“నా మైనా” ……సాయి@366 ఫిబ్రవరి 4…..Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice Support By: Mrs. Jeevani


సాయిబాబా వద్దకు ఎందరో వచ్చేవారు. అందరూ సాయికి ఎరుకే.

అబ్దుల్‌ రాగానే సాయి బాబా ”నా కాకి వచ్చింది” అనేవారు.

మారు పేర్లతో తమను పిలవటం సాయి భక్తులకు ఎంతో సంతోషాన్ని కలిగించేది.

మారు పేర్లను మగవారికే కాదు మహిళలకు కూడ పెట్టేవారు. బాలికలు కూడ మారు పేర్లు పొందారు.

”ఈమె నా మైనా” అని చనువుగా పిలిచి తన వద్ద కూర్చుండ బెట్టుకున్నారు కాకా మహాజని కుమార్తె, సరోజని మూలే, మొదిసారిగా షిరిడీకి వచ్చినప్పుడు.

ఇక తరచుగా ఆ బాలిక షిరిడీకి వచ్చి సాయిని దర్శించుకునేది తండ్రితోపాటు.

సాయిబాబా షిరిడులోనే ఉన్నా, అప్పుడప్పుడు తన భక్తుల గృహాలకు వెళ్ళేవాడు కూడా.

నీ ఇంటికి వెళ్ళి వచ్చాను కదా అంటే నమ్మక పోవచ్చు భక్తులు.

అందుకు తగిన రుజువులు కూడ చెప్పేవారు.

ఒకసారి ‘మైనా’ తండ్రి అంటే కాకా మహాజని గృహానికి సాయి వెళ్ళాడు.

”నేను నీ ఇంటికి వెళ్ళాను. ఇంటికి తాళం వేసుంది” అన్నాడు సాయి కాకా మహాజనితో.

కాకా మహాజని ఇంటికి వెళ్ళి ”గృహానికి తాళం వేశారా?” అని ప్రశ్నించాడు.”రామ మందిరానికి వెళ్లేటప్పుడు తాళం వేశాను” అన్నది మైనా తల్లి (కాకా మహాజని భార్య).

మైనా పేరు సరోజిని. ఆ పిల్ల అదృష్టంవలన ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ సాయి భక్తులే.

ఇక ఆమె చిన్నతనంలోనే భక్తి మార్గంలో ప్రవేశించింది.

ఆ బాలిక హుర్‌పాంగా హైస్కూల్‌ పునాలో చదివింది.

సాంప్రదాయ సంగీతంపై అభిరుచి మెండు. హార్మోనియం వాయించేది.

ఆమెకు భాస్కర్‌ వినాయక్‌ మూలేతో వివాహమైంది.

ఆమె తన అనుభవాలను సాయి లీలా మేగజైన్‌వారు సాంవత్సరికంగా నిర్వహించే దినాలలో 3,4 ఫిబ్రవరి 1981లో సాయితో తనకు గల అనుభవాలను పెక్కింటిని తెల్పిన ధన్యురాలు.

శ్రీరామనవమి నాడు సాయి తమ ఇంటికి వచ్చేసిన ఉదంతాన్ని తెల్పినదీమె.

సాయిబాబా మన గృహాలకు కూడ వచ్చేసి, మన ఆతిధ్యాన్ని అందుకొని మనను ఆశీర్వదించాలని

ప్రార్ధిద్దాం.

Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్

Collected and Presented By: Mr:Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles