భక్తురాలి కుటుంబం యొక్క ప్రతి సమస్యలోను వివిధ రూపాలలో వచ్చి ఆదుకున్న బాబా వారు.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


నాకు  చాలా రోజులు క్రితం తొడ మీద ఒక కురుపు వచ్చింది. నేను చాలా మందులు వాడాను కానీ తగ్గలేదు.

ముందు నేను ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. నొప్పి ఎన్ని రోజులు అయినా తగ్గక పోయేసరికి అమ్మకీ చెప్పాను. చాలా రోజులు నుండి ఉంది, ఏం చేసినా తగ్గటం లేదు అన్నాను.

అమ్మ అయ్యో! అవునా అంటూ బాధపడి, ఒక గురువారం నాడు నాకు నొప్పితో ఉన్న పుండు తగ్గిపోవాలని బాబా కి చెప్పి “శ్రీ సాయి సచ్చరిత్ర”  పారాయణం మొదలుపెట్టింది.

ఈ వారంలోనే ఒక రోజు అమ్మ ఒక్కతే ఇంట్లో ఉంది. నాన్న బయటికి వెళ్లారట. పారాయణం చేస్తూనే నిద్ర వచ్చిందట. అలాగే నిద్ర పోయిందట.

అమ్మకీ పెద్దగ మూలుగు వినిపించిందట. కలలో క్రిస్మస్ తాత లాగా ఒక ముసలాయన కనపడ్డాడట. చుట్టూ చూసి ఎవరు కనపడక, తలుపు కూడా తీసుకుని బయటికి కూడా వచ్చి చూసిందట.

ఎక్కడా ఎవరూ కనపడలేదట. మళ్ళీ వచ్చి పడుకుందట. మళ్ళీ పెద్దగా మూలుగు వినిపించిందట. ఆ మర్నాడు నా పుండు చితికి, నొప్పి తగ్గి పుండు కూడా త్వరలోనే తగ్గిపోయింది. నా నొప్పి బాధ బాబాయే తీసేసుకుని ఆయనే భరించారన్నమాట.

మా అమ్మ గారికి B . P ఉంది. ఉదయం, సాయంత్రం బి పి గురించి మాత్రలు వేసుకుంటుంది.

ఒక రోజు ఉదయాన్నే మా నాన్నగారు వాకింగ్ కి వెళ్లారు. అమ్మ టిఫిన్ చేసిందట ఆమె ఏం చేస్తుందో ఏమిటో తెలియకుండా బట్టలు లాగేసుకుంటోందట!

ఏంటేంటో పిచ్చి పిచ్చిగా చేస్తోందట! నాన్న వాకింగ్ నుండి వచ్చేటప్పటికి అమ్మ పరిస్థితి ఇది. నాన్నని ఇక్కడ ఉన్నవేంటి? ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటోందట.

నాన్నకి భయం వేసి నాకు ఫోన్ చేసారు. నేను ఒక చోట జ్యోతి పెడితే వాళ్ళ ఇంట పారాయణం చెయ్యటానికి వెళ్ళాను.

నేను ఇంటికి వచ్చేటప్పటికి నాన్న హాస్పిటల్ కి తీసుకెళ్లారు. నేను హాస్పిటల్ కి వెళ్ళాను.

డాక్టర్ అమ్మను టెస్ట్ చేసి ఏమీ లేదు. అంతా బాగానే ఉంది అంటూ ఏవో నాలుగు మాత్రలు ఇచ్చి పంపారు.

ఇంట్లో అమ్మ కళ్ళు మూసుకుని పడుకున్నదట. అమ్మ పక్కనే కాలు మీద కాలు వేసుకుని చిన్న పీట మీద మా అమ్మ తలని నిమురుతూ అమ్మని చూస్తూ బాబా కూర్చుని ఉన్నారట.

కాసేపటికి అమ్మకి మెలకువ వచ్చి చూస్తే ఎవరు లేరు ఆమె పక్కన. ఇంతకు ముందు జరిగిందంతా అమ్మకి గుర్తులేదు.

ఏరీ బాబా గారేరి చిరిగిన చొక్కాతో కాలు మీద కాలు వేసుకుని నన్నే చూస్తూ నా తల నిమురుతూ ఇక్కడ కూర్చుని ఉన్నారే బాబా. ఏరీ? ఏరీ? అంటోంది.

బాబా కనుక అమ్మని కాపాడి ఉండకపోతే అమ్మకి ఇంకా ఎక్కువై ఏ బ్రెయిన్ కైనా ఎఫెక్ట్ అయ్యి ఉండేదన్నారంతా!

ఒకసారి మా చెల్లెలు వాళ్ళింట్లో బాబా పూజ పెట్టుకున్నారు. ఆ పూజ కోసం మేమందరము వెళ్ళాము. మా చెల్లెలు పిల్లలు వేరే దగ్గర ఉన్నారు. మా నాన్న గారు కారు కొన్నారు.

ఆ సమయంలో వాళ్ళని తీసుకురావటానికి మా నాన్న గారు మా చెల్లెలు మా మరిది అంతా వెళ్లి పిల్లల్ని తీసుకువస్తున్నారు.

చీకటి పడిపోయింది కారేమో కొత్త. ఇంకా పూజ కోసం కొనాల్సిన సామాన్లు ఉన్నాయి.

కారు కొత్తది కావటాన కొత్త మోజులో అందరూ బయలు దేరి వెళ్ళారు. వచ్చేటప్పుడు కారు పంచరైపోయింది.

చీకటి మూలాన కారు కొత్త మూలాన మా వాళ్ళకి ఏం చెయ్యాలో తోచడంలేదు. మరో టైరు కూడా లేదు. సమయం అయిపోతుంది.

వచ్చేపోయే కార్లని ఆపుతున్నారట సహాయం కోసం, కానీ ఏ కారు ఆగడం లేదు.

”బాబా నీ పూజ కోసం ఇంకా కొనాల్సిన సామాన్లు ఉన్నాయి ఇక్కడే ఆలస్యం అయిపోతే వెళ్ళేటప్పటికి షాపులు మూసేస్తారు, ఎలాగా బాబా” అనుకుంటుందట మా చెల్లెలు.

ఇంతలో ఒక స్కూటర్ మీద ఒకతను వచ్చి వీళ్ళ ముందు ఆగాడు. ”ఏమిటి ఏం జరిగింది” అన్నాడతను. మా నాన్న గారు అప్పటికే చక్రం ఊడదీయటానికి ప్రయత్నం చేస్తున్నారట.

ఆ వచ్చి నాయన విషయం తెలుసుకుని మా నాన్నని తప్పుకోమని ఆ చీకట్లో ఆ చక్రం విప్పి. ఇది పంక్చర్ పడింది అన్నారట.

స్కూటర్ వెనకాల కూర్చోపెట్టుకొని ఊర్లో ఉన్న పంక్చర్ షాపుకి తీసుకువెళ్ళి పంక్చర్ వేయించి, మళ్ళీ మా నాన్నని ఎక్కించుకుని తీసుకువచ్చినాక మా మరిది ఆ వీల్ నందుకొని తను ఎక్కించడానికి ప్రయత్నం చేస్తున్నాడట.

ఆ స్కూటర్ ఆయన మా మరిదిని తప్పుకోమని తను కూర్చొని ఒక తిప్పు తిప్పి అయిపోతోంది అన్నారట.

మా చెల్లెలి కొడుకు ”అప్పుడే వీల్ వేయడం అయిపోయిందా?” అని అన్నాడట. ఆయన ”ఆ అయిపోయింది, కావాలంటే చూసుకో” అన్నాడట.

ఆ తరువాత మా చెల్లెలు ”రేపు బాబా పూజ ఉంది, మేమింకా కొనాల్సిన సామాన్లు ఉన్నాయి, బాబాకి షాల్ కొనాలి అని” అంటూ కంగారు పెడుతోందట.

ఆ స్కూటర్ ఆయన ”ఏం ఫరవాలేదు అమ్మా! రేపు పూజ బాగా చేస్తారు. మీరు వెళ్లేసరికి ఇంకా ఒక షాప్ తీసే వుంటుంది. నీకు కావాల్సిన రంగు కూడా అందులో దొరుకుతుంది” అని అన్నాడాయన ఆయన.

ఆయన వెళ్ళిపోతూ ఆయన స్కూటర్ లోంచి రెండు మామిడి పళ్ళు తీసి మా చెల్లెలి కూతురు ‘బంగినపల్లి’ మాత్రమే తింటుంది, మా చెల్లెలి కొడుకు ”రసాలు” మాత్రమే తింటాడు.

వాళ్ళిద్దరికి ఎవరు ఏం తింటారో అది వాళ్ళ చేతులో ఉంచాడాయన. ”అయ్యో! ఇంత సాయం చేసారు. ఇంకా ఈ పళ్ళు కూడా ఇస్తున్నారా?” అని వీళ్ళు అంటే,”

ఆయన ఏం ఫరవాలేదు మా తోటలో పళ్ళేలే! ఫరవాలేదు” అన్నాడాయన.

మా నాన్న గారు ఇంత సహాయం చేసారు కదా ఆయన, రేపు బాబా పూజ భోజనాలు అయ్యాక ఈయన కొకసారి ఫోన్ చేసి థాంక్స్ చెప్పుకుందాం అనుకొని ఫోన్ నెంబర్ అడిగి తీసుకున్నారు.

వీళ్ళు ఊర్లోకి వచ్చేటప్పటికి రాత్రి పది అయింది, ఆ స్కూటర్ ఆయన చెప్పినట్లుగా ఒకే ఒక్క షాప్ తీసి ఉందట.

మా చెల్లెలు ఎప్పుడు బాబాకి షాల్ కొన్నా ఆకుపచ్చ షాల్ మాత్రమే కొంటుంది. ఇప్పుడు కూడా ఆ షాప్ లో ఆకుపచ్చ షాల్ మాత్రమే ఉంది అని చెప్పాడట.

అది కొనుక్కొని ఇంటికి వచ్చి మర్నాడు పూజ భోజనాలు అన్నీ అయ్యాక అందరూ వెళ్ళిపోయాక, పూజ బాగా జరిగింది, అసలు ఇలా జరగటానికి నిన్న మనకి స్కూటర్ మీద వచ్చి సాయం చేసినాయన.

ఆయనే కనుక ఇంత సహాయం చేసి ఉండక పోతే అభాసుపాలు అయిపోను, అనుకోని నాన్న గారు ఆ స్కూటర్ ఆయనికి ఫోన్ చేసారు.

రింగ్ అవటం లేదు, మరోసారి ట్రై చేసారు. అసలు అటువంటి నెంబర్ తో ఎటువంటి ఫోన్ పని చేయటం లేదు అని వస్తోంది. మరి ఆ వచ్చిన వ్యక్తి బాబా కాక మరి ఎవరు?

2016 సంవత్సరంలో మొన్న నైమిశారణ్యం వచ్చేటప్పుడు మా చెల్లెలు వాళ్ళు రిజర్వేషన్ చేయించుకున్నారు.

తీరా ఆ రోజులకి ముందుగా బాగా వానలు పడి భీమవరం కేసి రైళ్లు సరిగ్గా నడవడం లేదు అని టీవీ లో చూపిస్తే, అలా చూపిస్తున్నారు అని మా చెల్లెలు తెగ కంగారు పడిపోతోంది.

ప్రయాణం దగ్గర కొచ్చేస్తుంది తీరా రైళ్లు నడవటం లేకపోతే ఏంటి పరిస్థితి. నైమిశారణ్యంలో గురువు గారి కార్యక్రమాలు దసరా రోజే ఉన్నాయి, వెళ్లలేక పోతామో ఏమో! అని చాలా కంగారు పడిపోతోంది.

ఏం చేయాలి అనుకుంటూ ఒక సారి రైల్వే స్టేషన్ కి ఫోన్ చేసి చూద్దాం అని మా చెల్లెలు స్టేషన్ కి ఫోన్ చేసిందట.

స్టేషన్ లో పని చేసేవాళ్ళు తెలుసు కానీ వాళ్ళ ఫోన్ నంబర్లు తెలియదు. అందుకని స్టేషన్ కి ల్యాండ్ లైన్ కి ఫోన్ చేసిందట.

చాలా సార్లు ట్రై చేసాక ఒకసారి ఎవరో బొంగురు గొంతుతోటి పైగా హిందీలో మాట్లాడాడట. భీమవరం నుండి నైమిశారణ్యం వైపు వెళ్లే రైలు వస్తుందా, అని మా చెల్లెలు అడిగిందట. వస్తుంది, వస్తుంది అంటూ హిందీలో సమాధానం చెప్పాడట.

నైమిశారణ్యంకి బయలుదేరేటప్పుడు మా మరిది స్టేషన్ కి వచ్చారట . ఆయనకీ స్టేషన్లో అందరూ బాగా పరిచయం ఉన్నారు.

ఆయన స్టేషన్ మాస్టర్ తో ఏమండి! మీకు ఫోన్లు ఎన్ని సార్లు చెయ్యాలి రింగ్ అవుతోంది, కానీ ఎంతకి ఎవరు ఎత్తరు అన్నాడట.

ఎవరో హిందీలో మాట్లాడారుట, అని అడిగాడట ఎప్పుడన్నాడట స్టేషన్ మాస్టర్, ఫలానా రోజు అన్నాడట మా మరిది,” అసలు మా స్టేషన్ లో హిందీలో మాట్లాడే వాళ్ళు ఎవరూ లేరు” అన్నారట.

మరో ముఖ్యం విషయం ఏమిటంటే మా ల్యాండ్ లైన్ ఫోన్ పాడయిపోయి మూడు నెలలు అయింది అన్నాడట.

మా వాళ్ళు మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ డెడ్ అని వస్తోందట. మా చెల్లెలితో మాట్లాడింది మరి ఎవరో కాదు ”బాబా” యే దాని ఆరాటం చూసి దానికి ఫోనులోనే సమాధానం చెప్పారు.

ఎందుకంటే నైమిశారణ్యంలో ”బాబా” కార్యక్రమాలు జరుగుతున్నాయి.

”బాబా” గుడిని బాబాయే స్వయంగా గురువుగారికి చెప్పి, మరీ కట్టించుకున్న గుడి అది.

సర్వం శ్రీ సాయినాథ చరణారవిందార్పణ మస్తు

శుభం భవతు

The above miracle has been typed by: Mrs. Raja Rajeswari Sainathuni

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles