భక్తురాలి ఆర్తిని  అర్ధం చేసుకొని ఎండవేడిని వర్షం రూపంలో తగ్గించుట



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయి బాబా     …            సాయి బాబా          …            సాయి బాబా          …            సాయి బాబా.
పంచభూతాలు బాబా ఆధీనంలో ఉండేవని సాయి చరిత్రలో చదువుతాం. దానికి సంబంధించినదే ఈ సాయి లీల. నేను మాధవి, భువనేశ్వర్ నుంచి రాస్తున్నాను. జూన్ 1st  2017 జరిగింది.

షిర్డీ లో బాబా వున్నపుడే  కాదు, ఇప్పుడు కూడా సకల చరాచర సృష్టి అయన ఆధీనంలోనే వుంది, అనే దానికి నిదర్శనం ఈ లీల.

ఆ రోజు గురువారం మండిపోయేంత ఎండలు, ఇక్కడ వాన చుక్క లేదు. గాలి స్తంభించి పోయింది. నేను బాబా నవ గురువార వ్రతం చేస్తూ, అభిషేకాలు పూర్తిచేశాను. శుద్దోదక స్నానం చేయించాను.

బాబాకు వస్త్రం సమర్పయామి అని చమీకీలతో  నిండిపోయి చూడముచ్చటగా వున్నా వస్త్రం బాబాకు ధరింప చేయాలనీ అనుకుంటున్నాను, ఇంతలో నా మనసులో ఒక ఆలోచన తళుక్కుమంది.
“ఏంటి, ఈ వస్త్రాలు బాబాకు ఎండ, వేడి, ఉడుకు అవుతుందో, మనం ఐతే cotton బట్టలు వేసుకోవాలని కొత్తవి కొనుక్కుంటాము. ఎండాకాలం పాపం బాబాకు మాత్రం ఇలాంటివి వేస్తాం. ఆయనకు వేడి అవ్వదా! అనుకున్నాను.
ఏమి చెయ్యాలి అనుకుంటూ గంధం చెక్కతో చాల గంధం తీశాను. ముద్దగా చేసి బాబా శరీరం మొత్తం(ముఖం తప్ప ) పూసేసాను. చల్లగా వుండేదానికి.
 అంతే, ఆయన మనసులో ఏమనిపించిందో కృప వర్షం నామీదే కాదు మొత్తం, గజపతి నగర్, భువనేశ్వర్ మీద కురిపించారు.
ప్రచండమైన వర్షం, నేను గంధం తాపడం వేసి పీఠంలో కుర్చోపెట్టాను , భువనేశ్వర్ లో ప్రచండమైన గాలి,వాన… ౩౦ నిమిషాలు వదలలేదు. అంతే బాబా చల్లపడ్డారు.
మా భువనేశ్వర్ ను వానతో నింపేశారు.. పంచ భూతాలు ఆయన ఆధీనంలో వున్నాయి.
ఇంతకూ నేను చెప్పేదేమంటే, ఆయనకు ఏమి కావాలి, మనం ఏమి ఇస్తున్నాం. మనం ప్రేమతో ఆయనను నింపితే, ఆయన కృపతో మనల్ని కాదు మొత్తం ప్రపంచాన్ని నింపేస్తారు. మీరు ఆలోచించండి, నేను చెప్పింది అవునా ! కాదా!
 ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
సాయి బాబా     …            సాయి బాబా          …            సాయి బాబా          …            సాయి బాబా.

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles