Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయి భక్త కోటికి ఓం సాయిరాం …
నాకు చదువుకోవటం అంటే చాలా ఇష్టం. నాన్న గారు నేను చదువుకోవటానికి ఒప్పుకోలేదు.
తరువాత మా అమ్మగారి బలవతంతో సరే అన్నారు కానీ 5th క్లాస్ వరుకు మాత్రమే అని చెప్పారు. సరే అని 5th క్లాస్ వరకు చదివించారు.
వేసవి సెలవులకు మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళాను. ఇంటి ఎదురుగానే బాబాగారి గుడి.
రోజు ఏవో పాటలు వినిపించేవి. చాలా బాగున్నాయి మనసుకి నచ్చేవి, కానీ భాష తెలిసేది కాదు. ఎలాగైనా నేర్చుకుని పాడాలి అనిపించేది…
అమ్మమ్మ గుడికి వెళ్తాను అంటే సరే కానీ సాయంత్రం వేళ మాత్రమే వేళ్ళు అని చెప్పారు. ఆలస్యం చెయ్యకుండా మర్నాడు సాయంత్రమే బాబాగారి గుడికి వెళ్ళాను.
చిన్నతనం. ఒక్కదాన్నే వెళ్ళాను. ఎప్పుడు ఇంట్లోనుంచి బయటకు పంపేవారు కాదు.
స్కూల్ కి కూడా అమ్మ తీసుకెళ్లి తీస్కొచేవారు. అలాంటిది మొదటిసారి ఒక్కదాన్నే వెళ్లేసరికి చాలా భయం అనిపించింది.
బాబాగారిని చూసిన తరువాత భయం ఏమి అనిపించలేదు. చాలా ధైర్యం, ఏదో తెలియని సంతోషం, మానసిక ప్రశాంతత.
తెలియకుండానే కన్నీళ్లు (ఆనంద భాష్పాలు). ఆ మొదటి అమూల్యమైన అనుభూతి వర్ణనాతీతం…
ఇంటికి వచ్చాక చుట్టు ప్రక్కన పిల్లలు అంతా పరిచయం అయ్యారు.
ఒక అమ్మాయి “నేను 7th క్లాస్ కి వెళ్తాను కాబట్టి 6th క్లాస్ పుస్తకాలు నీకు ఇస్తాను” అని చెప్పింది. చాలా సంతోషించాను. పుస్తకాలు తీసుకున్నాను.
రోజూ మానకుండా సాయంత్రం హారతికి వెళ్లేదాన్ని. సెలవులు తరువాత మా ఇంటికి వెళ్ళాక జరిగింది అంతా అమ్మకు చెప్పాను.
అమ్మ నాన్నగారితో మాట్లాడి చదువుకోవటానికి ఒప్పించింది మీరు పుస్తకాలు కొనక్కర్లేదు అని. నాన్నగారితో బాబాగారు ఒప్పించారు.
అలా అలా 10th క్లాస్ వరుకు ఆ అమ్మాయి దగ్గర పుస్తకాలు తీసుకుంటూ చదువుకునేలా చేసి నా కోరిక తీర్చారు బాబాగారు.
ఇంటర్మీడియట్ చదువుకోవటానికి నాన్నగారు ఒప్పుకోలేదు. ప్రక్క వూరు వెళ్ళాలి కాలేజీకి అందుకని. మళ్ళీ బాబాగారు నాకు సహాయం చేసారు నాన్నగారి స్నేహితుడి రూపంలో.
ఆయన “మన ఊరిలోనే కాలేజీ పెట్టారు. మీ అమ్మాయికి 10th క్లాస్ లో మంచి మార్కులు వచ్చాయి కాబట్టి ఎటువంటి ఫీజు కట్టక్కర్లేదు. చదివించు” అని మా నాన్నగారితో చెప్పారంట.
ఇంక బాబాగారి దయవల్ల హాయిగా చదువుకున్నాను. డిగ్రీ చదువుకోవటానికి అదే సమస్య ఎదురైంది. బాబాగారు మళ్ళీ సహాయం చేశారు అదే స్నేహితుడి రూపంలో.
మన ఊరిలోనే డిగ్రీ కాలేజీ పెట్టారు. మీ అమ్మాయికి ఇంటర్మీడియట్లో మంచి మార్కులు వచ్చాయి కాబట్టి ఎటువంటి ఫీజు కట్టక్కర్లేదు. చదివించు” అని మా నాన్నగారితో చెప్పారంట.
ఆలా డిగ్రీ చదువు కూడా మంచి మార్కులుతో ప్యాస్ అయ్యేలాగా చేశారు బాబాగారు.
పి.జి. చదువుకోవటానికి నాన్నగారు అస్సలు ఒప్పుకోరు. మళ్ళీ అదే సమస్యకి తోడు ఇంకొక సమస్య.
“ఇంక చదివించింది చాలు పెండ్లి చేసేయ్” అని బంధువులు అందరూ నాన్నగారితో చెప్పారు. బాబాగారు సహాయం చేశారు.
ప్రక్క వూరిలో బాగా పేరు ఉన్న పెద్ద కాలేజీలో ప్రిన్సిపాల్ మా నాన్నగారికి ఫోన్ చేసి, “మీ అమ్మాయి డిగ్రీ కాలేజీ టాపర్ అని చూసి మీకు ఫోన్ చేసాను. మా కాలేజీలో మీ అమ్మాయికి సీట్ వచ్చింది. చదివించండి” అని చెప్పారు.
బాబాగారు నాన్నగారిని ఒప్పించారు. మంచి మార్కులుతో పి.జి. ప్యాస్ అయ్యేలా చేశారు.
5th క్లాస్ దగ్గరే ఆగిపోయే నా చదువుని పి.జి. దాకా చదువుకొనేలా నన్ను అనుగ్రహించారు బాబాగారు.
చదువు, ఉద్యోగం, పెళ్లి, పిల్లాడు ఇలా ప్రతీది నాకు ఒక తండ్రి స్థానంలో ఉండి అంతా నడిపించారు.
ఇప్పటికీ అనుక్షణం నా వెంటే ఉండి నన్ను నడిపిస్తున్నారు. ఇంత సంతోషంగా ఉండేలాగా నన్ను చూసుకుంటున్నారు.
నమ్మలేని మహిమ. ఇప్పటికి నాకు కల నిజామా అనిపిస్తుంది.
అలాంటి మహా మహిమాన్వితమైన లీలలు ప్రదర్శించిన బాబాగారి నా శతకోటి వందనాలు.
Latest Miracles:
- నోరు తెరచి అడగకుండానే మనసులోని కోరికను తీర్చిన బాబా వారు
- భక్తురాలి ప్రయాణములో తోడుగా వచ్చి, అన్నీ తానై చూసుకున్న బాబా వారు.
- భక్తురాలి కుటుంబం యొక్క ప్రతి సమస్యలోను వివిధ రూపాలలో వచ్చి ఆదుకున్న బాబా వారు.
- మాతాజీ క్రిష్ణ ప్రియాను సద్గురువు చేసిన జగద్గురువు
- బాబా మహిమ – సరస్వతి కటాక్షం
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments