ఆ డాక్టర్ ఆశ్చర్యముగా రెండు రోజుల్లోనే కూర్చోవడము, అటు ఇటు చూడడము చేయకలిగింది.—Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


This audio has been prepared by Mrs Lakshmi Prasanna.

  1. Mir-3-Doctor-By Laksmi Prasanna 4:22

నేను చిన్న పని మీద 8 – 04 -1996 వ తేదీన కోలకతా వెళ్ళాను.

నా స్నేహితుడు టెలిఫోన్ డిపార్ట్మెంట్  లో పని చేసే అతని బావమరిదిని పరిచయం చేసాడు.

అప్పుడు అతనకి సాయి బాబా వారి ఫోటో మరియు ఊదీని ప్రసాదించాను. నేను ఇచ్చిన వాటిని అతను బ్యాగ్ లో పెట్టుకున్నాడు.

ఆఫీస్ కి త్వరగా వెళ్లే ప్రయత్నమూ లో అతని బ్యాగ్ ని అతను ప్రయాణించిన కార్ లో నే మరిచిపోయాడు.

ఆ బ్యాగ్ లో 15 000 రూపాయిలు మరియు విలువైన పత్రాలు ఉన్నాయి. అతను తాను బ్యాగ్ మరిచిపోయినందుకు చాల భాధ పడ్డాడు.

అప్పుడు కనీసము డాకుమెంట్స్ అయినా దొరకాలి అని బాబా వారికి మనస్ఫూర్తిగా విన్నవించుకున్నాడు.

కొద్దీ సమయములోనే  కార్ డ్రైవర్ ఆఫీసర్ కి ఫోన్ చేసి తనవద్ద బ్యాగ్ సురక్షితిముగా  ఉందని, వచ్చి తీసుకోమని చెప్పినాడు.

ఆఫీసర్ త్వరగా కార్ డ్రైవర్ వద్దకు చేరుకొని ఆ బ్యాగ్ ని కలెక్ట్  చేసుకొని తెరిచి చూడగా డాకుమెంట్స్ మరియు డబ్బులు యధావిధిగా ఉన్నాయి.

ఆ సమయములో కార్ డ్రైవర్ బ్యాగ్ లో ఉన్న బాబా వారి ఫోటో ని చూసి, ఈ మహాత్ముడు ఫోటో చుసిన తర్వాత డబ్బులు ముట్టవద్దు అని, నా మనుసును ఎవరో వారిస్తున్నట్లు అనిపించింది అని చెప్పినాడు.

అందుకనే మీకు నేను ఈ బ్యాగ్ ను త్వరగా ఇచ్చివేయాలి అని తలిచి ఫోన్ చేశాను అని చెప్పినాడు.

బ్యాగ్ తిరిగి ఇచ్చినందుకు 1000 రూ|| లు బహుమానంగా కార్ డ్రైవర్ కి ఇవ్వబోగా, అప్పుడు ఆ కార్ డ్రైవర్ నాకు వద్దు అని చెప్పి, నా యెక్క స్థితిగతులను బాబా వారు మంచిగా చూసుకోమని, నా తరుపున ప్రార్ధించమని ఆఫీసర్ కి చెప్పినాడు.

అదే రోజు నా స్నేహితుడి కుమార్తె తన స్నేహితురాలు Dr . గీత రామ ఐర్ కి జరిగిన సంఘటన గురించి చెప్పింది.

ఆ లేడీ డాక్టర్ ఒక రోజున తాను బైక్ డ్రైవ్ చేసుకొని వెళుతుండగా accident జరిగి బ్యాక్ బోన్  బాగా గాయాపడింది.

ఆమెకు నైపుణ్యంగల డాక్టర్స్ చికిత్సను ఎన్ని రకాలుగా అందించిన నడుమ నొప్పినుంచి ఉపశమనము పొందలేక పోయింది.

అప్పుడు నేను బాబా వారికీ మనస్ఫూర్తిగా తాను భాధ గురించి చెప్పుకోమని సలహా ఇచ్చాను.

అప్పుడు నేను తనకి బాబా వారి ఉది రాసి, ఈ డాక్టర్ కి కొత్త లైఫ్ ఇవ్వమని బాబా ని ప్రార్ధించాను.

నాకు రెండురోజులు తర్వాత, ఆ డాక్టర్ ఫోన్ద చేసి నెమ్మదిగా కోలుకుంటున్నట్లు గా చెప్పినారు.

ఆ డాక్టర్ ఆశ్చర్యముగా రెండు రోజుల్లోనే కూర్చోవడము, అటు ఇటు చూడడము చేయకలిగింది.

ఆమెకి కనీసము నెల రోజులు సమయము పడుతుంది అనుకున్నవారు అందరూ, రెండు రోజులోనే కోలుకోవడము ద్వారా అందరికి ఆశ్చర్యము అనిపించింది.

తరువాత 10 రోజులలోనే నడవడము, నెల రోజులలోనే పూర్తిగా గా కోలుకుంది.

ఇప్పుడికి వారు బాబా వారి లీల ద్వారానే తాను మామూలమనిషిని అయ్యాను అని నమ్మకము.

మనము ఎంత బాబా ని నమ్మితే అంతే బాబా మన మీద విశ్వాసము చూపుతారు.

సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా

ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో  వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.

మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles