Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
సాయిబాబా ఇచ్చే సలహాలకు సమయం అంటు ఉండదు.
భక్తులు పెడదారిన పడుతుంటే, సాయి చూస్తూ ఊరుకోడు.
గద్దించి మంచి మార్గంలో పెడతాడు.
దీనికి ఒక ఉదాహరణను హేమాడపంత్ ఇలా వ్రాసాడు.
“ఒక తాగుబోతుకు స్వప్నంలో కనిపించి, ఛాతిపైన కూర్చొని, దానిని నొక్కిపెట్టి, ఎన్నడూ తాగనని వాగ్దానము చేసిన పిమ్మట వదలెను”.
అయితే ఆ తాగుబోతు పేరు హేమాడ్ పంత్ తెలుపలేదు.
ఆ తాగుబోతు పేరు డి.వి. సంభారే, ఆ సంఘటన ఫిబ్రవరి 1, 1917న జరిగినదని సంభారే తెలిపాడు.
సంభారే సాయి భక్తుడు. అతడు బీడీలు కాల్చేవాడు. చిలుం తాగేవాడు కాదు.
ఒకసారి అతడు ద్వారకామాయిలో కూర్చొని ఉండగా చిలుం తాగుదామని కోరిక కలిగింది.
ఆ కోరికను ద్వారకామాయిలో వ్యక్తపరచటం బాగుండదని, నిశ్శబ్దంగా కూర్చున్నాడు.
సాయి అతని కోరికను గమనించాడు.
“అరే అబ్బాయి, ఎందుకంత దూరంగా కూర్చున్నావు”? దగ్గరకురా, వచ్చి చిలుం పీల్చు” అని చేతికి ఇచ్చారు సాయి.
అతడు సాయి సర్వజ్ఞత్వానికి ఆశ్చర్యపోయాడు.
సంభారేకు సాయి అనేక విషయాలలో సాయం చేయటం జరిగింది
అతడు తాగటం నేర్చుకున్నాడు.దుర్గుణాన్ని సాయి తీసి వేయదలచాడు.
ఎందుకంటే ఒక దుర్గుణం వేరొక దుర్గుణాన్ని సునాయాసంగా దగ్గరకు చేర్చుతుంది.
భక్తుని ఆధ్యాత్మికం నుండి పతనం చేస్తుంది.
చేడు అలవాట్ల నుండి సాయి తన భక్తులను సంరక్షిస్తారు. దానికి కాలము, ప్రదేశముఅనునటువంటివి ఉండవు.
సాయిబాబా లెండీ యాత్ర చేస్తూ, అశుద్ధాన్ని తింటున్న పందిని ఒక వ్యక్తికి చూపి నీ ప్రవర్తన ఇలాగే ఉన్నదని పలికారు.
ఇతరులను నిందించడం, పంది పెంటను తినటం వంటిదని ఆయన(సాయి) తెలిపారు.
ఇక ఆ వ్యక్తి సాయి బోధనను పాటించాలి. అతడు సజ్జనుడయ్యాడని తలుద్దాం!
ఫిబ్రవరి 1న సంభారేకు సాయి స్వప్నములో సాక్షాత్కరించి, అతని ఛాతి పై కూర్చొని తాగుడు మాని వేస్తానని మాట ఇస్తేగాని, సంభారే ఛాతి పై నుండి సాయి లేవలేదు.
ఇది సాయి తన భక్తునిపై చూపిన ఆదరణ.
చేడుదారిని పడితే, మొదటగా ధుఃఖించేది మాతృమూర్తి అయిన సాయి బాబాయే.
సాయి నయానా భయానా దుర్గుణాన్ని మాన్పిస్తారు.
సంభారే తాగుడు మానేశాడు. ఇదే సాయికి కావాల్సింది.
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- హనుమంతుని ముందరా?…..సాయి@366 సెప్టెంబర్ 26….Audio
- పాట పాడుమా! ….. సాయి@366 మార్చి 1…..Audio
- సాయి! కన్నులలో నీరెందులకు?…..సాయి@366 నవంబర్ 1….Audio
- నీ బట్టే, ఏదైనా…. సాయి@366 ఫిబ్రవరి 14….Audio
- తీరని కోర్కెలు ….. సాయి @366 ఫిబ్రవరి 9….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments