ప్రసవ సమయంలో బాబా వారు చేసిన ఊదీ లీల



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


నా పేరు గోపాలకృష్ణ, మేము హైదరాబాద్ భాగ్ లింగంపల్లి లో ఉంటాము.

నేను ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. నా శ్రీమతి పేరు సువర్చల పేరుకు తగ్గట్లే బాబా కి సు-వత్స.

ఆమె ప్రస్తుతం ఒక స్కూల్ లో టీచర్ గా పని చేస్తుంది. మాకు 1990 వరకూ బాబా ఎవరో మాకెవరికీ తెలియదు. నేనేదో మామూలుగా పూజలు చేస్తుండేవాడిని.

మా సువర్చలకి మాత్రం దైవ భక్తి కాస్త మెండనే చెప్పాలి. ఎందుకంటే, మా పెళ్లి కాకముందు, మా అత్తగారు మా సువర్చల బాగా చదువుతుందని, దత్త చరిత్ర, విష్ణు సహస్ర నామం, గురు చరిత్ర చదివించుకుంటూ ఉండేది.

మా ఆవిడకి ఆ గ్రంధాల పైన శ్రద్ధంటూ ఏం లేకుండా, ఏదో అమ్మ చదవమంది, చదివాము, అని ఉండేది.

మా పెళ్లి అయ్యేనాటికి నేనేదో చిన్న కంపెనీలో పని చేస్తుండేవాడిని. నా జీతం సరిపోకుండా ఉండేది.

ఆ సమయంలో సువర్చలని మా అత్తగారు వాళ్ళ ఊరు నుంచి ఆడ పిల్లని ఎన్నాళ్ళు పుట్టింట్లో ఉంచుకుంటాం, అనుకుని హైదరాబాద్ పంపించేసారు.

తాను వచ్చేది నాకు తెలియదు. నాకు ఉత్తరం రాసే సమయం లేదు. టెలిగ్రాం ఇచ్చేటంత ద్రవ్యమూ లేదు.

నా జీతం సరిపోనందున, మా ఆవిడ కూడా, వేడినీళ్ళకు చన్నీళ్ళు అంటారుగా అలా తాను కూడా ట్యూషన్లు చెప్పి నాలుగు రూపాయలు సంపాదించటంతో ప్రారంభం అయింది మా సంసార జీవితం.

అటువంటి పరిస్థితుల్లో మా ఆవిడకి రాజమండ్రిలో B .Ed  లో సీట్ వచ్చింది. మా పిన్నత్త గారే తనని చదివించింది.

సువర్చల అక్కడికి వెళ్లి B. Ed పూర్తి చేసుకొని వచ్చింది. ఆ B. Ed పూర్తి చేసుకు వస్తే, ఇంక తనకి మంచి ఉద్యోగం కాస్తా వచ్చేస్తే మన కష్టాలన్నీ గట్టెక్కుతాయి, అని అవకాశం కోసం ఎదురు చూస్తున్నాము.

అటువంటి సమయంలో చుట్టలామె (లక్ష్మి గారు) మా ఇంటికి వచ్చి, ఆ మాట ఈ మాట మాట్లాడుతూ (ఆమె సాయి బాబా భక్తురాలు) “నేను కొద్ది రోజులలో శిరిడి కి వెడుతున్నాను.” మీరు వస్తారా”? అంది.

అప్పటిదాకా శిరిడి ఏమిటో మాకు తెలియదు. అక్కడ ఎవరుంటారో కూడా మేము ఎరుగము. మేము ఆవిడని అదే అడిగాము. శిరిడిలో ఎవరున్నారు? అని

సాయిబాబా అనే మహానుభావుడున్నారు, ఆయనని మనం ఏ కోరిక కోరుకున్నా కూడా మన కోరికలన్నీ తప్పకుండ తీరుస్తాడు.

వెళ్లి దర్శనం చేసుకు వస్తే మీ కష్టాలన్నీ తీరిపోతాయి వస్తారా? అని అడిగింది.

మాకు వెళ్ళాలని ఉన్నా గానీ, మా దగ్గర డబ్బులేవి ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తుంటే మళ్ళీ ఆవిడే “మీరు ఖర్చుల గురించి అస్సలు ఆలోచించవద్దు,

అదంతా నేను చూసుకుంటాను, బయలు దేరండి నేనే టికెట్స్ తీసేసుకుంటాను అంది.

మేము సంతోషంగా సరే అన్నాము. అందరం శిరిడి వెళ్ళాము, ఆ సాయినాథుడిని చూడంగానే, నా మనసంతా ప్రశాంతం అయిపోయింది. ఎంతో తేలికయిపోయింది.

మన ఇంటి పెద్దనో, ఒక తాతనో కలిసినట్టు అనిపించింది. దండం పెట్టుకుని తిరుగు ప్రయాణం అయ్యాము.

ఆ తర్వాత మా సువర్చల నెల తప్పింది. మనిషి చాలా బలహీనంగా ఉంది. డాక్టర్ నువ్వు ప్రతి నెలా వచ్చి గర్భం నిలవడానికి ఇంజక్షన్ తీసుకోవాలని చెప్పింది.

మాకు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు అయ్యింది. ఆ ఇంజక్షన్ చాలా ఖరీదు అయినవి . అయినా చేసేదేమి లేక కాలం గడుపుతున్నాము.

హైదరాబాద్ లో ప్రతి సంవత్సరం జనవరి నెలలో ఒకటోతారీఖు industrial exhibition మొదలవుతుంది. ఆ ఎగ్జిబిషన్ కి మేము భార్యాభర్తలము ఇద్దరమూ వెళ్ళాము.

ఆ ఎగ్జిబిషన్ లో ఒక స్టాల్ లో శిరిడి సాయిబాబాని పెట్టారు. మేము అంతకు ముందు, కొద్ది రోజుల క్రితమే శిరిడికి వెళ్లి ఉన్నాము కాబట్టి వెళ్లి దండం పెట్టుకుని బయటకి వచ్చేస్తుంటే,

ఒకతను మా వెనకాల, “మీరు 11 రూపాయలు ఇప్పుడిక్కడ కడితే, ప్రతి నెల శిరిడి నుంచి ప్రసాదం, బాబా ఊది మీకు పంపబడుతుంది.

మీరు 11 రూపాయలు కడతారా? అని అడిగారు, దానికి మేము సరే అని పోనిలే 11 రూపాయలే కదా కడితే బాబా ప్రసాదం ప్రతి నెలా మనకి వస్తుంది కదా! అని అలోచించి 11 రూపాయలు అక్కడ కట్టాము.

తరువాత ఆ విషయం గూర్చి మర్చిపోయాము. నెమ్మదిగా నా భార్యకి నెలలు నిండుతున్నాయి. నెలలు నిండే కొద్ది మాకు భయం పెరుగుతుంది.

ఎందుకంటే మాకేదైనా అవసరానికి పలికేవాళ్ళంటూ ఎవరూ లేరు. ఆపరేషన్ అవసరం అవచ్చు అని, దానికి మీరు సిద్ధంగా ఉండమని డాక్టర్ చెపుతూనే ఉంది.

సువర్చల ఇంట్లో భారంగా తిరుగుతుంది. తన పనులు కూడా తను చేసుకోలేక పోతుంది. ఎం జరుగుతోందని మేము విపరీతమైన ఆదుర్దా పడిపోతున్నాము.

అటువంటి సమయంలో ఒక ఆదివారము (05 -06 – 1994 ) ఆ రోజు నుంచి సువర్చల కొంచెం నలత గానే ఉంది పాపం, భోజనం కూడా సరిగా చేయకుండా పడుకుని ఉంది.

మిట్టమధాహ్నం రెండు గంటల సమయంలో వీధి తలుపు చప్పుడు అయింది, ఈ సమయం లో ఎవరు వచ్చారా అని అనుకుంటూ వెళ్లి వీధి తలుపు తీశాను.

ఒక బాబు 12 సంవత్సరాలు ఉంటాయి ఆ బాబు కి, మా ఇంటి గుమ్మం లో నిలబడి ఉన్నాడు. ఎవరుబాబు? ఎం కావలి అని అడిగాను. దానికి అతను ఇది శిరిడి సాయిబాబా ప్రసాదం మీ కోసం ఇది మీకు ఇచ్చి వెడదాం అని వచ్చాను అంటూ రెండు పాకెట్స్ నా చేతిలో పెట్టి వెళ్లి పోయాడు.

ఇదేమిటిది ఎవరీ అబ్బాయి ఎక్కడ నుండి వచ్చాడు, ఎవరు పంపించారు అని అనుకుంటూ ఉండగానే, ఎక్సిబిషన్ లో మేము 11 రూపాయలు కట్టి 6 నెలలు అయింది.

పైగా ఆ రోజు ఆదివారం. ఇది ఎలా సాధ్యం అని నేను ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాను. గత ఆరు నెలలలో ఎవరు వచ్చి మాకు ప్రసాదం కానీ ఊది కానీ ఇవ్వలేదు. పైగా ఆ రోజు ఆదివారం పోస్టుమాన్ కూడా రాడు.

కానీ విచిత్రం గా ఆ రోజే మాకు బాబా ప్రసాదం ఎలా వచ్చిందో ఎవరు తెచ్చారో తెలియదు.

మా ఆవిడ అప్పటికే బావుండలేదు కదా, ఏమనుకుందో మరి బాబా ఆవిధంగా ప్రేరణ ఇచ్చాడులా ఉంది. గ్లాసుడు నీళ్లు తీసుకువచ్చి,

అలాగే పడుతూ లేస్తూనే ఆ ఊదీని తీసుకుని నీళ్లలో వేసుకుని “మాకు నువ్వే దిక్కు నువ్వు తప్ప మాకీ ప్రపంచంలో ఇంకెవ్వరు లేరు, నన్ను ఎం చేస్తావో నీ ఇష్టం,” అని అనుకుంటూ ఆ ఊది నీళ్లు తాగింది.

అంతే అయిదు పది నిమిషాల్లో నొప్పులు రావడం మొదలు అయ్యాయి. సాయంత్రం నాలుగు గంటలకి హాస్పిటల్ కి తీసుకెళ్లి జాయిన్ చేసాము. డాక్టర్ సువర్చలని చూసి టెస్ట్ చేసి ఆపరేషన్ చేయాలని చెప్పి ఏర్పాట్లకు వెళ్లిపోయింది.

నాకేం చెయ్యాలో అర్ధం కావటం లేదు. డాక్టర్స్ వచ్చి ఏవో ఇంజక్షన్స్ చేస్తున్నారు, వెళ్లిపోతున్నారు. సమయం గడుస్తోంది.

సాయంత్రం నుండి రాత్రికి మారింది. ఇంక సువర్చలని ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకు వెళ్ళబోతున్నారు, ఉన్నట్టుండి పెద్ద నొప్పులు మొదలయ్యాయి.

వెంటనే థియేటర్ లోకి తీసుకెళ్లారు. 8 గంటలకి పెద్ద నొప్పులు వచ్చి రాత్రి 8:40 నిమిషాలకి నార్మల్ డెలివరీ అయింది. పండంటి పాప పుట్టింది.

ఆ రకంగా మా ఇంటికి లక్ష్మి వచ్చింది. నా ఆనందానికి అవధులు లేవు. ఎందుకంటే ఆపరేషన్ ఆవరసం లేకుండా కానుపు కావటం ఒకటయితే, మా ఇంట మహాలక్ష్మి పుట్టింది.

ఇది రెండవ విషయం. “డాక్టర్ ఎట్టి పరిస్థితిలో నీకు నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం లేదు. కానీ ఏదో మిరాకిల్ జరిగి నీకు పాప పుట్టింది అని చెప్పింది”.

మా ఆవిడకి అప్పుడు అర్ధం అయింది, మాకు బాబా సమయానికి ఊది పంపించి మరీ మమ్మల్ని ఏ విధం గా ఆశీర్వదించారో అని. ఇది బాబా లీల కాదా?.

The above miracle has been typed by: Shiva Kumar Bandaru,

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles