అడిగినంతనే ఆదుకున్న బాబా–AudioSai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice support by : Mrs Lakshmi Prasanna


   


శ్రీమతి మంగళగిరి భారతీదేవి గుంటూరులో బీ.ఎస్.యన్.యల్ లో సీనియర్ సూపర్ వైజరుగా పనిచేస్తున్నారు.

ఆ ఆఫీసులో విభాగపు అధికారిగా ఒక ఆమె పనిచేస్తున్నది. ఆ సెక్షన్ ఆఫీసరు భారతీదేవి  గారిని చీటికీ మాటికీ వేధిస్తున్నది. భారతీదేవిగారు ఇలా చెప్పారు.

” అకారణంగా బాధపెడుతుండేది, నా తప్పు ఏమి లేకపోయినా కస్టమర్స్ వచ్చినప్పుడు నన్ను పిలచి వారి ముందు అనవసరంగా చీవాట్లు పెట్టినట్లు మాట్లాడేది.

ఆఫీసుకు వెళ్లాలంటేనే భయంగా ఉండేది. 2002 మార్చి నెలలో సెలవు పెట్టి షిరిడీ వెళ్ళాను.

బాబాను దర్శించినప్పుడు అనుకోకుండానే బాబా! నా ఆఫీసు సెక్షన్ ఆఫీసరు వలన చాలా బాధపడుతున్నాను.

ఆ అధికారి నుండి విముక్తి కలిగించు బాబా” అని ప్రార్ధించాను. బాధ భరించలేక అడిగానే కానీ బాబా చేయగలరని గానీ, అలా పని అవుతుందనిగాని నేను అనుకోలేదు.
షిరిడీ నుండి తిరిగి వచ్చాము. సెలవు అయిపోగానే ఆఫీసుకు వెళ్ళాను.

నన్ను చూడగానే మా అధికారి నాకు బదిలీ అయినట్లు, అదే రోజు వెళ్లి జాయిన్ కమ్మని రిలీవింగ్ ఆర్ధరు చేతిలో పెట్టారు. నేను బదిలీకి దరఖాస్తు చేసుకోలేదు.

ఎవరినీ బదిలీ చేయమని అడిగియుండనూ లేదు. బదలీ అర్దరు నేను ఏ రోజైతే బాబాను కోరుకున్నానో అదే తేదీ ఆ ఆర్ధరు పై యున్నది. ఎంత ఆశ్చర్యము.

వేరే సెక్షన్ అధికారి తన సెక్షనులో పని ఎక్కువగా యున్నదని నన్ను ఆ సెక్షనుకు ట్రాన్స్ ఫర్ చేయమని కోరినాడట.

అలా బాబా ఆ సెక్షను ఆఫీసరులో ప్రవేశించి నేను ఆఫీసుకు వచ్చేటప్పటికి లోగడ సెక్షను నుండి తప్పించారు బాబా. బదిలీ ఆర్ధరు చూచి నా అనూభూతి ఏమని చెప్పను అని చెప్పారు.

భారతిగారు చెప్పి చెప్పగానే ఇలా ఆదుకునే దేవుడెవరండి? బాబాయే.

ప్రసుత్తము శ్రీమతి భారతిగారు ఇంకా బాబాను విశ్వసించి పారాయణలు చేయడము, సత్సంగములలో పాల్గొనడము చేయుచు భర్తతో విశ్రాంతి జీవితము గడుపుతున్నారు.

శ్రీ ఆలూరు గోపాలరావు గారి విరచిత శ్రీ సాయి బాబా సత్ చరితము

సంపాదకీయం: సద్గురులీల ( అక్టోబర్- 2016)

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు

మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles