భక్తురాలి ప్రయాణములో తోడుగా వచ్చి, అన్నీ తానై చూసుకున్న బాబా వారు.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


A. త్యాగరాజు గారి అనుభవాలు నాల్గవ భాగం

కృష్ణవేణి గారి చిన్నమ్మాయి పుట్టినప్పుడు పెద్దమ్మాయి స్కూల్ కి మూడు నెలలు సెలవు అడిగి తనతో పాటు పుట్టింటికి తీసుకువెళ్ళింది.

కాన్పు అయిన తరువాత మూడో నెలకి తిరిగి వెళ్లిపోవాలంటే ఇంట్లో అందరూ మంచి రోజులు లేవంటూ ఆపుతున్నారు.

ఆవిడ దగ్గరలో వున్న ‘బాబా’ గుడికి వెళ్లి “బాబా నీకన్నీ తెలుసు, స్కూల్లో ఇంతకు మించి పర్మిషన్ ఇవ్వరు, అందుచేత మేము వెళ్ళిపోవాలి,

పెద్దవాళ్ళు ఇప్పుడు మంచిది కాదు వెళ్ళొదు అంటూ అభ్యంతరాలు చెబుతున్నారు, బాబా మేము నీ మీదే భారం ఉంచి బయలుదేరుతున్నాము, నువ్వే చూసుకో” అంటూ బాబాకి చెప్పి బయలుదేరిపోయింది.

ఆవిడ హ్యాండ్ బ్యాగ్ లో పిల్లల నగలు, కొంచెం డబ్బు వున్నాయి. చెన్నై స్టేషన్ కి వాళ్ళ ఆయన వచ్చారు.

రైలు దిగి స్టేషన్ బయటికి వచ్చాక చూసుకుంటే హ్యాండ్ బ్యాగ్ లేదు, ఆవిడ కంగారుగా వాళ్ళ ఆయనకి చెప్పింది.

ఆయన తిరిగి స్టేషన్లో రైలు దగ్గరికి పరుగున వెళ్లి చూసేసరికి వీళ్ళు కూర్చున్న భోగిలో వీళ్ళ సీట్ల ఎదురుగా కూర్చున్న ఆవిడ ఆ హ్యాండ్ బ్యాగ్ ను తన దగ్గరే ఉంచుకొని ఎదురు చూస్తోందిట,

ఈయన అక్కడికి వెళ్ళగానే, ఆవిడ బ్యాగ్ చేతికిచ్చి మర్చిపోయినట్లున్నారు, అంతా సరిగా వున్నాయో లేదో చూసుకోండి అని చెప్పిందట.

ఆయన వాళ్ళ బ్యాగ్ నంతా ఒకసారి చూసుకొని ఆ బ్యాగ్ తీసివుంచిన ఆవిడకి కృతజ్ఞతలు చెప్పి బయటికి వచ్చారట.

ఈ లోపు కృష్ణవేణి గారు బాబా ఈ నగలు, డబ్బు బ్యాగ్ దొరికితే ‘సచ్చరిత్ర’ పారాయణ చేస్తాను అని అనుకుందట.

పెద్దలమాట పెడచెవిన పెట్టినందుకు ఈ కర్మను అనుభవించేలాగా చేసి బాబా తానే దగ్గరవుండి ఆ బ్యాగ్  ను పోనీయకుండా కాపాడినందుకు మనసారా ధన్యవాదాలు అర్పించిందావిడ. 

కృష్ణవేణి గారు, అక్టోబర్ ౩౦వ తేదీ వాళ్ళ పెద్ద అమ్మాయి పుట్టినరోజు. ఆ రోజు మైలాపూర్ లో ఉన్న ‘బాబా’ గుడికి వెడుతూంటుంది.

మొదటి పుట్టిన రోజున బాబా గుడికి, బాబా ఆశీర్వాదం తీసుకుందాం అనుకుంటే ఇంటి నిండా చుట్టాలు ఉన్నారు. ఇప్పుడు వద్దు అన్నారత్తగారు.

పుట్టినరోజు నాడు బాబా ఆశీర్వాదం తీసుకోకపోతే బ్రతుకు వ్యర్థం అనుకుని బలవంతంగానే గుడికి బయలు దేరింది.

ఆ బాబా గుడిలో ప్రత్యేకత ఏమిటంటే మనం తెచ్చిన పువ్వులు, శాలువా స్వయంగా మనమే బాబా మేడలో వేసి, అలంకరించుకోవచ్చు.

పుట్టిన రోజు అంటే బాబా పక్కనే నిలబెట్టి అర్చన చేసి, బాబా మేడలో దండ తీసి మన మేడలో వేస్తారు. ఆ విధంగా మా పాపను కూడా ఆశీర్వదిస్తారనుకుందిట.

పూజ అయినా తర్వాత చూస్తే బాబా మేడలో పూల దండ లేకపోవడంతో పూజారి విగ్రహం వెనుక ఉన్న ఫోటోకి ఉన్న దండ తీసి పాప మేడలో వేసాడు. ఆవిడ చాల సంతోషపడిపోయింది.

ఇటువంటి ఆశీర్వాదం ఎవరికి దొరికి ఉండకపోవచ్చు. అలాగే 5వ సంవత్సరం పుట్టిన రోజు కూడా ఉదయాన్నే చలివల్ల గుడికి వెళ్లలేకపోయింది.

సాయంత్రం వెడదామనుకుంటే చిన్నగా వాన కూడా మొదలయింది. అయినా కూడా బాబా గుడికి బయలు దేరారు కానీ, చిన్న పాపకి జలుబువల్ల డాక్టర్ని కలిసి వెళ్ళాల్సి వచ్చింది.

తీరా వీళ్ళు వెళ్లేసరికి డాక్టర్ దగ్గర పెద్ద క్యూ ఉంది. ఈ లోపల ఒక నర్స్ వచ్చి లోపల పేషెంట్ బయటకు రాగానే మీరు లోపలకి వెళ్ళండి అని చెపింది.

ఆ నర్స్ సహాయంతో ఎలాగో తొందరగా డాక్టర్ కి చూపించేసుకుని గుడికి బయలు దేరారు. అక్కడ నుండి గుడికి వెళ్లాలంటే గంట సమయం పడుతుంది.

మధ్యలో ట్రాఫిక్ లేకుండా గుడి మూసేయకుండానే వారు సకాలంలో గుడికి బాబా దయవల్ల చేరుకోగలిగారు.

అప్పటికే చాలా ఆలస్యం అయింది గుడి మూసేస్తారు అని కంగారు పడుతూ గుడికి చేరుకొని బాబా దర్శనం చేసుకున్నారు.

వాళ్ళ మామ గారు ఫోన్ చేసి వర్షంలో బాగా తడిసిపోయారా? ఎందుకంటే ఇక్కడ మీరు వెళ్ళంగానే చాలా పెద్ద వర్షం వచ్చింది అని అన్నారుట. వాళ్ళు ఎక్కడా వర్షంలో తడవకుండా బాబా తన దర్శనం చేయించాడు.

ఒక సారి పిల్లలు సెలవులకి చెన్నై నుండి ఒంగోలు వెళ్ళారు. వాళ్ళ ఆయన దిగబెట్టారు. కానీ తిరిగి తీసుకురావడానికి కుదరలేదు.

అలాగే వాళ్ళ నాన్నకి చెన్నైలో దిగబెట్టడానికి కుదరడం లేదు. వాళ్ళాయన ఫోన్ లో రమ్మనమని, వాళ్ళ నాన్నను దింపమని చెప్పడం, ఆయన రేపో మాపో అని వాయిదాలు వేయడం జరుగుతుంటే,

ఆవిడకి విసుగు వచ్చి బాబాని ‘నీ అనుమతితోనేగా నేను ఇక్కడికి వచ్చింది ఇప్పుడు నన్ను దింపడానికి వీళ్ళకు కుదరటం లేదు, నువ్వు వస్తావా?” అని విసుగ్గా అడిగిందట.

ఈ లోపుగా వాళ్ళ నాన్న గారు టికెట్ బుక్ చేసి రేపే ప్రయాణం అని చెప్పారు. మరునాడు బయలు దేరి రైలు సింగరాయకొండ వచ్చేటప్పటికి వాళ్ళ ముందు సీట్లో ఒక ముసలాయన వచ్చి కూర్చున్నాడట.

ఆయన చాలా పొడుగ్గా ఉండి ప్యాంటు షర్ట్ వేసుకొని ఉన్నాడుట. చాలా ప్రశాంతంగా ఉన్నాడట. వాళ్లకి దారి పొడుగునా జాగ్రత్తలు చెప్తూనే వున్నాడట.

వాళ్ళ పెద్ద పాప సీటు పైన నిలబడి ఉంటె “అమ్మా! జాగ్రత్త కింద పడతావని,” చిన్న పాప ఏడుస్తుంటే ఈవిడ ఒళ్ళో పడుకోబెట్టుకుంటే అలా కాదని భుజం మీద వేసుకోమని చెప్పాడట.

ఒళ్ళో పెట్టుకుంటే ఏడుపు ఆపని పాప ఆయన చెప్పినట్లు చేస్తే ఏడుపు మానేసింది. వీళ్ళని రిసీవ్ చేసుకోడానికి వాళ్ళ ఆయన స్టేషన్ కి వచ్చారుట. రైలు ఆగాక రైలు భోగీ కిటికీ దగ్గర నిలబడ్డాడుట వాళ్ళాయన.

వాళ్ళు రైలు దిగి వాళ్ళ ఎదురుగా కూర్చున్న ఆ ముసలాయనకు వెళ్లి వస్తామని చెబుదామని చూసారుట. ఆ ముసలాయన వీళ్ళకి కనబడలేదు.

రైల్లో నుండి కిటికీ దగ్గర వాళ్ళ ఆయన్ని చూసి ఆ ముసలాయన తనలో తానే ఎదో మాట్లాడుకుంటూ ఒక లాగ నవ్వడం ఆవిడకి గుర్తుకు వచ్చిందట.

నాతో వచ్చి మీరు దిగబెట్టగలరా? అని బాబాని ఆవిడ విసుగ్గా అన్నా, ఎటువంటి కోపం లేకుండా, ఆవిడ వెంట ఉండి తీసుకువచ్చి వాళ్ళాయనకు అప్పగించి వెళ్ళిపోయాడు బాబా.

 సర్వం శ్రీ సాయినాధ చరణావిందార్పణ మస్తు.

శుభం భవతు

The above miracle has been typed by: Shiva Kumar Bandaru

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles