Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
సాయిబాబా అనేక గాథలు తెలిపాడు. ఆ గాథలలో మానవ ప్రవర్తన ప్రతిబింబిస్తూ ఉంటుంది.
ఫిబ్రవరి 14న ఒక ప్రయాణికుడు అడవిలో ప్రయాణిస్తూ ఒక పులిని చూచి ధైర్యాన్ని కోల్పోయి, ఒక గుహలో దాక్కొన్నాడు. తాను (సాయి బాబా) అదే మార్గంలో పోవటం తటస్థించింది.
ఆయన ఆ ప్రయాణికునిలో ధైర్యాన్ని నింపి, అతడిని బయటకు తెచ్చి ”దాన్ని నీవు బాధిస్తే తప్ప, ఆ పులి నిన్నేమీ చేయదు” అని చెప్పాడు.
ఇక్కడ మానవుని ప్రవర్తనను గూర్చి తెలిపారు.
క్రూరమైన జంతువులు కనబడగానే పారిపోవటం, అల్ప జీవులు తారసపగానే ఇష్టం వచ్చినట్లు చేయటం సామాన్యులు చేసే పని.
మానవుడు తనకంటే బలహీనమైన జంతువులు కనబడగానే జులుం చేస్తాడు.
కళ్యాణ్‌లో శ్రీ మాణిక్య ప్రభువు ఉండే రోజులు అవి.
ఒక అల్లరి పిల్లవాడు చూలుతో ఉన్న గేదె నడుముపై కూర్చొని స్వారీ చేయసాగాడు.
మాణిక్య ప్రభువు అనేకసార్లు ఆ పిల్లవాడిని మందలించారు.
అతడు లక్ష్యపెట్ట లేదు. ఒకనాడు ఆ పిల్లవాడు యధాప్రకారం గేదెపై చేతులు వేశాడు.
అంతే! చేతులు గేదెకు అతుక్కు పోయాయి.
గేదె భయపడి పరుగు తీసింది. పిల్లవాడిని లాక్కుపోతోంది.
పిల్లవాడు భయపడి చచ్చిపోతున్నానని కేకలు పెట్టసాగాడు.
మాణిక్య ప్రభువు అతడి దగ్గరకు వెళ్ళి, గేదెను క్షమాపణ వేడుకోమని చెప్పారు.
ఆ పిల్లవాడు అలా చేయగానే చేతులు విడిపడ్డాయి..
ఒకసారి వివేకానందుడు కాశీలో సంచరిస్తున్నాడు.
సంకట్ మోచన్ ప్రాంతంలో ఒక కోతుల దండు తనపైకి రావటానికి చేస్తున్న ప్రయత్నాన్ని గమనించాడు.
చూడటానికే భయంకరంగా ఉన్నాయి ఆ కోతులు, పరుగెత్త సాగాడు.
అవి కూడా అంతకంటే వేగంగా పరుగెత్త నారంభించాయి.
ఎవరో ”భయపడ వద్దు. ఎదిరించు” అన్నారు.
అది వినిన వెంటనే వివేకానందుడు ధైర్యం తెచ్చుకుని, కోపంగా వెనుకకు చూచాడు.
అంతే కోతులు భయపడి పారిపోయాయి.
అది జంతువు గాని, సమస్య గాని భయపడి పారిపోకూడదు. ప్రశాంతంగా ఉండి తగు చర్య తీసుకోవాలి.
ఒకసారి బాలాజీ పాటిల్ నేవాస్కర్ పశువుల కొట్టంలోకి పాము వస్తే భయపడకుండా ప్రశాంత చిత్తంతో ఆ పాముకు పాలు కూడా ఇచ్చాడు.
అల్ప జీవులను చెదరగొట్టవద్దు. క్రూర జీవులను చూచి భయప వద్దు. మనసులో భయాన్ని తొలగించు. ఇది సాయి తెల్పిన మాట.
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr:Sreenivas Murthy
Latest Miracles:
- జయ మాణిక్య…..సాయి@366 డిసెంబర్ 22….Audio
- మధ్యముడు.. …. మహనీయులు – 2020… డిసెంబరు 22
- సరిలేరు మీ కెవ్వరు…. …. మహనీయులు – 2020… ఆగస్టు 23
- రామా, నీ దయ రాదా? …. మహనీయులు – 2020… జూలై 9
- బాబా నామస్మరణతో ప్రాణాపాయ స్థితి నుండి బిడ్డ కోలుకున్నాడు
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments