Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
సాయి సచ్చరిత్రలో సాయి బాబాను దర్శించిన అనేక మంది సన్యాసులను చూడవచ్చును.
వారు సన్యాసులగుటచే బాబాను ఏమి కోరలేదు.
ఆళంది నుండి “పద్మనాభేంద్ర స్వామి” అనే సన్యాసి షిరిడీకి వచ్చాడు.
అతను షిరిడీలో కొంతకాలం ఉన్న తరువాత జ్ఞానేశ్వర మహారాజ్ పుణ్య తిధికి ఆళంది వెళ్లారు.
అక్కడ నుండి తన చెవి బాధను నివారించు కోవటానికి బొంబాయి వెళ్ళి డాక్టర్లకు చూపించగా “శస్త్ర చికిత్స అవసరము” అని నిర్దారించారు.
ప్రారబ్ద కర్మను అనుభవించి క్షయం చేసుకోవాలి అనే దానిని నమ్మేవాడగుటచే తన బాధను సాయికి విన్నవించుకో లేదు.
కానీ ఆ బాధ తీవ్రమగుటచే మాధవరావ్ దేశ్ పాండేను తన బాధను బాబాకు విన్నవించ మని కోరారు.
మాధవరావ్ దేశ్ పాండే చెప్పగానే “అల్లా అచ్చా కరేగా” అన్నాడు సాయి.
ఆ ఒక్క మాట చాలును. అతను తిరిగి బొంబాయికి వెళ్ళి డాక్టర్లను సంప్రదించగా వారు పరీక్షించి “శస్త్ర చికిత్స అవసరం లేదు” అని తేల్చారు.
ఆ రోజు ఫిబ్రవరి 3. సాయి మాటే దివ్య ఔషధంగా పని చేసింది.కొన్ని రోజులలోనే చెవి యధాస్థితికి వచ్చింది.
ఈ సంఘటనతో పద్మనాభేOద్ర స్వామి సాయి మహారాజ్ వాక్కు ఫలితాన్ని స్వయంగా అనుభవించాడు.
ఒకసారి పద్మనాభేOద్ర స్వామిని సాయి దక్షిణ అడిగాడు.
అతను “బాబా, నేను సన్యాసిని. నా వద్ద డబ్బులు ఎక్కడ నుండి వస్తాయి?” అన్నాడు.
సాయికి ఆ తీపి మాటలు చాలు.
వెంటనే ప్రక్కనే ఉన్న మాధవరావ్ దేశ్ పాండేతో “తాను (పద్మనాభేOద్ర స్వామి) నాకు ఏమయినా ఇస్తాడా? అని చూచాను. కానీ అతను ఏమి ఇవ్వలేదు.
అతడు నా వద్దకు వచ్చాడు కాబట్టి నేనే అతనికి ఇవ్వాలి” అన్నారు.
“అల్లా అచ్చా కరేగా” అనే దీవెనను ఇచ్చారు సాయి. అది అతనికి చాలు.
మనం కూడా “నీ షిరిడీకి వచ్చాం. మాకేం ఇస్తావ్?” అని ప్రశ్నించ కుండా ఉందుము గాక.
ఇంకా “నీవు (సాయి) మా ఇంటికి వచ్చావ్. ఏమి తెచ్చావ్?” అని అడగకుందుము గాక!
“అల్లా అచ్చాకరేగా” అంటూ ఉండే సాయి మనకు చాలు!
Complied By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- ఓం కర్మ ధ్వంసినే నమః…..సాయి@366 సెప్టెంబర్ 3….Audio
- శీతల కిరణాలు…. మహనీయులు – 2020… నవంబర్ 3
- ద్వారకామాయి నుండి ఊదీ….. సాయి@366 ఫిబ్రవరి 19….Audio
- బాబా ఆశీర్వదించి దృష్టిని ప్రసాదించారు
- సాయి మహమ్మదీయుడా? ……సాయి @366 ఫిబ్రవరి 6….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments