అయుష్షునిచ్చి ఆదుకున్న దీనబంధవుడు



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


భక్తుడు: గోపి

This audio has been prepared by Mrs Lakshmi Prasanna.

  1. Mir-2-Gopi-By Lakshmi Prasanna 3:27

నా పేరు గోపి,  సాయి బంధువులందరికి నా నమస్కారములు.

మా నాన్నకి ఆరోగ్యం బాగోలేక ESI హాస్పిటలులో జాయిన్ చేసాము.ICU  లో పెట్టారు.

డాక్టర్స్  పరీక్షలు చేసి ఊపిరితిత్తులు మొత్తం పాడై పోయాయి. చాలా కష్టం అని చెప్పారు.

శ్వాస తీసుకోవడమే చాలా కష్టంగా ఉంది. ఏమి చేయలేని పరిస్థితి. ఆక్సిజన్ పెడితేనే కొంత పర్వాలేదు.

రెండు నిముషాలు తీసివేసినా శ్వాస కష్టంగా ఉంది. ఇంటికి తీసుకెళ్లే పరిస్థితి లేదు. అలా అని ఇక్కడే ఉన్నా కొత్తగా వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ కూడా ఏమి కనిపించట్లేదు.

మేము భారమంతా బాబా మీద వేసి హాస్పిటలులోనే ఉంచాము. కానీ మా నాన్నకి ఇక్కడ హాస్పిటల్ వాతావరణం నచ్చక ఇంటికి వెళ్ళిపోదాం అని ఒకటే గొడవ చేస్తున్నారు.

హాస్పిటలులో అన్ని సౌకర్యాలు, చుట్టూ డాక్టర్స్ అందరు ఉన్నప్పుడే ఆక్సిజన్ తీసేస్తే కష్టపడుతున్నారు.

ఇంటి దగ్గర ఆక్సిజన్ సిలిండర్ పెట్టడానికి లేదు. అలాంటి పరిస్థితులలో ఎలా తనని తీసుకోని వెళ్ళాలని ఆలోచించా.

కానీ తాను ఇంటికే వెళ్దాం అని గొడవ చేసే సరికి భారం అంతా బాబా మీద వేసి ఇంటికి తీసుకొని వెళ్ళాను. ఏది చేసిన బాబా నువ్వే చూసుకోవాలి అనుకున్నాను.

కొన్నిరోజులు ఇంటి దగ్గర ఆక్సిజన్ సిలిండర్ తో ఉన్నారు. తరువాత అది కూడా వద్దు అని పీకి పారేసేవారు.

కానీ ఇంటికి వెళ్ళాక కొద్ది కొద్దిగా కోలుకున్నారు. ఊపిరితిత్తులు మొత్తం పాడైపోయిన మనిషి అలా ఎలా తిరుగుతున్నారు అనుకునే లాగా బాగై నన్ను బైక్ మీద తీసుకువెళ్ళేవారు.

మా నాన్న హాస్పిటలులో జాయిన్ అయినప్పుడు ఊరిలో మాకు సొంత ఇల్లు కూడా లేదు. మెల్లిగా ఇల్లు కట్టుకున్నాము. తానే దగ్గరుండి ఇల్లు మొత్తం తనకు నచ్చినట్టు కట్టించుకున్నారు.

అలా కొన్ని రోజులకి తన సొంత ఇంట్లో గడిపి ఈ మధ్యనే కళ్ళుమూసారు. బతకడమే కష్టం అని డాక్టర్స్ చెప్పిన మా నాన్నకి ఇన్ని రోజులు ఆయుష్షు పోసి బతికించారు బాబా.

అప్పుడే మా నాన్న చనిపోయి ఉంటే సొంత ఇల్లు కూడా లేకుండా నిర్జీవ దేహాన్ని ఎక్కడ పెట్టాలో తెలియక బాధపడే వాళ్ళం.

బాబామాకు ఆ పరిస్థితి రానివ్వకుండా, మాకు సొంత ఇల్లును ఇచ్చి, ఆ ఇంట్లో కొన్ని రోజులు సంతోషంగా ఉండేలా చేసి, తన కోరిక తీర్చి తనతో మా నాన్నని తీసుకువెళ్లారు.

బాబాని మేమంతా ఎప్పుడు బతికినన్ని రోజులు నమ్ముతూనే ఉంటాము.

           ~~~~సర్వం సాయినాధార్పణమస్తు~~~~

 

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles