ఇంటర్వ్యూ లేకుండానే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా అపాయింట్ మెంట్ ఇప్పించిన బాబా గారి లీల…Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


This audio has been prepared by Mrs Lakshmi Prasanna

  1. Mir-4-Job By Lakshmi Prasanna 3:04

అందరకీ సాయి రామ్.

నా పేరు రేణుక. మేము ఉద్యోగరీత్యా భువనేశ్వర్ లో ఉంటున్నాము.
నాకు ఒక కూతురు, ఒక కొడుకు.
మేము భువనేశ్వర్ రావడానికి ఒక విచిత్రమైన అనుభూతి కారణము:

మా వారు ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లో మేనేజర్ అకౌంటెంట్ గ పని చేసేవారు.

హైదరాబాద్ లో అయన అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్ట్ కి ప్రమోషన్ అయ్యి రిటైర్ అయితే బాగుంటుంది.

ఒక మంచి పొజిషన్ లో రిటైర్ అవ్వాలని అభిలాషగా ఉండేది.

దానికి మాకు బాబా గారు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించారు.

అది ఏవిధముగా అంటే 2013 నాటి అనుభవము.

మాకు ఒక వ్యక్తి బాబా పంపినట్లుగా పరిచయము అయినారు.

ఆయనను అడిగాను ప్రమోషన్ గురించి.

అప్పుడు అయన తప్పకుండ వస్తుందని, నీవ్వు బాబా అష్టోత్తరము ప్రతి గురువారం తప్పకుండ చేసుకోమని చెప్పినారు.

నేను ఆలా చేస్తుండగా మావారి ప్రమోషన్ నిమిత్తము ఆఫీస్ వారు ఇంటర్వ్యూ కొరకు పూణే పిలిపించారు.

అయన అక్కడకి వెళ్లి రెండు, మూడు రోజులు ఉన్నారు.

అక్కడ చైర్ పర్సన్ బిజీ గా ఉండడం వాళ్ళ ఇంటర్వ్యూ చేయకపోతే తిరిగివచ్చేసారు.

మావారు ప్రమోషన్ రాదు ఇంటర్వ్యూ జరగలేదు అని చెప్పినారు.

కానీ నాకు బాబా విశ్వాసము ఉన్నది తప్పకుండ వస్తుంది అన్నాను.

ఒక గురువారం రోజు మావారికి మా వారికీ ఆఫీస్ లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా అపాయింట్మెంట్ అయినట్లు పూణే నుంచి లెటర్ వచ్చింది.

నాకు ఫోన్ చేసి చెప్పారు, ఇంత వరకు పెద్ద పోస్టులకు ఇంటర్వ్యూ లేకుండా అపాయింట్ మెంట్ రావడము మా వారిదే మొదటిది .

ఆ విధముగా బాబా మావైపు ఉండి మాకు అండగా ఉన్నారు.

అప్పుడు మమ్మల్ని భువనేశ్వర్ లో వేశారు.

ఈ విధముగా మేము భువనేశ్వర్ లో ఉంటున్నాము.

మాధవిగారి పరిచయము వలన ఈ బాబా గారి లీలను మీ ముందు ఉంచాను.

అనుకోకుండా వ్యక్తి రావడము, అష్టత్తోరా పూజ చేయమనడం అంత ఆ సాయి నాథుని కృప నే.

సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా

ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో  వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.

మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

 

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles