పంచదశి మన ఖజానా…. సాయి @ 366 ఫిబ్రవరి 2…..Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice Support By: Mrs. Jeevani


సాయిబాబా తన భక్తులకు ఏది ఉపయుక్తమవుతుందో, ఆ గ్రంధాన్ని పఠించమని తెలిపే వారు.

అసలు సద్గురువు కంటే, ఈ గ్రంధమూ ఉపయోగకరము కాదు. సద్గురువే దగ్గర వుండి శిష్యుని ఆధ్యాత్మికోన్నతికి పాటు పడతాడు.

ఆ సద్గురువు మహాసమాధి చెందినప్పుడు, వారు పఠియింపుమని తెల్పిన గ్రంధాలు మార్గదర్శకాలవుతాయి.

ఆ విశ్వవ్యాపి అయిన గురువుతో పాటు, గణేష్ శ్రీ కృష్ణ కపర్డేకు ఆ గ్రంధం పై ఎంతో పట్టు ఉన్నది.

కపర్డే ఫిబ్రవరి 2, 1912న “అది (పంచదశి) చాలా గొప్ప గ్రంధం. ఏదీ దాన్ని అధిగమించలేదు” అని వ్రాశాడు.

ఆ గ్రంధాన్ని ఇతరులతో కలిసి షిరిడీలో పారాయణ చేసేవాడు.

ఆ వేదాంత పంచదశి రచించిన వారు తెలుగు వారవటం విశేషం.

ఆ గ్రంధాన్ని రచించినది “ఒక తపస్వి, ఒక మహా యోగి, ఒక మహా సామ్రాజ్య నిర్మాత, వైదిక ధర్మోద్ధారకుడు, వేద శాస్త్ర విఖ్యాత, వివిధ సాంప్రదాయ సామరస్య సంధాత, ప్రాచీన స్మృతులకు నవీన వ్యాఖ్యాత, రాజ తంత్ర మర్మజ్ఞడు.

సకల శాస్త్ర పారంగతుడు, సంగీత సాహిత్య శిల్ప కళా పోషకుడు” అయిన తెలుగు వెలుగు శ్రీ విద్యారణ్యులు.

అవిద్యారణ్య కాంతారే బ్రమతాం ప్రాణినాం సదా

 విద్యా మార్గోపదేష్టారం విద్యా రణ్య గురుం శ్రేయే”.

అంటుంది జగద్గురు పరంపరా స్తోత్రం.

అంటే అవిద్య అనే అడవి మార్గంలో సంచరిస్తున్న ప్రాణులకు విద్యా మార్గమునుపదేశించే ఆచార్య విద్యారణ్యులను నేను ఆశ్రయిస్తున్నానని అర్ధము.

అట్టి విద్యారణ్యులు రచించిన పంచదశి వాద ప్రతివాద యుద్ధరంగమున పాల్గొనబోవు యోధులకు మాత్రమే పరిమిత మైనదని లోగడ భావించేవారు.

సాయి వంటి సద్గురువులచే అది సాధారణ జనులకు అద్వైతానుభవమునకు మార్గదర్శిగా భావించబడి, ప్రోత్సహింప బడినది.

ఇది 15  అధ్యాయములు గల గ్రంథము. ఈ గ్రంథములోని మాటలకు, సాయి బోధలకు, చేష్టలకు తేడా లేకుండుట గమనించదగ్గ విషయం.

సాయి వంటి సద్గురువు  ఆచరణ, బోధలకు గ్రంథ రూపమే వేదాంత పంచదశి అనటం అసమంజసం కాదు.

సాయి “నా బిడ్డలయిన మీకు నాపై కోపించుటకు అధికారము కలదు” అంటారు.

విద్యారణ్యులు “శిశువులు తమ పట్ల అగౌరవం చూపించినను, కొట్టినను, వారి తండ్రి ఆ శిశువులను కించపరచడు” అని వ్రాశారు పంచదశిలో.


compiled By ముళ్ళపూడి పాండురంగ సాయినాధ్ & మున్నలూరి బోస్


Collected and Presented by: Mr. Sreenivas Murthy


Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles