెంటనే కబురు వచ్చింది కాకా పురాణిక్‌ నుండి సాఠేకు.

ఆ కబురు విన్న వెంటనే కాకా పురాణిక్‌ తన గృహానికి వచ్చేందుకు రవాణా సౌకర్యాన్ని కలుగచేశాడు.

సాఠే గృహానికి చేరాడు. కాకా పురాణిక్‌ కూడ వేంచేశారు.

సాఠే ముక్కుసూటి మనిషి. అందరితోను సూటిగా మాట్లాడతాడు. ”మహారాజ్‌, ఉదయం అడిగితే నేను రాలేనని చెప్పారు గదా! ఇంతలో మనసు మార్చుకుని వచ్చారు. కారణం ఏమిటి?” అని అడిగాడు సాఠే కాకా పురాణిక్‌ను.

సాఠే ఇంట్లో తగిలించి ఉన్న సాయిబాబా ఫోటోను చూపిస్తూ, కాకా పురాణిక్‌ ”నేను మీ ఇంటికి వచ్చి, నిన్ను చూసేదాక, వీరు (సాయిబాబా) నన్ను నిలువనీయలేదు” అన్నారు.

సాఠేకు ఉన్న భక్తి మనకు కూడా కలుగు గాక!

కాకా పురాణిక్‌ మాఘ శుద్ధ త్రయోదశినాడు (ఫిబ్రవరి చివరిలో) శరీరాన్ని విడిచారు.

నేడు (ఫిబ్రవరి 26) ఆ సద్గురువులను స్మరించి, తరించెదము గాక!

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్

Collected and Presented By: Mr:Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles