శక్తుల కూడలి …. మహనీయులు – 2020… మే 26



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయిబాబా హిందూ, మహమ్మదీయ మతముల మధ్య సామరస్యాన్ని నెలకొల్పాడు. సాయి మహమ్మదీయ మతంలోకి మారిన ఒక వ్యక్తిని తీవ్రంగా గర్హించాడు.

విద్యారణ్యులు తెలుగువారు. ఈయనను అపార శంకర భగవత్పాదులు అంటారు. హిందూమత పునరుద్ధరణ చేసారు. హిందూ సామ్రాజ్యాన్ని ప్రప్రథమంగా నెలకొల్పిన సన్యాసి.

గతంలో హరిహర, బుక్కరాయలను ముస్లింలు తమ మతంలోకి బలవంతాన మార్చారు. ఒకసారి ఆ ఇద్దరు విద్యారణ్యులకు తారసపడ్డారు.

ఆ సోదరుల క్షాత్రశక్తిని, ఉజ్జ్వల భవిష్యత్తును ఉహించాడు. వారిని తిరిగి హిందూమతంలోకి తీసుకున్నాడు.

ఆయన ఒకసారి మాతంగ పర్వతం ఎక్కి చూడగా, ఒక శునకాన్ని కుందేలు తరమసాగింది. అది ఆ స్థలమహిమగా గుర్తించి, అచ్చటనే విజయనగర సామ్రాజ్యానికి శంకుస్థాపన చేశారు.

అంతేకాదు, అది ధర్మ సామ్రాజ్యమని, దాని అధిపతి విరూపాక్ష దేవుడని, ఆ దేవుని ప్రతినిధులే హర హర బుక్కరాయాది పాలకులని కట్టడి చేశారు.

ఇతర హిందూ రాజుల నుండి వ్యతిరిక్తత లేకుండా చూసాడు. దక్షిణాదిలో శృంగేరి, కంచి పీఠములు మాత్రమే చాలవని విరూపాక్ష పుష్పగిరి పీఠాలు మొదలైన పీఠాలను స్థాపించారు.

విద్యారణ్యులు హిందూ సామ్రాజ్య నిర్మాత మాత్రమే కాదు. శృంగేరి పీఠాధిపతి కూడా.

విశేషమేమిటంటే ఈయన తమ్ముని తరువాత ఆ పీఠాన్ని అధిరోహించారు. శృంగేరిని  జనావాసంగా చేశాడు.

చందనదారు శారదా దేవి ప్రతిమకు బదులుగా పంచలోహ ప్రతిమను స్థాపించారు. శృంగేరీ మఠ నిర్వహణ, అటు విజయనగర రాజ్య చక్రము ట్రిప్పుచూ, ఈయన ఒక రచన – పంచదశిని గూర్చి సాయి అది మన ఖజానా అన్నారు.

పంచదశి వాదప్రతివాద యుద్ధరంగమునకే పరిమితము కాకుండా, సాధారణ జనులకు ఆద్వైతానుభవమునకు దారిచూపు మార్గదర్శి.

విద్యారణ్యులు కారణజన్ములు “ఆయన ఒక వేదవ్యాసుడు. ఒక శుక్రాచార్యుడు. ఒక చాణుక్యుడు. ఒక చంద్రగుప్తుడు. ఈ నలుగురి అంశలు ఒకటైతే శ్రీ విద్యారణ్యులు, జ్ఞానశక్తి, తపశ్శక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, నాలుగు శక్తుల కూడి శ్రీ  విద్యారణ్యులు”

ఆయన శక్తిని గూర్చి తెలుపుటకు అందరును అశక్తులే.

శ్రీ విద్యారణ్యులు 26  మే 1386 లో పరబ్రహ్మలో లీనమైనారు.

నేడు 26 మే.

విద్యారణ్యులను స్మరించి తరించెదము గాక!

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles