Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
భక్తురాలు: శిరీష
నివాసం: హైదరాబాద్
ఒకసారి నేను JPT లో ఉన్నప్పుడు, JPT అంటే జగ్గయ్య పేట. అది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు.
మా తాతయ్య గారు మంచి భక్తుడు. ఆయన జగ్గయ్య పేటలోని కామేశ్వర స్వామి గుడిలో పూజారిగా పనిచేస్తున్నారు. ఆ గుడికి సంబందించిన కార్యక్రమాలన్నీ ఆయనే చూసుకుంటారు.
ఆ మందిరంలో శివుడు చాలా పవర్ పుల్. ఒక రోజు మా తాత గారికి బాబా గారిని నిజ రూపంలో దర్శనం చేసుకునే భాగ్యం కలిగింది.
మా తాత గారికి రోజు కలలో సాయినాథుడు కనిపించేవారు.
నిజంగా దర్శనం కలిగించమని మాతాత గారు అనుకోగానే,
ఒక రోజు శివాలయంలో మా తాత గారు శివునికి పూజా చేస్తున్న సమయంలో ఆ వీధిలో ఒకతను తెల్లనిలాల్చీ, తెల్లని పంచ కట్టుకుని, నెత్తికి తెల్లటి గుడ్డ కట్టుకుని చేతిలో కర్ర, భుజానికి ఒక జోలె, అందులో ఒక అన్నపు పాత్ర, ఒక చెంబు ఉన్న జోలీని తగిలించుకుని ఆ వీధిలో కనిపించారట.
అందరు చూస్తుండగానే గుడి వైపు వెళ్తున్నారట. అప్పుడు జనాలు అతడిని చూసి భిక్షువు అనుకుని, అటు వైపు ఇల్లులేవు, అంటున్నా కోవెల అటువైపే ఉంది అని గుడి వరకు వెళ్లారట.
అప్పుడు అక్కడ శివునికి పూజ చేస్తున్న మా తాత గారు కిటికీలోంచి చూసి, నా దేవుడు వస్తున్నాడు అని అనుకుని, గుడి నుంచి బయటకు వెళ్లి, బాబా కాళ్ళ మీద పడ్డారట.
స్వామి రాత్రి నిజంగా కనిపించు అనుకోగానే నిజంగా దర్శనం ఇచ్చావా? అనుకున్నారట.
మా తాత గారికి కలలో కనిపించినప్పుడు ఆయన చిరాకుగా నిజదర్శనం చూపించు అన్నారట. నిజంగానే బాబాగారే స్వయంగా వచ్చారు.
ఎందుకు రాత్రి సీరియస్ గా ఉన్నావు అని బాబా అడిగారట.
ఏం చేయను స్వామి నాకు కలలోనే కనిపిస్తున్నావు, నిజ దర్శనం కావాలనే ఆలా అన్నాను అని అన్నారట.
నాకు ఏమి ఇస్తావు అంటే, ఏమి ఇవ్వగలను స్వామి నేను పేదవాడిని అంటే, ఆ కండువా కావాలని అడిగారట.
మా తాత గారి భుజం మీద ఎర్రటి కండువా చిన్నది ఉంటుంది. అది పూజాలోనే వాడుతారు. ఆ కండువా కావాలని అడిగారట.
నీకు ఎందుకు స్వామి ఆ కండువా నీకు సరిపోదు అంటే, ముందు ఇవ్వు అని తీసుకుని ఆయన కళ్ల ముందే ఆ కండువా తీసుకుని కట్టుకుని చూపించారట.
నువ్వు ఇక్కడ పూజా చేసేటప్పుడు ఎప్పుడు నేను నీ పక్కనే ఉంటాను అని చెప్పారట.
~~~~సర్వం సాయినాధార్పణమస్తు~~~~
*** సాయిసూక్తి:
“కర్మ ఫలాన్ని అనుభవించక తప్పదు”
Latest Miracles:
- మరచిపోయేది మానవ హృదయం…..సాయి@366 జూలై 9….Audio
- అయిష్టంగా మొదలై అంచలంచలుగా పెరిగిన బాబాపై ప్రేమ ….!
- స్మరణమాత్ర ప్రసన్నాయ…..సాయి@366 జూలై 1…..Audio
- అడుగడుగనా ఆటంకం – ఆదుకున్న బాబా
- గూడు చేరిన బీవీఎన్…..సాయి@366 ఆగస్టు 29….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments