Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు ఈ రోజు బాబా చేసిన అద్భుతమైన సహాయం ఎటువంటిదో తెలుసుకొందాము.
ఇది 1940 సంవత్సరం ప్రాంతంలో జరిగినది. ఇది సాయిలీల మాసపత్రిక 1940వ. సంవత్సరంలో ప్రచురింపబడింది..సాయిలీలాస్.ఆర్గ్ నుండి సంగ్రహింపబడింది.
యధాతధంగా ప్రచురిస్తున్నాను.బాబా తన భక్తుని వెంట అనుక్షణం వెన్నంటి ఉండి ఎలా కాపాడుతారో స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది.
కొన్ని కొన్ని సందర్భాలలో అటువంటి భక్తుల జీవితంలో జరిగిన సంఘటల గురించి తప్పనిసరిగా రాసి తీరాలి.
అటువంటిదే యిప్పుడు వివరింపబోయే బాబా లీల. దురదృష్టవశాత్తు ఈలీల పంపించిన వ్యక్తి తన ఊరు పేరు రాయలేదు.బాబా చేసిన ఈ లీల గురించి వివరించిన వ్యక్తి పూనాలో ఉద్యోగ నిమిత్తం ఉంటున్నాడు.
ఒకరోజున అతను నడచి వెడుతుండగా ఒక షాపులో ఉన్న బాబా చిత్రపటం అతనిని ఆకర్షించింది. షాపతనిని ఆఫొటోలో ఉన్నది ఎవరని అడిగాడు.
అది సాయిబాబాదని చెప్పి ఆయన మహిమ గురించి వివరించి చెప్పాడు. షాపతను బాబా ఫొటోని ఒకటి అతనికి బహూకరించి తామంతా క్రమంతప్పకుండా సాయి సత్సంగాలను నిర్వహిస్తూ ఉంటామని చెప్పి, అతనిని కూడా తమ సభ్యులలో ఒకనిగా చేర్చుకున్నాడు.
ఆసమయంలో అతని భార్య మొదటిసారిగా గర్భం దాల్చి వుంది. నెలలు నిండటంతో పురిటికి ఆమెను పుట్టింటికి పపింద్దామనుకుంటున్న సమయం.
ఆమెను స్టేషన్ కు తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా రైలు ఎక్కించాడు. ఆమె రైలు ఎక్కగానే ఆమె వెనకే తెల్లని కఫనీ ధరించిన ఒక మహాపురుషుడు నిలబడిఉన్నట్లు కనపడింది. అతను ఆ ఫకీరెవరో గుర్తించలేదు.
అతను ఆమె వెనక అలాగే నిలబడి ఉన్నాడు. రైలు స్టేషన్ దాటి వెడుతున్నా కూడా అతను ఆమె వెనకాలే ఉన్నాడు.
ఏదయినా జరగరానిది జరుగుతుందేమోననే భయం అతని మనసులో కలిగింది. నాలుగు రోజుల తరువాత అతని మామగారు కోపంగా అతనికి ఉత్తరం వ్రాశారు.
అందులో యిలా ఉంది–“నీ భార్య ఎప్పుడు ప్రసవిస్తుందో సరైన తేదీ కూడా తెలుసుకోకుండానే పుట్టింటికి ఎలా పంపించావు? రైలులోనే ఆమెకు ఆ రోజు మధ్యాహ్న్నమే పురుడు వచ్చింది”.నమ్మశక్యం గాని విషయమేమంటే ఆ కంపార్ట్ మెంట్ అంతా ఆరోజు ఖాళీగా ఉంది.
ఆమెకు సహాయం చేయడానికి కూడా ఎవ్వరూ లేరు. ఇదే ఆమెకు మొదటి కానుపు.
మరి ఆమెకు ప్రసవ సమయంలో సహాయం చేసినవారెవరు? కొత్తగా జన్మించిన బిడ్డకు సహాయం చేసినవారెవరు? ప్రసవ సమయంలో తన భార్యకు ఎటువంటి కష్టం కలుగలేదు.
ఏమి జరిగిందో కూడా ఆమెకు గుర్తు లేదు. దానికి కారణం బాబా. ఆయన ఆమె వెనకాలే నిలబడి ఆమెను, ఆమె బిడ్డని కాపాడారు.
మామగారి ఉత్తరం చదివాక బాబా చూపిన ప్రేమ, రక్షించిన విధానం అర్ధమయి కళ్ళంబట ఆనంద భాష్పాలు కారాయి. బాబా పటం ముందు చేతులెత్తి వెక్కి వెక్కి ఏడిచాడు.
ఆరోజు రాత్రి బాబా అతని కలలో కనపడి “అరే! నీలాంటివారి కోసం నేను జన్మ జన్మల నుండి ఋణపడి ఉన్నాను.
అందు చేతనే నేను వారిద్దరి సం రక్షణ బాధ్యత వహించాను”.తరువాత అతను చెప్పిన విషయం “అప్పుడు రైలులో ఖాళీగా ఉన్న కంపార్టుమెంట్ లో ఏమి జరిగిందన్నది పాఠకుల ఊహకే వదలి వేస్తున్నాను”ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.సర్వం సాయినాథర్పాణమస్తుప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరుమా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- ప్రసవ సమయంలో బాబా వారు చేసిన ఊదీ లీల
- శాంత మరియు ఒక బాలుడిని బాబా కాపాడారు–Audio
- బాబా నామస్మరణ , తప్పించిన ప్రసవ వేదన ……
- పారాయణ సమయంలో మా ఇంటికి వచ్చి నా పెళ్లి జరుగుతుందని ఆశీర్వదించిన బాబా వారు …..!
- అడిగినంతనే ఆదుకున్న బాబా–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
2 comments on “ప్రసవ సమయంలో ఆదుకున్న బాబా–Audio”
kishore Babu
September 21, 2016 at 12:18 pmThank you Sai…Sai Baba varu meeku manchi avakasam echharu..Have a nice Time
srinivasa murthy
February 25, 2019 at 7:30 pm🙏🙏🙏Sai Baba…Sai Baba…Sai Baba…Sai Baba🙏🙏🙏