అడుగడుగనా ఆటంకం – ఆదుకున్న బాబా



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


భక్తుడు: నంద కిశోర్

నివాసం: హైదరాబాద్.

అనంత తులాతే కసేరే స్తవావే  –  అనంత తులాతే కసేరే నమావే 

 అనంత ముఖాంచా శిణే శేషగాతా  – నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాధా!

భావము:- ఓ అనంతా, మిమ్ము నేనెలా స్తుతించగలను? ఎలా నమస్కరించగలను? అనంతుడే అన్ని ముఖాలతో మిమ్ము గురించి గానం చేసి అలసిపోయాడు. శ్రీ సాయినాథా! మీకు సాష్టాంగ నమస్కారము.

సాయి బంధువులందరికి సాయిరామ్, నా పేరు నంద కిశోర్. చివరి వరకు నన్ను టెన్షన్ పెడుతూ లాస్ట్ కి నా ప్రాబ్లెమ్ ను ఎలా సాల్వ్ చేసారో ఈ మిరకిల్ ద్వారా మీకు చెప్పాలనుకుంటున్నాను.

2011 లో బి.ఏడ్ పరీక్షకు అప్లయ్ చేశా. ఎగ్జామ్ డేట్ రాగానే చెప్పండి అని మా సార్ కు చెప్పాను.

అప్పుడు ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాక చెప్తాను, నన్ను విసిగించకు అని మా సార్ అన్నారు.

సరేలే అని బాబా మీద భారం వేసా. ఎగ్జామ్ టైంకి తాను చెప్తాను అన్నారు కదా! సో ఎక్కువగా టెన్షన్ పడొద్దు అనుకున్నాను.

కానీ, ఎగ్జామ్స్  స్టార్ట్ అయిపోయాయి. నేను ఫెయిల్ ఐన 3 సబ్జక్ట్స్ రాయవలసి ఉంది. మా ఫ్రెండ్ ఒకరు కాల్ చేసి,

నీకు ఎగ్జామ్ ఉంది, మీ సార్ కాల్ చేశాడా అని అడిగాడు. లేదు ఎగ్జామ్ స్టార్ట్ అయితే సార్ చెప్తా అన్నాడు అని చెప్పా.

అరేయ్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి నీకు తెలియదా! ఇంకా కావాలంటే మీ సార్ కి కాల్ చేసి కనుక్కో అనగా

నేను మా సార్ కి కాల్ చేస్తే, నీకు కాల్ చేస్తే కాల్ కలవడం లేదని చెప్పారు.

సరేలే ఏమైంది ఇప్పటికైనా, నీ ఎగ్జామ్ రేపు ఉంది. సో వచ్చి రాయి అన్నారు.

వరంగల్లో ఎగ్జామ్ మద్యాహ్నం 2 గంటలకు ఉన్నది. హాల్ టికెట్ మహాబుబాబాద్ లో ఉంది. అయితే  నా ఎక్సమును రాయడానికి నేను ఒక రైటరుని మాట్లాడను. తాను రాస్తా అన్నాడు.

నేను ఎగ్జామ్ రోజు మార్నింగ్ 5 గంటలకి  ట్రైన్ ఎక్కి హాల్ టికెట్ కోసం మహాబుబాబాద్ వెళ్తున్నాను.

అప్పుడు బాబాను ప్రార్థిస్తూ ఏంటి  బాబా ఇలా చేసావు. నా ఎక్సమును రాయనిస్తావో లేదో నా లైఫ్ స్పొయిల్  అవుతుందా! ఏంటి బాబా అంటూ వెళుతున్నాను. అక్కడికి వెళ్లేసరికి పది అయింది.

హాల్ టికెట్ తీసుకుని బస్సుస్టాపుకి వచ్చేసరికి 10:30 అయింది. ఒక గంట వెయిట్ చేశాను. టైం పన్నెండు అవుతుంది. అప్పుడు బస్సు ఎక్కాను.

ఎగ్జామ్ రెండు గంటలకి, నేను ఎగ్జామ్ హాల్ కి వెళ్ళడానికి రెండు గంటలు పడుతుంది.

బస్సు డ్రైవర్ ఒంటి గంటకి ఇది లంచ్ టైం, సో నేను లంచ్ చేయాలి. లంచ్ చేసిన తరువాతనే వస్తాను. ఉంటే ఉండు లేదంటే వేరే బస్సు ఎక్కివెళ్ళిపో అన్నాడు.

అబ్బా బాబా అనుకుని వేరే బస్సు చూసుకొని వెళ్లేసరికి రెండున్నర అయింది. ఎగ్జామ్ స్టార్ట్ అయింది. రైటర్ కి కాల్ చేస్తే, నాకు పని ఉంది రావట్లేదు అని చెప్పారు.

బాబా “నమ్మిన వాళ్ళను నటెట్లో ముంచుతావా” అని బాబాతో మొరపెట్టుకున్నాను. కరెక్ట్ గా మూడు గంటల పదిహేను నిమషాలు అయింది. కేవలం నలభై అయిదు నిమిషాలే ఉంది.

ఎగ్జామ్ హాల్  లోకి వెళ్లి కూర్చున్నాను. ప్రిన్సిపాల్ ఏమిటి ప్రాబ్లెమ్ అని వచ్చి అడిగారు.

నాకు రైటర్ రాలేదని చెపితే, నేను రాసే  ఎగ్జామ్ సబ్జెక్టు సంబంధించిన లెక్చరర్ రాజ్యలక్ష్మి గారిని పిలిచి, ఆ అబ్బాయిని ఏమి అడగకుండా, తను జవాబులు చెబుతుంటే , ఆన్సర్స్ మీరే స్పీడ్ గా రాయండి. టైం కూడా చాలా తక్కువగా ఉంది అని చెప్పారు.

బాబా గారు చివరి వరకు నన్ను నా ఓపికను పరీక్షిస్తూనే ఉన్నారు. చివర  45 నిముషాలు పరీక్ష రాసిన నాకు అరవై మార్కులు వచ్చాయి.

అసలు ఎగ్జామ్ రాయలేను అనుకున్న నేను, అడుగడుగునా ఆటంకాలు ఎదురైనా గాని చివరకు బాబా దయవల్ల ఎగ్జామ్ రాసి పాస్ అవడమే కాదు, అరవై మార్కులు తెచ్చుకున్నాను. ఇదంతా బాబా లీలనే.

    ~~~~సర్వం సాయినాధార్పణమస్తు~~~~

*** సాయి సూక్తి: 

చేస్తున్న పని పట్ల అలక్ష్యం పనికి రాదు

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles