Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
మహారాజు పీపా యొక్క ఆధ్యాత్మిక గురువు రామానందులు. ఒకసారి రామానందులు పీపాతో సంభాషిస్తున్నారు. అందరూ తీర్థయాత్ర చేయ సంకల్పించారు.
పీపా వలె ఆయన భార్య సీతా దేవి సద్గుణ సంపన్నురాలు. ఆమె అక్కడే ఉండుటవలన, తాను కూడా ఆ సద్గురువులతో తీర్థయాత్రకు వస్తానని పట్టుపట్టింది.
పీపా ఎంతగానో నచ్చచెప్పాడు. ఒకొక్కసారి నగ్నంగా కూడా ఉండాల్సిన పరిస్థితి కూడా కలుగుతుంది అన్నాడు సీతాదేవితో.
సీతాదేవి వేంటనే బట్టలను తీసివేసింది. పీపా ఆమె యొక్క దీక్షకు ఆనందించి వెంట తీసుకుపోయాడు.
వెంకమ్మ బాల్య వితంతువు. ఒకసారి ఆమెను జలగండం నుండి కాపాడినది మాణిక్యప్రభువని గుర్తించింది.
మొదటిసారి ఆమె ప్రభువు వద్దకు వచ్చినప్పుడు, నాలుగురితోపాటుగా, రెండు ఖర్జూరాలిచ్చి పంపివేశారు ప్రభువు. ఆమె మరల మరల ప్రభు దర్శనానికి రాసాగింది.
మాణిక్యప్రభువులు ఆమెను తమ వద్ద నుండి వెళ్లిపొమ్మన్నారు. నానక్ కూడా లెహనా అనే వ్యక్తిని తన వద్ద నుండి పొమ్మంటాడు. సాయిబాబా కూడా శ్యామాను మసీదు మెట్లు ఎక్కవద్దంటారు.
భక్తులు లేదా శిష్యులు గురువులకంటే మొండివారు.
“మీ చరణములను వదలి నేనెచటకు పోజాలను” అంది వెంకమ్మ ప్రభువుతో.
“నాతొ ఉండిన అనేక కష్టముల పాలగుదువు” అన్నారు ప్రభువు. అందుకు సిద్దపడింది.
“నీవు నా వెంట రాదలచినచో నీ ఒడలి మీద నగలుండరాదు” అన్నారు ప్రభువు. తక్షణమే ఆమె నగలన్నీ తీసి ప్రభు చరణాల వద్ద పెట్టి బీదలకు పంచిపెట్టమన్నది.
ఆమె ఉదార స్వభావానికి మెచ్చుకున్నారు ప్రభువు. ఆమెను తన తల్లి అయిన బయాదేవి వద్ద ఉండమన్నారు ప్రభువు.
ఒకనాడు ఆమె వివస్త్రయై స్నానం చేస్తున్నది. ప్రభువులామెను వెంటనే రమ్మని కబురుపెట్టారు.
వెంకమ్మ నగ్నంగా బయలుదేరింది. ఈ విషయం తెలిసిన బయాదేవి “స్త్రీలకు లజ్జయే భూషణం కదా! అది పోయిన తరువాత స్త్రీత్వమేది?” అని కుమారునితో పలికింది.
మాణిక్య ప్రభువులు వెంటనే తన శాలువాను తల్లికి అందించటం, తల్లి వెంకమ్మకు కప్పటం జరిగింది.
ప్రభువు శాలువ ఆమె మీద పడగానే, ఆమెకు విదేహావస్థ ప్రాప్తించింది. ఆత్మ సాక్షాత్కారం కలిగింది. ఆమెను సాక్షాత్తూ మాతా త్రిగుణాత్మికా చిత్కళా శ్యామలాంబగ ఆరాధిస్తారు.
ఆమె శ్రావణ బహుళ త్రయోదశి నాడు 23.08.1862న దేహాన్ని చాలించింది.
ఆమె అంతిమ యాత్ర అతి వైభవంగా సాగింది. మాణిక్య ప్రభువులే ఆమెను సమాధిలో కూర్చుండబెట్టి సమాధి మూసినారు.
సద్గురువులకు శిష్యురాండ్రు ఉండవచ్చును, కానీ మాణిక్య ప్రభువు చేత మధుమతీ శ్యామలాంబ బిరుదునొందిన దేవీ వెంకమ్మ గార్ల లాంటి వారు అరుదుగా ఉంటారు.
నేడు ఆగస్టు 23. దేవీ వెంకమ్మగారి మహాసమాధి దినం. ఆమెకున్నటువంటి వజ్ర సంకల్పం అందరకూ కల్గుగాక!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- మధ్యముడు.. …. మహనీయులు – 2020… డిసెంబరు 22
- రాధాస్వామి…. మహనీయులు – 2020… ఆగస్టు 25
- అన్నదాత్రీ సదా కృతార్థా …. మహనీయులు – 2020… ఆగస్టు 12
- కావవే మహానుభావ కరుణతో …. మహనీయులు – 2020… సెప్టెంబరు 13
- అలనాటి క్రీస్తు బాధ …. మహనీయులు – 2020… ఏప్రిల్ 8
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments