Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
నా పేరు చంద్రకళ. అందరూ నన్ను కళా అని పిలుస్తారు.
మాది మహబూబ్ నగర్, మా వారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో పని చేసి సర్వీసులో ఉండగానే పరమపదించారు.
మామగారు వాళ్ళు ఆరుగురు అన్నదమ్ములు. మా మామగారే పెద్ద.
మిగతా అన్నదమ్ములకి సంతానం లేరు, మా వారు ఒక్కరే వంశోద్ధారకుడు మావారు మంచి ఉద్యోగం చేసేవారు . మిగతా అందరూ అంతంత మాత్రం.
అందుకే ఎవరికి డబ్బులు కావాల్సి వచ్చినా, ఏ సాయం కావాల్సి వచ్చినా మా వారే చేసేవారు. అడిగిన వాళ్ళకి, అడగని వాళ్ళకి కూడా దానం చేయడమే పనిగా పెట్టుకున్నారు.
మా వారు ఎవరైనా పుస్తకాలు కావాలి అన్నా, బట్టలు కావాలి అన్నా చాలు, అన్నదే తడవుగా జేబులో చెయ్యి పెట్టి చేతికి ఎంతవస్తే అంత ఇచ్చేస్తుండేవారు.
దానగుణంలో మా వారి చేతికి ఎముకే లేదు అని పేరు తెచ్చుకున్నారు.
మా వారికి మొదట ఒకామెతో వివాహం జరిగింది. ఆమెతో 25 సంవత్సరాలు కాపురం చేసినా సంతానం లేక పోయేసరికి తన మేనమామ కూతుర్ని అయిన నన్ను ఇష్టపడి వివాహం చేసుకున్నారు.
నాకు నలుగురు సంతానం కలిగారు. ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరుఅబ్బాయిలు, పిల్లలు కలిగాక కూడా మా వారి ప్రవర్తన అదే దానాలు, మానలేదు.
పిల్లలు కోసం దాచుకోవాలి, భవిష్యత్తు కోసం చూడాలి, పెళ్లిళ్లు , చదువులకి డబ్బులు అవసరం అవుతాయి అనే ఆలోచన ఏనాడూ మా వారు చెయ్యలేదు.
మా వారు మొదట్లో కొన్ని రోజులు శ్రీ శైలంలో పనిచేసారు. తర్వాత హైదరాబాద్ వచ్చాము.
మా అత్తగారు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోనే శ్రీశైలంలోనే పనిచేసారు. మా వారి మరో భార్య మా అత్తగారితోనే ఉంటుంది.
నేను పెద్దగా చదువుకోలేదు. ఏడవ తరగతి చదువుకున్నాను. అప్పుడే మా వారు నన్ను పెళ్లిచేసుకున్నారు.
మా అత్తగారికి నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నాకు ఒక అమ్మాయి పుట్టాక నన్ను కోడలిగా అంగీకరించింది అప్పుడు మా ఇంటికి వచ్చింది.
మేము హైదరాబాద్ వనస్థలిపురం, ఎన్. జి. ఓ కాలనీలో ఉండేవాళ్ళం.
హైదరాబాద్ సిటీ అవటం వల్ల కొంచెం భయంగా ఉండేది. మా వారు ఉదయాన్నే ఆఫీస్ కి , పిల్లలు స్కూల్ కి వెళ్ళిపోగానే ఒక్కదాన్నే ఉండేదాన్ని.
మా ఇంటి దగ్గర్లో ఆంజనేయస్వామి గుడి ఉంది. ఆ గుడికి కొంచెం దూరంలో వేంకేటేశ్వరస్వామి గుడి ఉంది, ఆ గుడికి వెళ్లేదాన్ని.
ఇంకా ఎక్కడికీ వెళ్లేదాన్ని కాదు. నాకు ఎవరితోనూ పరిచయాలు లేవు. అలాంటిది ఒకరోజు మా ఇంటి దగ్గరే ఉంటారు లక్ష్మి గారు అని ఆవిడ మా ఇంటికి వచ్చారు.
”ఏమ్మా! మీ వారు పిల్లలు వెళ్ళిపోయాక ఒక్కదానివే ఇంట్లో ఏం చేస్తుంటావు” అని పలకరించింది. నేను ఏమి చేయను అని చెప్పాను.
అలా ఐతే ”బాబా” గుడికి వెళదాము వస్తావా అంది, ”నేను ‘ఆంజనేయస్వామి గుడికి’, ‘వేంకేటేశ్వరస్వామి’ గుడికి వెళతాను, ‘బాబా’ గుడి అంటే నేను అసలు రాను, నాకు అవసరంలేదని” చెప్పాను.
మళ్ళీ మళ్ళీ వచ్చి గుడికి రమ్మనమని బలవంతం చేసేది. చివరికి ఒకరోజు “సరే వస్తాను కానీ నేను బాబాకి దణ్ణం పెట్టను, ఊరికే వస్తాను” అన్నాను.
ఆ రోజు గురువారం, చాలా జనం ఉన్నారు, అలా నేను బాబా గుడిలోకి అడుగుపెట్టాను.
లోపలికి వెళ్ళగానే నాతో పాటు వచ్చిన ఆవిడ నన్ను గుమ్మం లోనే వదిలేసి ఆవిడ పనిలోకి ఆవిడ వెళ్లిపోయింది. ఎవరికీ తోచిన పనులు వాళ్ళు చేస్తున్నారు.
ఈ లోగా గంట మ్రోగింది, అందరూ బిలబిలమంటూ ఆ మూర్తి ముందు నిలుచున్నారు. యేవో కాగితాలు పట్టుకొని ఏదో భాషలో పాట పాడుతున్నారు.
ఎందుకు వీళ్ళిలా సమయాన్ని వృధా చేస్తున్నారు, హాయిగా ఆంజనేయస్వామి గుడిలోనో, వేంకేటేశ్వరస్వామి గుడిలోనో గడపక ఇలా వృధాగా కాలక్షేపం చేస్తున్నారు,
వీళ్ళు చేస్తున్నదే కాకుండా ఈ రోజు నన్ను కూడా అనవసరంగా తీసుకొచ్చింది ఈవిడ అని తెగ మదన పడిపోయాను.
ఈయన ముస్లిం దేవుడు ఏమిటో వీళ్లంతా ఇంత తన్మయత్వంలో పడి పోతున్నారు అనుకున్నాను.
ఆవిడ ప్రతి గురువారం మా ఇంటికి రావడం నన్ను బలవంతంగా ”బాబా” గుడికి తీసుకువెళ్లడం చేస్తుండేది. కానీ నేను బాబాకి ఏనాడూ నమస్కారం పెట్టలేదు.
”ఈయన ఏమైనా దేవుడా ఏమ్మన్నానా? లేదు” అని అనుకునేదాన్ని. ఇది 1996లో సంగతి.
1997లో ఒకసారి మావారు మనకొక సొంత ఇల్లు ఉండాలి అని ఆలోచన చేసారు.
నేను ఎంతో పొంగిపొయాను. ఇన్నాళ్ళకి ఒక మంచి ఆలోచన చేసినందుకు. మాకు తగ్గ ఇళ్ల కోసం వెతకటానికి వెళుతూ, వెళుతూ ”బాబా” గుడి ముందు నుంచి నడుస్తున్నాను,
అనుకోకుండా అప్రయత్నంగా ”బాబా మాకో ఇల్లు కావాలి. అది కూడా నేను రోజు గుడికి వెళ్ళేటట్టు, అక్కడ కార్యక్రమాలకి హాజరయ్యేటట్టుగా దగ్గరగా ఉండాలి” అని అనుకున్నాను.
చాలా చోట్ల ఇల్లు చూసాము, అనుకోకుండా బాబా గుడి పక్కనే ఉన్న ఇల్లు మాకు కొనుక్కోవడానికి కుదిరింది.
బ్యాంకు లోను పెట్టడం, అది రావడం, ఇల్లు కొనేయడం, గృహప్రవేశం అవడం, ఆ ఇంట్లోకి మారిపోవడం అన్ని ఒక దాని వెనుక ఒకటిగా అయిపోయాయి.
అంతే, నాకు అప్పుడు అర్ధం అయింది. అక్కడ ఆగుడిలో రాతిమీద కూర్చున్న వ్యక్తి మాములు వాడు కాదు మహానుభావుడని అర్థమైంది.
నేను గుడి దగ్గరగా ఉండాలి అంటే, నువ్వు నీ గుడికి దగ్గరగా నాకు ఇల్లు ఇప్పించావు అంటే నేను నీ సేవ చేసుకోవాలనే కదా!
అంతే , నేను ఇంక ఆలోచించలేదు. రోజూ ఉదయం గబగబా పనిచేసుకొని గుడికి పరిగెత్తుకుని వెళ్లేదాన్ని.
అక్కడ నాకు తోచిన సేవ నేను చేస్తుండేదాన్ని. క్రమంగా నేను హారతులు నేర్చుకున్నాను, మధ్యాహ్న హారతి, రాత్రి హారతికి తప్పనిసరిగా వెళుతుండేదాన్ని.
ఎంత వానైనా సరే హారతికి వెళ్లి తీరాల్సిందే. రోజు రోజుకి ఆయన మీద ప్రేమ పొంగి పోతూ ఉండేది.
The above miracle has been typed by: Mrs. Raja Rajeswari Sainathuni
Latest Miracles:
- కష్టాలలో ఉన్న భక్తుని ఆధ్యాత్మిక మార్గంలోనికి తీసుకొని వచ్చిన అవధూతల దర్శనం…Audio
- బాబాపై అచంచల విశ్వాసం – తొలగిన ఆటంకం
- భక్తురాలి బాధను విజమర సేవ ద్వారా తొలగించిన బాబా వారు
- అంకిత సేవకు, బాబా చూపిన అపార ప్రేమ ….!
- బాబా గారితో నా పరిచయం, నా జీవితం లో బాబా గారు చూపిన మొదటి అద్భుత లీల.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments